MI Vs GG WPL 2024: 2024 డబ్ల్యూపీఎల్ రసవత్తరంగా సాగుతోంది. లీగ్‌లో భాగంగా శనివారం ముంబయి- గుజరాత్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఏకంగా 191 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబయి ఒక బంతి మిగిలుండగానే ఛేదించింది. ముంబయి కెప్టెన్ హర్మన్‌ప్రీత్ అసాధారణ ఇన్నింగ్స్‌తో తమ జట్టును విజయ తీరాలకు చేర్చింది. దీంతో రెండో సీజన్లో ప్లేఆఫ్స్‌కు చేరిన తొలి జట్టుగా ముంబయి నిలిచింది. ఈ క్రమంలో డబ్ల్యూపీఎల్ హిస్టరీలో పలు రికార్డులు నమోదయ్యాయి. అవేంటంటే?
- ఈ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ డిఫెండింగ్ ఛాంపియన్లాగే ఆడింది. డబ్ల్యూపీఎల్ చరిత్రలో భారీ లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా ముంబయి రికార్డు కొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 190-7 స్కోర్ చేసి, ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. అనంతరం ఛేజింగ్‌లో ముంబయి అదరగొట్టింది. 191 పరుగుల లక్ష్యాన్ని 19.5 ఓవర్లలో ఛేదించి మహిళల ప్రీమియర్ లీగ్‌లో అతిపెద్ద టార్గెట్‌ను ఛేదించిన జట్టుగా నిలిచింది. ఇదివరకు ఈ రికార్డ్ బెంగళూరుపై ఉండేది. గత సీజన్లో గుజరాత్‌తో అడిన మ్యాచ్‌లో బెంగళూరు 189 పరుగులు ఛేజ్ చేసి రికార్డు కొట్టింది.
- ఈ మ్యాచ్‌లో భారీ లక్ష్యం ముంగిట ముంబయి కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ రెచ్చిపోయి ఆడింది. 48 బంతుల్లో 95 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. 10 ఫోర్లు, 5 సిక్స్‌లతో బౌండరీల వర్షం కురిపించింది. ఈ క్రమంలో డబ్ల్యూపీఎల్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన భారత బ్యాటర్‌గా హర్మన్ రికార్డ్ కొట్టింది. కాగా, ఇదివరకు ఈ రికార్డ్ దిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ షఫాలీ వర్మ పేరిట ఉండేది. ఆమె గత సీజన్లో బెంగళూరుపై 84 పరుగులు చేసింది. ఇక హర్మన్ తాజా ఇన్నింగ్స్‌తో ఆ రికార్డ్ బద్దలుకొట్టింది. ఓవరాల్‌గా హర్మన్ది టాప్- 3 స్కోర్. ఈ లిస్ట్‌లో సోఫీ డివైన్ 99 , అలీసా హీలీ 96 పరుగులు ఉన్నారు.
- గతేడాది ప్రారంభమైన డబ్ల్యూపీఎల్‌లో హర్మన్‌ప్రీత్ ప్రస్తుతం అత్యధిక సగటు కలిగిన బ్యాటర్‌గా కొనసాగుతోంది. ఇప్పటివరకు హర్మన్ 14 మ్యాచ్‌ల్లో 51.60 సగటుతో 516 పరుగులు చేసింది. కాగా, స్ట్రైక్ రేట్ 140.60గా ఉంది. ఈ క్రమంలో హర్మన్, మెగ్ లానింగ్ (46.62 సగటు)ను అధిగమించింది.
- ఈ మ్యాచ్‌లో ఆఖరి 6 ఓవర్లలో ముంబయి ఏకంగా 91 పరుగులు పిండుకుంది. మహిళల ప్రీమియర్ లీగ్‌లో చివరి 6 ఓవర్లలో అత్యధిక పరుగులు సాధించిన జట్టుగా ముంబయి ఇండియన్స్ నిలిచింది.
WPL 2023 : దిల్లీ జోరుకు బ్రేక్- ఒక్క పరుగుతో యూపీ విజయం- ప్లేఆఫ్స్ ఆశలు సజీవం
దుమ్మురేపిన హర్మన్ ప్రీత్- గుజరాత్‌పై ముంబయి గ్రాండ్ విక్టరీ