ETV Bharat / sports

గెలుపు ట్రాక్ ఎక్కిన చెన్నై- 7 వికెట్లతో సీఎస్కే ఘన విజయం- కేకేఆర్​కు తొలి ఓటమి - KKR vs CSK IPL 2024 - KKR VS CSK IPL 2024

KKR vs CSK IPL 2024: చెన్నై సూపర్ కింగ్స్​ మళ్లీ గెలుపు బాట పట్టింది. సోమవారం కేకేఆర్​తో జరిగిన మ్యాచ్​లో 7 వికెట్ల తేడాతో నెగ్గింది.

KKR vs CSK IPL 2024
KKR vs CSK IPL 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 8, 2024, 11:01 PM IST

KKR vs CSK IPL 2024: 2024 ఐపీఎల్​లో రెండు వరుస ఓటముల తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ మళ్లీ గెలుపు బాట పట్టింది. సోమవారం చెన్నై చిదంబరం స్టేడియంలో కోల్​కతా నైట్​రైడర్స్​తో జరిగిన మ్యాచ్​లో సీఎస్కే 7 వికెట్ల తేడాతో నెగ్గింది. కేకేఆర్ నిర్దేశించిన 138 పరుగుల టార్గెట్​ను చెన్నై 3 వికెట్లు కోల్పోయి 17.4 ఓవర్లలో ఛేదించింది. కెప్టెన్, ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (67* పరుగులు) హాఫ్ సెంచరీతో అదరగొట్టగా, చివర్లో శివమ్ దూబే (28 పరుగులు) రాణించాడు. కేకేఆర్ బౌలర్లలో వైభవ్ అరోరా 2, సునీల్ నరైన్ 1 వికెట్ దక్కించుకున్నారు.

స్వల్ప లక్ష్య ఛేదనలో చెన్నై నాలుగో ఓవర్లోనే ఓపెనర్ రచిన్ రవీంద్ర (15 పరుగులు) వికెట్ కోల్పోయింది. అయినప్పటికీ కెప్టెన్ రుతురాజ్ క్రీజులో నిలబడ్డాడు. డారిల్ మిచెల్ (25 పరుగులు)​తో కలిసి స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. ఈ క్రమంలోనే రుతురాజ్ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరూ రెండో వికెట్​కు 70 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇక 12.3 వద్ద సునీల్ నరైన్​ అద్భుత బంతికి డారిల్ మిచెల్ క్లీన్​ బౌల్డయ్యాడు. ఇక చివర్లో శివమ్ దూబే (28) రాణించాడు. గెలుపు ముంగిట వైభవ్ బౌలింగ్​లో దూబే క్లీన్​బౌల్డయ్యాడు. చివర్లో ధోనీ (1*) క్రీజులోకి వచ్చాడు.

అంతకుముందు బ్యాటింగ్​కు దిగిన కోల్​కతా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (34 పరుగులు) ఒక్కడే ఫర్వాలేదనిపించాడు. ఓపెనర్ ఫిల్ సాల్ట్ (0) తొలి బంతికే ఔటయ్యాడు. ఆ తర్వాత వరుసగా రఘువంశీ (24 పరుగులు), నరైన్ (27 పరుగులు), వెంకటేశ్ అయ్యర్ (3), రమన్​దీప్ సింగ్​ (13 పరుగులు), రింకూ సింగ్ (9 పరుగులు) పెవిలియన్​కు క్యూ కట్టారు. హార్డ్ హిట్టర్ అండ్రూ రస్సెల్ (10 పరుగులు) కూడా స్పల్ప స్కోర్​కే వెనుదిరగడం వల్ల కేకేఆర్ ఓ మోస్తారు పరుగులు కూడా సాధించలేకపోయింది. చెన్నై బౌలర్లలో తుషార్ దేశ్​పాండే 3, రవీంద్ర జడేజా 3, ముస్తాఫిజుర్ రహ్మాన్ 2, మహీశ్ తీక్షణ 1 వికెట్ దక్కించుకున్నారు. ఇక ఈ మ్యాచ్​తో కేకేఆర్ ప్రస్తుత సీజన్​లో తొలి ఓటమి చవి చూసింది.

IPLలో రప్ఫాడిస్తున్న 'దూబే'- హార్దిక్ టీమ్ఇండియా ప్లేస్​​పై ఎఫెక్ట్? - Shivam Dube IPL 2024

ఐపీఎల్​లో 'విరాట్' మరో రికార్డ్- దరిదాపుల్లో కూడా ఎవరూ లేరుగా! - Virat Kohli Ipl Runs

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.