ETV Bharat / sports

బౌలింగ్​తో చెలరేగిన రాజస్థాన్ ప్లేయర్లు - ముంబయి హ్యాట్రిక్ ఓటమి - MI VS RR IPL 2024 - MI VS RR IPL 2024

MI VS RR IPL 2024 : ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా రాజస్థాన్, ముంబయి మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో రాజస్థాన్​ గెలిచింది. ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది.

MI VS RR IPL 2024
MI VS RR IPL 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 1, 2024, 10:59 PM IST

Updated : Apr 2, 2024, 6:05 AM IST

MI VS RR IPL 2024 : ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా రాజస్థాన్, ముంబయి మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో రాజస్థాన్​ జట్టు విజయం సాధించింది. ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో ముంబయికి మూడో ఓటమి తప్పలేదు.

టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. రాజస్థాన్‌ బౌలర్లు చెలరేగి ప్రత్యర్థులకు చుక్కలు చూపించారు. దీంతో 20 పరుగులకే నాలుగు వికెట్లు కుప్పకూలాయి. ఎదుర్కొన్న తొలి బంతికే రోహిత్ శర్మ (0) వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన నమన్ ధిర్ (0) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. తనతో పాటు ఇంపాక్ట్ ప్లేయర్ డెవాల్డ్ బ్రెవిస్ (0) కూడా వెనువెంటనే ఔటయ్యాడు. దీంతో ఈ మ్యాచ్​లో మూడు గోల్డెన్​ డక్​లు నమోదయ్యాయి. అంతే కాకుండా ఈ ముగ్గురూ బౌల్ట్ బౌలింగ్‌లోనే ఔటవ్వడం విశేషం.

మరోవైపు 16 పరుగులు చేసి ఇషాన్​ కిషన్ ఔటవ్వగా, కెప్టెన్ హార్దిక్ పాండ్య (34) తిలక్​ వర్మ(24) దూకుడుగా ఆడారు. కానీ కాసేపటికే వారిని కూడా వెనుతిరిగేలా చేశారు రాజస్థాన్ బౌలర్లు. టిమ్ డేవిడ్ (17) కూడా ధాటిగా ఆడలేకపోయాడు. అయితే ఆఖరిలో వచ్చిన జస్‌ప్రీత్‌ బుమ్రా (8*), ఆకాశ్‌ మధ్వల్ (4*) జాగ్రత్తగా ఆడటం వల్ల ముంబయి ఆలౌట్‌ నుంచి తప్పించుకుంది.

ఇక ముంబయి ఇండియన్స్ జట్టు నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని రాజస్థాన్ రాయల్స్​ ఈజీగా ఛేదించింది. అయితే ఈ జట్టు తొలి ఓవర్‌లోనే ఓ వికెట్ కోల్పోయింది. కానీ ఆ తర్వాత వేగం పుంచుకుని నిలకడగా ఆడింది. సంజు శాంసన్ 12 పరుగులకే ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన జోస్ బట్లర్ (13) కూడా పెవిలియన్ బాట పట్టాడు. ఇక రియాన్‌ పరాగ్‌ (54 నాటౌట్‌; 39 బంతుల్లో 5×4, 3×6) మెరుపులతో లక్ష్యాన్ని రాజస్థాన్‌ 15.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఆకాశ్‌ మధ్వాల్‌ (3/20) గొప్పగా బౌలింగ్‌ చేశాడు.

'నేను ఇక్కడ ఉన్నది అభిమానులను అలరించేందుకే' -ధోనీ ఓల్డ్​ ట్వీట్ వైరల్​! - Dhoni CSK Tweet

కోహ్లీ, ధోనీ ఇద్దరూ ఇద్దరే - మోత మోగించేశారు! - Dhoni Kohli

Last Updated : Apr 2, 2024, 6:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.