ETV Bharat / sports

జస్ట్ మిస్​- చివరిక్షణంలో మెడల్ కోల్పోయిన మను - Paris Olympics 2024

author img

By ETV Bharat Sports Team

Published : Aug 3, 2024, 1:25 PM IST

Manu Bhaker Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్​లో భాగంగా శనివారం జరిగిన 25 మీటర్ల పిస్టోల్ ఈవెంట్​లో స్టార్ షూటర్ మను బాకర్​కు నిరాశ తప్పలేదు. పోటాపోటీగా ఆడినప్పటికీ త్రుటిలో ఆమె మూడో మెడల్​ చేజార్చుకుని నాలుగో స్థానానికి పరిమితమైంది.

Manu Bhaker Paris Olympics 2024
Manu Bhaker (Associated Press)

Manu Bhaker Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్​లో భారత్ షూటర్ మను బాకర్​కు త్రుటిలో మూడో పతకం మిస్ అయ్యింది. శనివారం జరిగిన 25మీటర్ల పిస్టల్ ఈవెంట్​లో మను 28పాయింట్లతో నాలుగో స్థానానికి పరిమితమైంది. ఇక ఇదే ఈవెంట్​లో యాంగ్ జిన్ (కొరియా) తొలి స్థానంలో నిలిచి పసిడి ముద్దాడగా, రెండో ప్లేస్​లో ఉన్న కమెలీ (ఫ్రాన్స్) సిల్వర్ మెడల్ దక్కించుకుంది. కాగా, మూడో స్థానంలో నిలిచిన వెరోనికా (హంగేరీ)కు కాంస్యం దక్కింది.

ఫైనల్​ పోటీని మను కాస్త నెమ్మదిగా ప్రారంభించింది. తొలి సిరీస్ తర్వాత మాత్రం అద్భుతంగా పుంజుకుంది. ఒక దశలో మను రెండో స్థానానికి ఎగబాకింది. అయితే ప్రత్యర్థి షూటర్లు కూడా అత్యుత్తమంగా ఆడడం వల్ల మనుకు తీవ్ర పోటీ ఎదురైంది. దీంతో మను మూడో స్థానాన్నైనా దక్కించుకుంటుందని అనుకున్నారంతా. ఈ క్రమంలో హంగేరి అథ్లెట్ 3 షాట్లతో మూడో స్థానానికి దూసుకెళ్లింది. మను నాలుగో ప్లేస్​కు పడిపోయింది. దీంతో మమ షూటర్ పోరాటం ముగిసింది. కాగా, ప్రస్తుత ఒలింపిక్స్​లో మను ఇప్పటికే 2 కాంస్య పతకాలు సాధించింది. మహిళల 10మీటర్ల ఎయిర్ రైఫిల్ సింగిల్స్​లో తొలి కాంస్యం ముద్దాడగా​, 10మీటర్ల రైఫిల్ మిక్స్​డ్ ఈవెంట్​లో సరబ్​జోత్​తో కలిసి రెండో కాంస్యం దక్కించుకుంది. తాజా ఈవెంట్​లో నాలుగో స్థానంతో పారిస్ ఒలింపిక్స్​ను మను బాకర్ ఘనంగానే ముగించింది.

పోటీ ముగిసిన తర్వాత మను మాట్లాడింది. 'రెండు కాంస్య పతతాలు నెగ్గడం సంతోషంగా ఉంది. కానీ, చివరి ఈవెంట్​లో నాలుగో స్థానానికి పరిమితమైనందుకు చింతిస్తున్నా' అని పేర్కొంది.

అది కూడా మిస్
మను బాకర్ ఈ ఈవెంట్​లో పతకం సాధించి ఉంటే ఆమె ఖాతాలో మూడు ఒలింపిక్ మెడల్స్ చేరేవి. ఈ క్రమంలో సింగిల్ ఒలింపిక్ ఎడిషన్​లో మూడు పతకాలు సాధించిన తొలి భారత అథ్లెట్​గా మను చరిత్ర సృష్టించేది. కానీ, ఆ అవకాశం త్రుటిలో చేజారింది. అయితే ఒకే ఒలింపిక్​లో రెండు పతకాలు ముద్దాడిన భారత అథ్లెట్​గా ఘనత మాత్రం మనుకే దక్కింది.

గోల్డ్ మెడలిస్ట్​తో లక్ష్యసేన్ పోటీ- టైట్ ఫైట్ తప్పేలా లేదు! - Paris Olympics

ఆరు రెట్లు పెరిగిన మను బాకర్​ బ్రాండ్ వాల్యూ! - ఆమె ఆస్తి అన్ని కోట్లా? - Paris Olympics 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.