Siraj Spin Bowling : భారత్ - బంగ్లాదేశ్ మధ్య తొలి టెస్టు మూడో రోజు ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. ఈ మ్యాచ్లో టీమ్ఇండియా పేసర్ మహ్మద్ సిరాజ్ స్పిన్ బౌలింగ్ చేసేందుకు సిద్ధమయ్యాడు. కానీ, ఫీల్డ్ అంపైర్ అనుమతించకపోవడం వల్ల అది సాధ్యపడలేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇంతకీ మూడో రోజు మ్యాచ్లో ఏం జరిగిందింటే?
వాస్తవానికి మూడో రోజు ఆట 45 నిమిషాలు ముందుగానే ముగిసింది. శనివారం సాయంత్రం 4.15 నిమిషాలకు మైదానం చుట్టూ మేఘాలు కమ్ముకున్నాయి. గ్రౌండ్లో వెలుతురు తక్కువైంది. దీంతో ఆటను కొనసాగించాలా? వద్దా? అని అంపైర్లు చర్చించుకుంటున్నారు. ఈ సమయంలో టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ 'పేసర్లకు బదులుగా స్పిన్నర్లతోనే బౌలింగ్ వేయిస్తా' అని అటను కొనసాగించాలంటూ అంపైర్లకు తెలిపాడు.
అయితే అప్పటికే ఓవర్ ప్రారంభిచిన సిరాజ్ రెండు బంతులు వేసేశాడు. రోహిత్ మాటలు విన్న సిరాజ్ ఆ ఓవర్లో మిగిలిన నాలుగు బంతులను స్పిన్ బౌలింగ్ వేయడానికి సిద్ధమయ్యాడు. వెంటనే స్పిన్ బౌలింగ్ కూడా ప్రాక్టీస్ చేశాడు. కానీ, అంపైర్ ఆట కొనసాగించడానికి అంగీకరించలేదు. దీంతో మూడో రోజు ఆట ముగిసింది. ఇక వైరల్గా మారిన ఈ వీడియో చూసిన నెటిజన్లు 'ఫన్నీ సిరాజ్' అంటూ కామెంట్ చేస్తున్నారు.
— The Game Changer (@TheGame_26) September 21, 2024
ఇక మ్యాచ్ విషయానికొస్తే, మూడో రోజు ఆట ముగిసేసరికి 356 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. 515 పరుగుల భారీ లక్ష్యంతో సెకండ్ ఇన్నింగ్స్లో బరిలోకి దిగిన బంగ్లా మూడో రోజు ఆట ముగిసేసరికి 158-4తో నిలిచింది. క్రీజులో నజ్ముల్ షాంటో (51 పరుగులు), షకీబ్ అల్ హసన్ (5 పరుగులు) ఉన్నారు. స్పిన్ మాంత్రికుడు రవిచంద్రన్ అశ్విన్ 3, పేసర్ జస్ప్రీత్ బుమ్రా 1 వికెట్ దక్కించుకున్నారు. అంతకుముందు సెకండ్ ఇన్నింగ్స్లో టీమ్ఇండియా 287 - 4 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్డ్ చేసింది.
తొలి ఇన్నింగ్స్ స్కోర్లు
- భారత్ : 376 - 10
- బంగ్లాదేశ్ : 149 - 10
షకీబ్ అరుదైన రికార్డు - బంగ్లా నుంచి ఏకైక ప్లేయర్గా ఘనత - Shakib Al Hasan Test Record