ETV Bharat / sports

'నేనెక్కడా రిటైర్మెంట్ ప్రకటించలేదు- బాక్సర్ మేరీకోమ్ క్లారిటీ'

MC Mary Kom Retirement: తన రిటైర్మెంట్​కు సంబంధించి వస్తున్న వార్తల్లో నిజం లేదని బాక్సర్ మేరీకోమ్ స్పష్టం చేసింది. తాను ఆటకు ఇంకా గుడ్​బై చెప్పలేదని పేర్కొంది.

MC Mary Kom Retirement
MC Mary Kom Retirement
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 25, 2024, 6:47 AM IST

Updated : Jan 25, 2024, 9:23 AM IST

MC Mary Kom Retirement: తాను ఆటకు రిటైర్మెంట్ ప్రకటించినట్లు వస్తున్న వార్తలపై స్టార్ బాక్సర్ మేరీకోమ్ (MC Mary Kom) స్పందించింది. ఆటకు వీడ్కోలు పలికినట్లు తాను ఎక్కడా చెప్పలేదని పేర్కొంది. "నేను రిటైర్మెంట్ ప్రకటించినట్లు కొన్ని కథనాలు వస్తున్నాయి. అవన్నీ అబద్దం. నేను రిటైర్మెంట్​ ప్రకటించలేదు. ఆటకు గుడ్​బై చెప్పాలనుకున్నప్పుడు నేనే మీడియా ముందుకు వచ్చి చెబుతా. రీసెంట్​గా ఓ స్కూల్​ ఈవెంట్​లో పాల్గొన్నప్పుడు పిల్లల్ని ప్రోత్సహిస్తూ, 'నాకు స్పోర్ట్స్​లో ఇంకా అనేక ఘనతలు సాధించాలని ఉంది. కానీ, ఏజ్ లిమిట్ వల్ల నేను ఒలింపిక్స్​లో పాల్గొనే ఛాన్స్​ లేదు. అయినప్పటికీ నేను నా ఫిట్​నెస్​పైనే దృష్టి సారిస్తున్నా' అని చెప్పాను. దాన్ని ఈ విధంగా అర్థం చేసుకున్నారు. రిటైర్మెంట్​ ప్రకటించాల్సి వచ్చినప్పుడు అందరికి చెబుతా' అని మేరికోమ్ చెప్పింది.

  • Boxing champion Mary Kom says, "I haven’t announced retirement yet and I have been misquoted. I will personally come in front of media whenever I want to announce it. I have gone through some media reports stating that I have announced retirement and this is not true. I was… pic.twitter.com/VxAcFsq44v

    — ANI (@ANI) January 25, 2024 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Mary Kom Awards: 41ఏళ్ల మేరీకోమ్‌ 2 దశాబ్దాలకుపైగా కెరీర్​లో కొనసాగుతోంది. 2001 లో అరంగేట్రం చేసిన ఈ మణిపుర్ బాక్సర్ తన కెరీర్​లో పలు అత్యుత్తమ పురస్కారాలు అందుకుంది. 2003లో అర్జునా అవార్డు అందుకున్న మేరీకోమ్, 2009లో భారత ప్రభుత్వం ఆమెను రాజీవ్ గాంధీ ఖేల్​రత్న అవార్డుతో సత్కరించింది. దీంతో పాటు ఆమెకు 2006లో పద్మ శ్రీ అవార్డు, 2013 పద్మభూషన్, 2020లో పద్మ విభూషణ్ అవార్డులు దక్కాయి.

Mary Kom World Championships: బాక్సింగ్​లో ఎవరికీ సాధ్యం కాని రీతిలో మేరికోమ్ విజయాలు సాధించింది. కెరీర్​లో ఏకంగా ఐదుసార్లు ఆసియా ఛాంపియన్, ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్‌ (2005, 2006, 2008, 2010, 2018)గా నిలిచింది. 2014 ఆసియా క్రీడల్లో భారత్​కు తొలిసారి పసిడి పతకాన్ని సాధించి పెట్టింది. 2010 తర్వాత కెరీర్​లో చిన్న బ్రేక్ తీసుకున్న మేరీ 2012 లండన్​ ఒలింపిక్స్​లో కాంస్యం నెగ్గి సత్తా చాటింది. 2022 కామన్‌వెల్త్‌ పోటీల సెలక్షన్​ ట్రయల్స్​లో మెరీకోమ్ గాయపడింది. ప్రాక్టీస్​లో ఆమె మోకాలికి గాయమైంది. ఇక అప్పటినుంచి మేరీ బరిలోకి దిగలేదు.

పంచ్​ కొడితే పతకం రావాల్సిందే - ఒలింపిక్ గేమ్సే లక్ష్యంగా హుసాముద్దీన్‌

వరల్డ్​ ఛాంపియన్​గా నీతూ గాంగాస్, స్వీటీ బూర​.. భారత్​కు రెండు స్వర్ణాలు

Last Updated : Jan 25, 2024, 9:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.