MI vs DC IPL 2024: 2024 ఐపీఎల్లో ముంబయి తొలి విజయం నమోదు చేసింది. ఆదివారం వాంఖడే వేదికగా దిల్లీ క్యాపిటల్స్‌పై 29 పరుగుల తేడాతో నెగ్గి ఈ సీజన్లో గెలుపు రుచి చూసింది. ముంబయి నిర్దేశించిన 235 భారీ లక్ష్య ఛేదనలో దిల్లీ 205-8 పరుగులకే పరిమితమైంది. ట్రిస్టన్ స్టబ్స్ (71 పరుగులు, 25 బంతుల్లో; 3x4, 7x6), పృథ్వీ షా (66 పరుగులు, 40 బంతుల్లో; 8x4, 3x6) రాణించినా దిల్లీకి ఓటమి తప్పలేదు. ఇక ముంబయి బౌలర్లలో గెరాల్డ్ కాట్జీ 4, జస్ప్రీత్ బుమ్రా 2, రొమారియో షెపర్డ్ 1 వికెట్ దక్కించుకున్నారు.
దిల్లీ పోరాడినా: భారీ లక్ష్య ఛేదనలో దిల్లీకి ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ (10) స్వల్ప స్కోర్‌కే వెనుదిరిగాడు. అయినప్పటికీ పృథ్వీ షా, వన్‌డౌన్‌లో వచ్చిన అభిషేక్ పోరెల్ అదరగొట్టారు. ముంబయి బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటు దిల్లీని విజయం దిశగా నడిపించారు. ఈ క్రమంలో పృథ్వీ అర్ధ శతరం పూర్తి చేసుకున్నాడు. ఈ సమయంలో బుమ్రా ముంబయికి బ్రేక్ ఇచ్చాడు. అద్భుత యార్కర్‌తో షా ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత అభిషేక్, కెప్టెన్ రిషబ్ పంత్ (1) కూడా స్వల్ప వ్యవధిలో ఔటయ్యారు.
రెచ్చిపోయిన స్టబ్స్: దిల్లీ ఘనమైన ఆరంభాన్ని స్టబ్స్ కొనసాగించాడు. ఓ ఎండ్‌లో వికెట్లు పడుతున్నా ఏ మాత్రం బెదరకుండా బౌండరీలతో విరుచుకుపడ్డాడు. బుమ్రా మినహా ముంబయి బౌలర్లను ఒక్కొక్కరిని లక్ష్యంగా చేసుకొని మెరుపు వేగంతో పరుగులు చేశాడు. ఒక రకంగా చెప్పాలంటే స్టబ్స్ ఆడుతున్నంతసేపు దిల్లీ గెలుస్తుందనుకున్నారంతా. అటు దిల్లీ ఇన్నింగ్స్‌లోనూ స్టబ్స్ ఆటే హైలైట్. ఇక చివర్లో క్రమం తప్పకుండా వికెట్లు పడడం, కావాల్సిన రన్‌రేట్ పెరగడం వల్ల దిల్లీ ఒత్తిడికి గురైంది. ఆఖరి ఓవర్లో 34 పరుగులు కావాల్సిన దశలో గెరాల్డ్ 4 పరుగులిచ్చి మూడు వికెట్లు తీసి ముంబయికి విజయాన్ని అందించాడు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 234 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. ముంబయి బ్యాటర్లు దిల్లీ బౌలర్లపై దండయాత్ర చేశారు. రోహిత్ శర్మ (49 పరుగులు 27 బంతుల్లో ; 6x4, 3x6), ఇషాన్ కిషన్ (42 పరుగులు, 23 బంతుల్లో ; 4x4, 2x6) అదరగొట్టగా, టిమ్ డేవిడ్ (45 పరుగులు), రొమారియో షెపర్డ్ (39 పరుగులు, 10 బంతుల్లో) దిల్లీ బౌలర్లకు చుక్కలు చూపించారు. వీరిద్దరూ చివరి 30 బంతుల్లో 96 పరుగులు పిండుకున్నారు. దిల్లీ బౌలర్లలో నోకియా 2, అక్షర్ పటేల్ 2, ఖలీల్ అహ్మద్ 1 వికెట్ దక్కించుకున్నారు.
-
𝐁𝐎𝐎𝐌 💥 𝗢𝗡 𝗧𝗔𝗥𝗚𝗘𝗧 🎯
— IndianPremierLeague (@IPL) April 7, 2024
Just Bumrah doing Bumrah things 🤷♂️
Watch the match LIVE on @starsportsindia and @JioCinema 💻📱#TATAIPL | #MIvDC pic.twitter.com/rO1Hnqd3Od
ఐపీఎల్లో రోహిత్ మరో ఘనత- దిల్లీపై క్రేజీ రికార్డ్ - Rohit Sharma IPL Record
రాజస్థాన్ మ్యాచ్‌లో రోహిత్ శర్మనే భయపెట్టేసిన అభిమాని - IPL 2024 RR VS MI