Manu Bhaker Eiffel Tower Badge : పారిస్ ఒలింపిక్స్‌లో భారత యువ షూటర్ మను బాకర్ 10మీ ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో కాంస్య పతకం సాధించడంతో ఆమెకు ఓ అరుదైన గుర్తింపు లభించింది. ఆమె ట్విట్టర్ అకౌంట్ ఖాతా ప్రొఫైల్‌లో ఓ గోల్డెన్ కలర్ ఈఫిల్ టవర్ లోగో యాడైంది. అయితే ఈ బ్యాడ్జీని ఆమెకు ఎందుకు ఇచ్చారంటే?
ఈఫిల్ టవర్ బ్యాడ్జ్ ఎందుకు ఇస్తారు?
పారిస్ ఒలింపిక్స్ లో పతకం సాధించిన ప్లేయర్లకు సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ఎక్స్(ట్విట్టర్) ప్రొఫైల్‌లో ఈఫిల్ టవర్ బ్యాడ్జ్ యాడ్ అవుతుంది. ఆదివారం (జులై 28) జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్‌లో మను బాకర్ కాంస్య పతకం సాధించింది. దీంతో ఆమె ఎక్స్ అకౌంట్‌కు ఈ ఈఫిల్ టవర్ బ్యాడ్జ్ యాడ్ అయ్యింది. ఒక్కమాటలో చెప్పాలంటే ఈఫిల్ టవర్ లోగో ఉందంటే, ఆ అకౌంట్ హోల్డర్‌కు పారిస్ ఒలింపిక్స్‌లో మెడల్ వచ్చినట్లు సంకేతమన్నమాట.
భారత్‌కు తొలి పతకం అందించిన మను బాకర్
పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకాన్ని మను బాకర్ అందించింది. 10మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో ఆదివారం జరిగిన ఫైనల్‌లో ఈమె కాంస్య పతకాన్ని సాధించింది. ఒలింపిక్స్‌లో షూటింగ్‌లో పతకం సాధించిన తొలి భారత మహిళా షూటర్‌గా మను రికార్డు సృష్టించింది. ఫైనల్‌లో మను భాకర్ 221.7 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. సౌత్‌కొరియా షూటర్లు ఓహ్ యే జిన్ (243.2 పాయింట్లు) స్వర్ణం, కిమ్ యేజే (241.3 పాయింట్లు) రజత పతకాన్ని సాధించారు.
మరో రికార్డుకు చేరువలో మను బాకర్
10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో కాంస్య పతకం అందుకున్న మను బాకర్, మంగళవారం(జులై 30) మరో పతకాన్ని సాధించే అవకాశం ఉంది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్ డ్ టీమ్ కాంస్య పోరులో సరబ్ జ్యోత్ తో కలిసి మను బరిలోకి దిగనుంది. దక్షిణ కొరియా ద్వయం లీ-యెజిన్ తో తలపడనుంది. ఇందులో గెలిచి కాంస్య పతకం దక్కించుకుంటే మను బాకర్ ఈ అరుదైన రికార్డు అందుకుంటుంది. స్వాతంత్ర్యం తర్వాత ఒక ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన అథ్లెట్‌గా చరిత్ర సృష్టిస్తుంది.
కాంస్య పోరులో మను బాకర్ జోడీ - ఫైనల్‌లో రమితకు నిరాశ - Paris Olympics 2024 July 27 Events
మరో పతకానికి మను 'గురి'- బ్యాడ్మింటన్‌లో మనోళ్ల రికార్డ్- డే 3 హైలైట్స్ ఇవే! - Paris Olympics 2024