Mari kom Weight Loss: భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ 100 గ్రాముల అధిక బరువు ఉండడం వల్ల పారిస్ ఒలింపిక్స్ లో అనర్హత వేటు పడడంపై దేశవ్యాప్తంగా అభిమానులు షాక్ కు గురయ్యారు. ఈ నేపథ్యంలో రెజ్లింగ్ నిబంధనలు ఏంటనే దానిపై చర్చ జరుగుతోంది. అథ్లెట్లు చాలా తక్కువ సయమంలో బరువు తగ్గుంచుకోగలరని, ఇలా చాలా సార్లు జరిగిందని వాదనలు వినిపిస్తున్నాయి. ఆరేళ్ల క్రితం భారత స్టార్ బాక్సర్ మేరీ కోమ్ కేవలం 4 గంటల్లోనే 2 కిలోల బరువు తగ్గడాన్ని గుర్తు చేసుకుంటున్నారు.
4 గంటల్లో రెండు కిలోల తగ్గిన మేరీకోమ్
2018లో పోలండ్ వేదికగా జరిగిన సిలేసియన్ బాక్సింగ్ టోర్నీలో 48 కేజీల విభాగంలో పోటీపడిన మేరీకోమ్, ఫైనల్ మ్యాచ్ ప్రారంభానికి ముందు 50 కిలోలు ఉంది. అంటే కచ్చితంగా పోటీల్లో అనర్హతకు గురవుతుంది. అయితే ఆటకు ముందు బరువు పరిశీలించే కార్యక్రమానికి మరో 4 గంటలే సమయం ఉంది. వెంటనే బరువు తగ్గించుకోవడంపై మేరీకోమ్ దృష్టి సారించింది. కేవలం 4 గంటల్లోనే 2 కిలోల బరువు తగ్గింది. అంతేకాదు ఈ టోర్నీలో స్వర్ణం గెలిచింది.
రెండు కిలోల బరువు తగ్గడానికి మేరీకోమ్ చాలా కష్టపడింది. ఒక గంటపాటు స్కిప్పింగ్ చేసింది. అలాగే బరువు తగ్గడానికి ఇతర వ్యాయామాలు చేసింది. దీంతో బరువు తూకం సమయానికి మేరీకోమ్ 50 నుంచి 48 కిలోలకు తగ్గింది. దీంతో ఆమె అనర్హత వేటు నుంచి తప్పించుకుని దేశానికి బంగారు పతకాన్ని అందించింది.
అథ్లెట్లు బరువు ఎలా తగ్గుతారు?
అథ్లెట్లు తమ కేటగిరీలో ఉండాల్సిన బరువు కన్నా ఎక్కువ ఉంటే భారీ వ్యాయామాలు చేస్తారు. చెమటలు పట్టడానికి ప్రత్యేకమైన ఎఫ్ బీటీ షూట్ ను ధరిస్తారు. దీంతో చెమట రూపంలో శరీరంలో ఉన్న నీరు ఎక్కువగా బయటకు పోయి బరువు తగ్గుతారు.
వినేట్ విషయంలో జరిగిందిలా!
క్రీడాకారిణి ఆయా కేటగిరిలో ఉన్నారని నిర్ధరించేందుకు పోటీ జరిగే రోజు ఉదయం బరువును కొలుస్తారు. అప్పుడు ఎక్కువ బరువు ఉన్నట్లు తేలితే అనర్హతకు గురవుతారు. ప్రతి బరువు కేటగిరిలో రెండు రోజులపాటు టోర్నమెంట్ జరుగుతుంది. వినేశ్ పోటీపడే 50 కిలోల విభాగంలో పోటీలు మంగళవారం, బుధవారం జరుగుతున్నాయి. క్రీడాకారులను బరువు తూచే సమయంలో వారికి 30 నిమిషాల వ్యవధి ఇస్తారు. ఈ వ్యవధిలో వారు ఎన్నిసార్లైనా తమ బరువును కొలుచుకోవచ్చు. ఇక రెండో రోజు కూడా పోటీపడే వారికి బరువు కొలతలకు 15 నిమిషాలే కేటాయిస్తారు. ఆ సయమంలోనే నిర్ణీత బరువు ఉంటే ఫర్వాలేదు. లేదంటే అనర్హత వేటు తప్పదు. ఈ క్రమంలో బుధవారం వినేశ్ పై అనర్హత పడింది.
డీక్వాలిఫికేషన్ ఎఫెక్ట్ - ఆస్పత్రిలో చేరిన వినేశ్ - Vinesh Phogat Paris Olympics
వినేశ్ ఫోగాట్‌పై అనర్హత వేటు - ఒలింపిక్స్‌కు ఐఓఏ ఛాలెంజ్ - Vinesh Phogat Paris Olympics 2024