Shami Syed Mushtaq Ali Trophy : టీమ్ఇండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ అదరగొట్టాడు. అయితే ఈసారి అదరగొట్టింది బంతితో కాదు, బ్యాటుతో. 17 బంతుల్లోనే 32 పరుగులు బాదాడు. ఈ మెరుపు ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు ఉన్నాయి. అయితే షమీ ఈ బౌండరీలు స్టార్ పేస్ సందీప్ శర్మ బౌలింగ్‌లో బాదడం మరింత విశేషం. కాగా, తన ఫిట్‌నెస్‌పై చర్చలు జరుగుతున్న నేపథ్యంలో షమీ ఈ విధంగా బ్యాటింగ్‌లోనూ రఫ్పాడించడం అతడికి కలిసొచ్చే అంశం.
2024 సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో బంగాల్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న షమీ సోమవారం జరిగిన ప్రీ క్వార్టర్ ఫైనల్లో బరిలోకి దిగాడు. బంగాల్- చండీగఢ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గిన చండీగఢ్ బౌలింగ్ ఎంచుకుంది. షమీ 15.2 ఓవర్ వద్ద క్రీజులోకి వచ్చాడు. 19వ ఓవర్ వరకు షమీ 11 బంతుల్లో 14 పరుగులు చేశాడు. ఆఖరి ఓవర్లో స్ట్రైకింగ్‌లో ఉన్న షమీ రెండు సిక్స్‌లు, ఓ ఫోర్ సహా 19 పరుగులు బాదాడు. దీంతో బంగాల్‌కు 159 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ దక్కింది.
Bengal have set a target of 160 in front of Chandigarh 🎯
— BCCI Domestic (@BCCIdomestic) December 9, 2024
Mohd. Shami provides a crucial late surge with 32*(17)
Karan Lal top-scored with 33 (25)
Jagjit Singh Sandhu was the pick of the Chandigarh bowlers with 4/21#SMAT | @IDFCFIRSTBank
Scorecard ▶️ https://t.co/u42rkbUfTJ pic.twitter.com/gQ32b5V9LN