KKR VS DC IPL 2024 : ఐపీఎల్ సీజన్ 17లో భాగంగా దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా బ్యాటర్లు చెలరేగిపోయారు. దీంతో ఐపీఎల్లో రెండో అత్యధిక స్కోరు నమోదైంది. పదకొండేళ్ల పాటు పదిలంగా ఉన్న ఐపీఎల్ అత్యధిక స్కోరు రికార్డును ఈ మధ్యే సన్‌రైజర్స్(274) బద్దలు కొట్టింది. ఇంతలోనే ఇప్పుడు కోల్‌కతా నైట్‌రైడర్స్ అదే స్థాయిలో రెచ్చిపోయి రికార్డు స్కోరుకు అత్యంత చేరువగా వచ్చింది. 272 పరుగులు చేసింది. ఫలితంగా దిల్లీ క్యాపిటల్స్‌పై 106 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఓపెనర్ సునీల్ నరైన్ తన ఇన్నింగ్స్‌లో నిలకడగా రాణించి 85 పరుగులు స్కోర్ చేశాడు. ఫోర్లు సిక్సర్లు బాది దిల్లీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఇక యంగ్ బ్యాటర్ రఘువంశీ (54) కూడా అర్ధ శతకంతో చెలరేగాడు. ఆండ్రూ రస్సెల్ (41), రింకు సింగ్ (26) కూడా దూకుడుగా ఆడారు. దీంతో కోల్‌కతా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. దిల్లీ బౌలర్లలో నోకియా 3, ఇషాంత్ శర్మ 2, ఖలీల్ అహ్మద్, మిచెల్ మార్ష్ తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం కోల్‌కతా నిర్దేశించిన భారీ స్కోర్‌ను డీసీ ఛేదించలేకపోయింది. 17.2 ఓవర్లలో 166 పరుగులకే ఆలౌట్ అయింది. ఇంపాక్ట్ ప్లేయర్ వైభవ్ అరోరా (3/27), వరుణ్ చక్రవర్తి (3/33) మిచెల్ స్టార్క్ (2/25) దిల్లీ జట్టును గట్టిగా దెబ్బ తీశారు. ఓపెనర్లుగా దిగిన డేవిడ్ వార్నర్, పృథ్వీ షా మెరుపులు మెరిపించలేకపోయారు. ఆ తర్వాత వచ్చిన మిచెల్ మార్ష్ , అభిషేక్ పోరల్ ఒక్క రన్ కూడా స్కోర్ చేయకుండానే ఔటయ్యారు. రిషబ్ పంత్ (25 బంతుల్లో 4×4, 5×6 సాయంతో 55 పరుగులు), ట్రిస్టియన్ స్టబ్స్ (32 బంతుల్లో 4×4, 4×6 సాయంతో 54) పోరాడారు. కాగా, 4 మ్యాచ్‌ల్లో దిల్లీకి ఇది మూడో పరాజయం. కోల్‌కతా ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది.
అత్యధిక స్కోరులు
- హైదరాబాద్ 277/3 Vs ముంబయి
- కోల్‌కతా 272/7 Vs దిల్లీ
- బెంగళూరు 263/5 Vs పుణె
- లఖ్‌నవూ 257/5 Vs పంజాబ్
- బెంగళూరు 248/3 Vs గుజరాత్ లయన్స్
'అతడిలా ఎవ్వరూ బౌలింగ్ చేవలేరు - కచ్చితంగా టీ20 వరల్డ్ కప్‌కు తీసుకోవాలి' - Mayank Yadav LSG
28 ఏళ్లకే రూ.100 కోట్ల డీల్- ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా రికార్డ్ - Rs 100 Crore Deal Cricketer