ETV Bharat / sports

షమీ,​ పంత్​ రీఎంట్రీపై బీసీసీఐ క్లారిటీ! - Mohammad Shami

Mohammad Shami BCCI : షమీ ఫ్యాన్స్​కు గుడ్​న్యూస్ చెప్పింది బీసీసీఐ. కుడికాలి చీలమండకు గాయం కావడం వల్ల సర్జరీ చేయించుకున్న షమీ ప్రస్తుతం కోలుకుంటున్నాడని తెలిపింది. మరోవైపు రిషభ్​ పంత్​ రీఎంట్రీపై కూడా కీలక అప్డేట్ ఇచ్చింది.

Jay Shah Comments On Mohammad Shami And KL Rahul

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 11, 2024, 8:24 PM IST

Updated : Mar 11, 2024, 9:53 PM IST

Mohammad Shami BCCI : టీమ్‌ఇండియా స్టార్‌ పేసర్‌ మహమ్మద్‌ షమీ అభిమానులకు బీసీసీఐ శుభవార్త చెప్పింది. ఇటీవల కుడికాలి చీలమండకు సర్జరీ చేయించుకున్న షమీ ప్రస్తుతం వేగంగా కోలుకుంటున్నాడని, త్వరలో అతడు మైదానంలోకి అడుగుపెడతాడని తెలిపింది. ఈ ఏడాది బంగ్లాదేశ్‌తో జరగబోయే టెస్ట్‌ సిరీస్‌లో షమీ ఆడనున్నట్లు బీసీసీఐ సెక్రటరీ జైషా వెల్లడించారు.

ఐపీఎల్​కు రాహుల్​
Jay Shah On KL Rahul : సర్జరీ కోసం లండన్‌ వెళ్లిన షమీ త్వరలో భారత్‌కు రానున్నట్లు తెలిపారు జైషా. గతేడాది వన్డే ప్రపంచకప్‌లో అదరగొట్టిన షమీ సర్జరీ కారణంగా ఈ నెలాఖరున ప్రారంభమయ్యే ఐపీఎల్‌ సీజన్‌ మొత్తానికి దూరం కానున్నాడు. ఇక మరో స్టార్​ ప్లేయర్​ కేఎల్‌ రాహుల్‌ అనారోగ్యం కారణంగా ఇంగ్లాండ్ సిరీస్‌లోని చివరి నాలుగు టెస్టులకు దూరమయ్యాడు. ప్రస్తుతం లండన్‌లో కోలుకుంటున్న రాహుల్‌ మార్చి 22 నుంచి జరగనున్న ఐపీఎల్‌ సీజన్‌-17 నాటికి తిరిగి రానున్నట్లు సమాచారమిచ్చారు బీసీసీఐ సెక్రటరీ.

'రిషభ్​కు ద్వారాలు తెరిచే ఉన్నాయి'
Jay Shah Comments On Rishabh Pant Fitness : మరోవైపు ఐపీఎల్‌ ఆడేందుకు సిద్ధమైన రిషభ్‌ పంత్‌కు సంబంధించి కూడా కీలక అప్డేట్ ఇచ్చారు బీసీసీఐ కార్యదర్శి జైషా. ఐపీఎల్‌ సీజన్​ 17 తర్వాత జరిగే టీ20 ప్రపంచకప్‌ ఆడేందుకు పంత్​ కోసం ద్వారాలు తెరిచే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. త్వరలో నేషనల్‌ క్రికెట్‌ అకాడమీ పంత్‌ ఫిట్‌నెస్‌ను నిర్ధరించనుంది. టీ20 ప్రపంచకప్‌ జూన్‌లో ప్రారంభం కానుంది.

"పంత్‌ బాగా ప్రాక్టీస్‌ చేస్తున్నాడు. బ్యాటింగ్‌తోపాటు కీపింగ్‌ చేస్తున్నాడు. త్వరలో అతడి ఫిట్‌నెస్‌పై ఓ రిపోర్ట్​ను విడుదల చేస్తాం. ఒకవేళ అతడు టీ20 ప్రపంచకప్‌ ఆడగలిగితే టీమ్‌ఇండియాకు అదనపు బలం చేకూరుతుంది. ఐపీఎల్‌లో అతడి ఆటతీరును నిశితంగా గమనిస్తాం. అతడి భవిష్యత్తు కార్యాచరణను ఎన్‌సీఏ చీఫ్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌, నితిన్ పటేల్‌ నేతృత్వంలోని బీసీసీఐ వైద్యబృందం నిర్ణయిస్తుంది. అతడికి ద్వారాలు తెరిచే ఉన్నాయి. మేం వేచి ఉన్నాం. అతడి ఫిట్‌నెస్‌ను మా బృందం పరిశీలిస్తుంది"

- జైషా, బీసీసీఐ కార్యదర్శి

2022 డిసెంబర్​లో ఘోర రోడ్డు ప్రమాదం కారణంగా చాలాకాలంగా ఆటకు దూరమైన రిషభ్‌ పంత్‌ ఐపీఎల్‌-2024లో ఆడేందుకు సిద్ధమయ్యాడు. దిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్​గా వ్యవహరించనున్నాడు. ఈ సమయంలోనే అతడిపై మరో కిక్కిచ్చే అప్‌డేట్‌ ఇచ్చారు బీసీసీఐ సెక్రటరీ జైషా. అయితే పలు కారణాలతో పంత్​ తన ఫిట్​నెస్​ నిరూపించుకోకపోతే అతడి స్థానంలో పాత సారథి డేవిడ్‌ వార్నరే జట్టును ముందుండి నడిపించనున్నాడు.

రోహిత్ ముంబయిని వదిలేస్తే బెటర్- ఆ జట్టులోకి వెళ్తే కెప్టెన్ అవుతాడు!

ఐపీఎల్​ ఫీవర్​- ఆ 5 జట్ల సారథులైతే మారారు- మరి రిజల్ట్స్​ సంగతేంటి?

Last Updated : Mar 11, 2024, 9:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.