Mayank Agarwal Health Update: విమానంలో మంచి నీళ్లని అనుకుని హానికర ద్రవం తాగిన భారత క్రికెటర్ మయాంక్ అగర్వాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో కోలుకుంటున్న మయాంక్ అభిమానుల కోసం సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది. "ప్రస్తుతం నా ఆరోగ్యం బాగుంది. త్వరలోనే నేను బయటకు వస్తాను. నేను త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన వారికి, నాపై ప్రేమ చూపుతున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు" అంటూ తన ఫొటో షేర్ చేశాడు.
మయాంక్ హెల్త్ అప్డేట్ : అస్వస్థతకు గురైన మయాంక్‌ను స్థానిక హాస్పిటల్లో చేర్పించారు. అయితే చికిత్స పొందిన మయాంక్ ఇప్పుడు డిస్చార్జ్ అయ్యాడు.
ఇదీ జరిగింది: మయంక్ అగర్వాల్ అగర్తలా నుంచి దిల్లీ వెళ్తుండగా ఫ్లైట్‌లో తన సీట్ ఎదురుగా ఉన్న బాటిల్లోని పానియాన్ని నీళ్లు అనుకొని తాగాడు. దీంతో వెంటనే అతడికి రెండుసార్లు వాంతులయ్యాయి. తర్వాత గొంతులో మంట ప్రారంభమైంది. అప్రమత్తమైన విమాన సిబ్బంది, అతడిని స్థానిక హాస్పిటల్‌కు తరలించింది. మయంక్‌కు ఎలాంటి ప్రమాదం లేదని హాస్పిటల్ వర్గాలు మంగళవారం రాత్రే పేర్కొన్నాయి. ఈ విషయంపై మయంక్ మేనేజర్ అగర్తలా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరపాల్సిందిగా పోలీసులను కోరారు.
Mayank Agarwal Ranji 2024: 2024 రంజీలో మయంక్ కర్ణాటక జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఎలైట్ గ్రూప్-సీలో భాగంగా కర్ణాటకే- త్రిపుర మధ్య జనవరి 29న మ్యాచ్ ముగిసింది. తమ తదుపరి మ్యాచ్ కోసం రాజ్‍కోట్‍కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఇక మయంక్ గైర్హాజరీలో కర్ణాటక జట్టును నిఖిన్ జోస్ నడిపించనున్నాడు.
Mayank Agarwal International Stats: 2011లో క్రికెట్ కెరీర్ ప్రారంభించిన మయంక్ జాతీయ జట్టులోకి రావడానికి చాలా కాలం పట్టింది. అతడు దాదాపు ఏడేళ్ల తర్వాత 2018లో టెస్టుల్లో అంతర్జాతీయ అరంగేట్ర చేశాడు. ఇప్పటివరకు 36 టెస్టు ఇన్నింగ్స్‌లు ఆడిన మయంక్ 41.33 సగటుతో 1488 పరుగులు చేశాడు. అందులో 4 సెంచరీలు, 6 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక 2020లో వన్డేల్లో ఎంట్రీ ఇచ్చిన మయంక్‌కు పరిమిత ఓవర్ల క్రికెట్లో పెద్దగా ఛాన్స్‌లు రాలేదు.
టీమ్ఇండియా క్రికెటర్‌కు తీవ్ర అస్వస్థత - హెల్త్ ఎలా ఉందంటే?