Mohammed Shami Daughter : తన బౌలింగ్ స్కిల్స్‌తో టీమ్ఇండియాకు ఎన్నో విజయాలను అందించిన స్టార్ క్రికెటర్ మహమ్మద్ షమీ తాజాగా తన కుమార్తె ఐరాను తలుచుకుని ఎమోషనలయ్యాడు. తనను కలుసుకోలేకపోతున్నానంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. వివాదాల కారణంగా గత కొన్నాళ్లుగా షమీ తన భార్య హసిన్ జహాన్‌కు దూరంగా ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో కుమార్తెను చూడటానికి గానీ మాట్లాడటానికి కానీ తనను అనుమతించడం లేదంటూ పేర్కొన్నాడు. కొన్ని సందర్భాల్లో మాత్రమే ఆ చిన్నారితో మాట్లాడుతున్నానంటూ బాధపడ్డాడు. "ఎవరూ తమ కుటుంబాన్ని, కానీ పిల్లలను కానీ కోల్పోవాలని అనుకోరు. కానీ కొన్ని పరిస్థితులు మన చేతుల్లో అస్సలు ఉండవు. నేను తనను చాలా మిస్ అవుతున్నా." అంటూ షమీ ఎమోషనలయ్యాడు.
"తను (హసిన్ జహాన్) పర్మీషన్ ఇస్తేనే నేను ఐరాతో మాట్లాడగలను. నా కుమార్తె నాతో మాట్లాడటం ఆమెపై ఆధారపడి ఉంది. చాలా రోజుల నుంచి నేను ఐరాను చూడలేదు. నా కూతురు ఆరోగ్యంగా ఉంటూ అన్నింటిలో విజయం సాధించాలని నేను కోరుకుంటున్నాను. హసిన్‌కు నాకు మధ్య జరిగే వివాదం మా వరకు మాత్రమే. అక్కడ ఐరా సంతోషంగా ఉంటోందని అనుకుంటున్నాను" అని షమీ అన్నాడు.
Mohammed Shami Wife : 2014లో షమీ హసిన్ జహన్ అనే మోడల్‌ను వివాహం చేసుకున్నాడు. మరుసటి ఏడాది ఈ జంటకు ఐరా అనే చిన్నారి జన్మించింది. అయితే 2018లో షమీపై తన సతీమణి గృహ హింస కేసు పెట్టింది. ఆ తర్వాత ఆమె విడాకులకు దరఖాస్తు చేసింది. అప్పటి నుంచి ఈ ఇద్దరూ విడిగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పు ఇంకా రాలేదు. ప్రస్తుతానికి ఐరా తల్లి హసిన్ వద్దనే ఉంటోంది.
Mohammed Shami Career : ఇక షమీ కెరీర్ విషయానికి వస్తే - గతేడాది వన్డే ప్రపంచకప్ ముగిసినప్పటి నుంచి షమీ ఆటకు దూరమయ్యాడు. ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్‌తో స్వదేశంలో జరిగిన సిరీస్‌లకు, సౌతాఫ్రికా టూర్లోనూ షమీ ఆడలేదు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో మొదటి రెండు టెస్టులకు కూడా ఈ పేసర్ అందుబాటులో లేడు. చీలమండ గాయం వల్ల బాధపడ్డ షమీ, ప్రస్తుతం చికిత్స కోసం ఇంగ్లాండ్‌లో ఉన్నాడు.