ETV Bharat / sports

ఇండిపెండెన్స్​ డే రోజే ధోనీ, రైనా రిటైర్మెంట్- అప్పుడే ఎందుకంటే? - MS Dhoni Retirement

author img

By ETV Bharat Sports Team

Published : Aug 15, 2024, 11:28 AM IST

Cricketers Retired 15th August: 2020 ఆగస్టు 15న భారత క్రికెట్​లో బెస్ట్ ఫ్రెండ్స్ ధోనీ, రైనా కెరీర్​కు ముగింపు పలికారు. ఒకే రోజు రిటైర్మెంట్ ప్రకటించి ఫ్యాన్స్​ను ఆశ్చర్యానికి గురిచేశారు. అలా చేయడానికి గల రీజన్​ను రైనా రిలీల్ చేశాడు. మరి రైనా ఏం చెప్పాడంటే?

Cricketers Retired 15th August
Cricketers Retired 15th August (Source: Getty Images)

Cricketers Retired 15th August: క్రికెట్​లో ఎమ్ ఎస్ ధోనీ, సురేశ్ రైనా ఫ్రెండ్​షిప్​కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. వీళ్లిద్దరూ 6 నెలల గ్యాప్​లో టీమ్ఇండియా తరఫున అరంగేట్రం చేసి జట్టుకు అనేక విజయాలు అందించారు. అటు ఐపీఎల్​లోనూ ధోనీ, రైనా చెన్నై సూపర్ కింగ్స్​ జట్టుకు చాలా కాలం ఆడారు. దీంతో వీరి మధ్య బాండింగ్ మరింత పెరిగింది. ఇక దాదాపు రెండు దశాబ్దాలపాటు ఆటలో కొనసాగిన వీరిద్దరూ ఒకే రోజు కెరీర్​కు గుడ్​బై చెప్పి ఆశ్చర్య పరిచారు.

2020 ఆగస్టు 15న ధోనీ అంతర్జాతీయ క్రికెట్​కు వీడ్కోలు పలికాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్​ చేసి తన రిటైర్మెంట్​ ప్రకటించాడు. ఇక ధోనీ రిటైర్మెంట్ ప్రకటన చేసిన కొద్ది గంటల్లోనే తన సహచర ఆటగాడు, బెస్ట్ ఫ్రెండ్ సురేశ్ రైనా కూడా ఆటకు గుడ్​బై చెప్పేశాడు. దీంతో ఒకే రోజు రిటైర్మెంట్​ ప్రకటించి ఫ్యాన్స్​ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశారు.

కాగా, ఆటకు వీడ్కోలు పలికిన రెండు రోజులకు రైనా తన రిటైర్మెంట్ గురించి మాట్లాడాడు. ధోనీ గుడ్​బై చెప్పిన రోజే తాను కూడా కెరీర్​కు ముగింపు పలకడానికి కారణాన్ని చెప్పాడు. 'మేం ఆగస్టు 15రోజే రిటైర్ అవ్వాలని ముందే నిర్ణయించుకున్నాం. ఎందుకంటే? ధోనీ జెర్సీ నెంబర్ 7, నా జెర్సీ నెంబర్ 3. రెండు దగ్గరగా రాస్తే 73 అవుతుంది. అయితే ఈ ఆగస్టు 15నాటికి భారత్​కు స్వాతంత్య్రం సిద్ధించి 73 సంవత్సరాలు పూర్తి అవుతుంది. అందుకే మేం రిటైర్మెంట్ ప్రకటించడానికి ఇదే మంచి రోజు అని భావించాం' అని రైనా అన్నాడు.

ఇక 2004 డిసెంబర్​లో ధోనీ అరంగేట్రం చేయగా, రైనా 2005 జులైలో డెబ్యూ మ్యాచ్ ఆడాడు. ఈ క్రమంలోనే వీరిద్దరూ టీమ్ఇండియా అనేక విజయాల్లో కీలక పాత్ర పోషించారు. భారత్​కు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ఏకైక కెప్టెన్​గా ధోనీ రికార్డు సృష్టించగా, అంతర్జాతీయ టీ20ల్లో సెంచరీ సాధించిన తొలి భారత ప్లేయర్​గా రైనా ఘనత సాధించాడు.

క్రికెట్​లో 'విరాటే' కింగ్, మరి ధోనీ?- రైనా ఇంట్రెస్టింగ్ ఆన్సర్! - Suresh Raina MS Dhoni

'ఆ విషయం గురించి ధోనీకి అప్పుడే చెప్పా' - దూబాయ్ రూమ్​ కాంట్రవర్సీపై రైనా క్లారిటీ! - Suresh Raina CSK

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.