Most Olympic Medals: 33వ సమ్మర్ ఒలింపిక్స్ జులై 26 నుంచి ఆగస్టు 11 వరకు ఫ్రాన్స్‌లోని పారిస్, ఇతర 16 నగరాల్లో జరగనుంది. ఫ్రెంచ్ రాజధాని ఈ అతిపెద్ద క్రీడా సంబరానికి ఆతిథ్యం ఇవ్వడం ఇది మూడోసారి. గతంలో 1900, 1924లో కూడా ఫ్రాన్స్‌లో ఒలింపిక్స్ జరిగాయి. అయితే ఎక్కువసార్లు ఒలింపిక్స్ నిర్వహించిన ఘనత లండన్‌కి దక్కుతుంది. 1908, 1948, 2012లో ఇక్కడ గేమ్స్ జరిగాయి. లండన్ తర్వాత ప్యారిస్ మూడు ఒలింపియాడ్‌లకు ఆతిథ్యం ఇచ్చిన రెండో నగరంగా రికార్డు సొంతం చేసుకోనుంది.
ఒలింపిక్స్‌లో సక్సెస్ఫుల్
సమ్మర్, వింటర్ ఒలింపిక్స్ చరిత్రలో యునైటెడ్ స్టేట్స్ అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచింది. యునైటెడ్ స్టేట్స్ అథ్లెట్లు ఇప్పటివరకు 16 వేర్వేరు ఒలింపిక్స్‌లో అత్యధిక పతకాలు సాధించారు. రెండు సీజన్లకో యూఎస్ఏ ఇప్పటి వరకు అత్యధికంగా 2959 పతకాలను గెలుచుకుంది. కాగా, భారత్ ఖాతాలో 35 పతకాలు ఉన్నాయి. అందులో 10 గోల్డ్ మెడల్స్‌తో భారత్ 58వ స్థానంలో ఉంది.
ఉత్తమ ఒలింపియన్ మైఖేల్ ఫెల్ప్స్
అత్యంత ప్రసిద్ధ అమెరికన్ అథ్లెట్లలో ఈతగాడు మైఖేల్ ఫెల్ప్స్ ఒకరు. ఫెల్ప్స్ 2000 నుంచి 2016 మధ్య జరిగిన ఐదు ఒలింపిక్ ఎడిషన్లలో 28 పతకాలు సాధించాడు. ఒలింపిక్ చరిత్రలో అత్యధిక పతకాలు గెలిచిన అథ్లెట్‌గా రికార్డు క్రియేట్ చేశాడు.
సమ్మర్, వింటర్ ఒలింపిక్స్‌లో అత్యధిక పతకాలు సాధించిన దేశాలు
దేశం | గోల్డ్ | మొత్తం పతకాలు |
అమెరికా | 1175 | 2959 |
సోవియట్ యూనియన్ | 473 | 1,204 |
జర్మనీ | 306 | 922 |
గ్రేట్ బ్రిటన్ | 296 | 950 |
చైనా | 285 | 713 |
ఫ్రాన్స్ | 264 | 889 |
ఇటలీ | 259 | 759 |
స్వీడన్ | 212 | 679 |
నార్వే | 209 | 568 |
రష్యా | 194 | 544 |
భారత్ | 10 | 35 |
India Olympic Medals: భారతదేశం ఒలింపిక్స్‌లో స్వాతంత్య్రానికి ముందు 1900 నుంచి పాల్గొంటోంది. అప్పటి నుంచి 25 ఒలింపిక్స్‌లో మొత్తం 35 పతకాలు గెలుచుకుంది. ఇందులో హాకీ (12) జట్టు గెలిచిన పతకాలే ఎక్కువగా ఉన్నాయి. భారత హాకీ జట్టు మొత్తం 8 స్వర్ణాలు, 1 రజతం, 3 కాంస్యాలు దక్కించుకుంది. 1896, 1904, 1908, 1912 ఒలింపిక్స్‌లో భారత్ నుంచి ఎవరూ ప్రాతినిధ్యం వహించకపోవడం గమనార్హం. అలానే భారతదేశ అథ్లెట్లు ఎప్పుడూ వింటర్ ఒలింపిక్స్ పతకాలు గెలవలేదు. ఇక ఈసారి పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ నుంచి 117 మంది అథ్లెట్లు పాల్గొంటున్నారు. ఈసారి ఇండియా ఎక్కువ పతకాలు గెలుస్తుందనే అంచనాలు ఉన్నాయి.
హాకీకి గోల్ కీపర్ శ్రీజేశ్ గుడ్‌బై- పారిస్ ఒలింపిక్స్ లాస్ట్!
నీరజ్‌కు రూ.5కోట్లు, సింధుకు రూ.3కోట్లు- ఏ అథ్లెట్‌కు ఎంత ఖర్చైందో తెలుసా? - Paris Olympics 2024