Manu Bhaker Olympics 2024: 2024 పారిస్ ఒలింపిక్స్‌లో మను భాకర్ రెండు పతకాలు సాధించి చరిత్ర సృష్టించింది. షూటింగ్‌లో ఆమె ప్రతిభకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు లభించాయి. ఆమె అత్యుత్తమ ప్రదర్శనకు షూటింగ్‌లో ఎక్కువ సమయం గడపడం శిక్షణ పొందడమే కాదు, మణిపూర్‌కు చెందిన పురాతన యుద్ధ కళ హుయెన్ లాలాంగ్ (Huiyen Lallong) పాత్ర కూడా ఉంది. ఈ యుద్ధకళ ఆమె ఫోకస్, షూటింగ్ స్కిల్స్‌ని పెంచుతుంది.
సిక్కింకు చెందిన కల్చరల్ ఎక్స్‌పెర్ట్ దిలీప్ కుమార్ రాయ్ ఈ కళ గురించి మాట్లాడారు. 'హుయెన్ లాంగ్లోన్ అని కూడా పిలిచే హుయెన్ లాలాంగ్, మణిపూర్ సంస్కృతిలో ఒక ముఖ్యమైన పురాతన యుద్ధ కళ. ఇది శతాబ్దాల నాటి చరిత్ర కలిగిన పోరాట శైలి మాత్రమే కాదు, ఈ ప్రాంతం యోధుల స్ఫూర్తి, సంస్కృతిక విలువలను ప్రతిబింబించే జీవన విధానం' అని చెప్పారు.
హుయెన్ లాలాంగ్ ప్రాముఖ్యత
మణిపురి సంస్కృతిలో హుయెన్ లాలాంగ్ ప్రాముఖ్యత చాలా గొప్పది. ఇది మణిపూర్ మెయితీ యుద్ధ కళ. భారతీయ యుద్ధ కళలలో ఒకటి. మెయితీ భాషలో హుయెన్ అంటే యుద్ధం అని అర్థం. అయితే లాలంగ్ అంటే జ్ఞానం లేదా కళ అని అర్థం. దీన్ని సంప్రదాయకంగా ఆత్మరక్షణ, సైనిక శిక్షణ సాధనంగా ఆచరించారు. యోధులు తమ ప్రాంతాలను రక్షించుకోవడానికి తమ నైపుణ్యాలు మెరుగుపరుచుకున్నారు. ఈ విధానం ఆధ్యాత్మిక అభ్యాసాలతో కూడా లోతుగా ముడిపడి ఉంది.
గతంలో, మణిపూర్‌లోని సమర్ధులైన పురుషులందరికీ తప్పనిసరిగా ఈ సైనిక శిక్షణ ఉండేది. సైనిక సేవ అయిన 'లాలప్' వ్యవస్థలో హుయెన్ లాలాంగ్ కీలకమైన భాగం. దీంతో ఎలాంటి ఆపదలను అయినా ఎదుర్కొనేందుకు రాజ్యం సంసిద్ధంగా ఉండేది. ఈ ప్రాంతం స్వాతంత్య్రం కొనసాగించడంలో హుయెన్ లాలాంగ్ కళ కీలక పాత్ర పోషించింది. నేడు హుయెన్ లాలాంగ్‌ని ఒక సంస్కృతిక సంపదగా చూస్తున్నారు. ఈ ప్రదర్శనలను పండగలు, పోటీల్లో ప్రదర్శిస్తున్నారు.
కీలక పద్ధతులు:
తెంగో పాల్బా (కత్తి, కవచం): ఇందులో అఫెన్సివ్, డిఫెన్సివ్ స్కిల్స్ కోసం సంప్రదాయ కత్తి (థాంగ్), షీల్డ్ (చుంగ్)తో శిక్షణ పొందుతారు.
సరిత్ సరక్ (నిరాయుధ పోరాటం): ఎలాంటి ఆయుధాలు వినియోగించరు. స్ట్రైక్స్, కిక్స్, జాయింట్ లాక్స్, త్రోస్ ఉపయోగించి పోరాడుతారు.
కంగ్లోన్ చత్పా (లీపింగ్, కిక్కింగ్): ఇందులో అక్రోబాటిక్ మూవ్‌మెంట్స్, హై కిక్స్ ప్రధానం. ఈ పోరాటం చూడటానికి అద్భుతంగా ఉంటుంది.
థామీ (స్పియర్ ఫైటింగ్): చురుకుదనం, కచ్చితత్వాన్ని పెంపొందించడానికి ఈటెతో శిక్షణ పొందుతారు.
ధ్యానం, శ్వాస వ్యాయామాలు: మానసిక ఏకాగ్రత, ప్రశాంతత, అంతర్గత బలాన్ని పెంపొందించడానికి హుయెన్ లాలాంగ్ ధ్యాన అభ్యాసాలను కలిగి ఉంది.
హుయెన్ లాలాంగ్ శిక్షణ ప్రయోజనాలు
ఫిజికల్ బెనిఫిట్స్
మెరుగైన స్ట్రెంథ్, ఫ్లెక్సిబిలిటీ, ఎండ్యూరెన్స్ పొందుతారు. అలానే కోఆర్డినేషన్, బ్యాలెన్స్ అభివృద్ది చెందుతాయి. కార్డియోవాస్కులర్ ఫిట్‌నెస్, స్టామినా పెరుగుతాయి. ఆత్మరక్షణ నైపుణ్యాలు, విశ్వాసం మెరుగవుతాయి.
మెంటల్ బెనిఫిట్స్
ఒత్తిడి, యాంగ్జైటీ దూరమవుతాయి. మానసిక స్పష్టత, స్పష్టత పెరుగుతాయి. అలానే సెల్ఫ్-డిసిప్లైన్, ఆత్మగౌరవం మెరుగవుతాయి. బాడీ- మైండ్ కనెక్షన్‌పై స్పష్టమైన అవగాహన వస్తుంది.
మను బాకర్, నీరజ్ స్పెషల్ చిట్‌చాట్- వీడియో వైరల్- మేటర్ ఏంటంటే? - Paris Olympics 2024
మను బాకర్‌కు గ్రాండ్ వెల్కమ్ - డప్పు శబ్దాలకు చిందులేస్తూ హంగామా! - Manu Bhaker Grand Welcome