Lionel Messi Retirement : 2026 ప్రపంచకప్‌లో స్టార్ ఫుట్‌బాలర్ లియోనెల్ మెస్సి ఆడతాడా? లేదా అన్న ప్రశ్న ఇప్పుడు అభిమానుల్లో ఆసక్తిరేపుతోన్న అంశం. ఇటీవలే చీలమండ గాయం కారణంగా కోపా అమెరికా ఫైనల్లో అర్ధంతరంగా మైదానాన్ని వీడాడు. తీవ్రమైన నొప్పి వల్ల మ్యాచ్‌కు దూరమైనందుకు అతడు డగౌట్లోనే కన్నీళ్లు పెట్టుకున్నాడు. అర్జెంటీనా విజేతగా నిలిచినప్పటికీ, దెబ్బ వల్ల సెలబ్రేషన్స్ కూడా చేసుకోలేకపోయాడు.
అయితే మెస్సి చాలా కాలంగా కండరాల సమస్యలతో బాధపతుడున్నాడు. అందువల్లే గతేడాది కాలంలోనే అనేక మ్యాచ్‌ల్లో అతడు పాల్గొనలేకపోయాడు. కోపా అమెరికాలో రెండో గ్రూప్ మ్యాచ్ (చిలీతో) సందర్భంగా కుడి కాలి కండరాల నొప్పి వల్ల ఇబ్బంది ఎదుర్కొన్నాడు. ఆ తర్వాతి మ్యాచ్ (పెరూ)లోనూ మెస్సి ఆడలేకపోయాడు.
ఇదిలా ఉండగా, ఈక్వెడార్‌తో జరిగిన క్వార్టర్‌ఫైనల్లో ఆకట్టులేకపోయాడు. పెనాల్టీ షూటౌట్లో తన ఛాన్స్‌ను వృథా చేసుకున్నాడు. కెనడాతో సెమీఫైనల్ మ్యాట్‌లో మాత్రం ఓ గోల్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ టోర్నీలో అతడు కొట్టిన ఏకైక గోల్ కూడా అదే. ఇక నొప్పితో భరిస్తూనే ఉన్న మెస్సి టోర్నీ తర్వాత మీడియాతో కూడా మాట్లాడలేదు. అంతే కాకుండా గాయం తీవ్రత గురించి అర్జెంటీనా టీమ్‌కు కూడా చెప్పలేదు.
అయితే సెప్టెంబరులో అర్జెంటీనా తిరిగి మైదానంలోకి అడుగుపెట్టనుంది. ఆ నెలలో చిలీ, కాంబోడియాలతో ప్రపంచకప్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు జరగనుంది. మరి గాయం నుంచి కోలుకుని మెస్సి తిరిగొచ్చి, ప్రపంచకప్ ప్రాక్టీస్‌కు వస్తాడా? లేకుంటే కోపా టైటిల్‌తో కెరీర్‌ను ముగిస్తాడా అన్నది వేచి చూడాల్సిందే.
Copa America 2024: కోపా అమెరికా ఫైనల్ మ్యాచ్‌లో కొలంబియాపై అర్జెంటీనా విజయం సాధించించింది. ఈ మ్యాచ్‌లో తొలుత 90 నిమిషాల్లో రెండు టీమ్‌లు గోల్స్ చేయలేకపోయాయి. దీంతో ఎక్స్‌ట్రా టైమ్ కేటాయించారు. 110వ నిమిషంలో అర్జెంటీనా క్రీడాకారుడు లిసాండ్రో మార్టినేజ్ ఓ గోల్ చేశాడు. ఇక 1- 0తో అర్జెంటీనా విజేతగా నిలిచింది. కాగా అర్జెంటీనాకు ఇది 16వ కోపా అమెరికా టైటిల్ కావడం విశేషం. ఈ క్రమంలో అత్యధికసార్లు కోపా అమెరికా ట్రోఫీ నెగ్గిన జట్టుగా అర్జెంటీనా రికార్డు కొట్టింది. 15 టైటిళ్లతో ఉరుగ్వే రెండో స్థానంలో ఉంది.
పాపం మెస్సీకి ఇలా జరిగిందేంటి?- వెక్కి వెక్కి ఏడ్చేశాడు - Lionel Messi Copa America 2024