ETV Bharat / sports

రాంచీ టెస్టుకు బుమ్రా దూరం!- 'ఈటీవీ భారత్' చిట్​చాట్​లో బీసీసీఐ మెంబర్ క్లారిటీ

Jasprit Bumrah Ind vs Eng: టీమ్ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఇంగ్లాండ్​తో నాలుగో టెస్టుకు దూరం కానున్నట్లు కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ మెంబర్ ఒకరు ఈటీవీ భారత్​తో మాట్లాడి క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే?

Jasprit Bumrah Ind vs Eng
Jasprit Bumrah Ind vs Eng
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 20, 2024, 6:40 PM IST

Updated : Feb 20, 2024, 6:55 PM IST

Jasprit Bumrah Ind vs Eng: రాజ్​కోట్​లో ఆల్​రౌండ్​ ప్రదర్శనతో అదరగొట్టిన భారత్ టెస్టుల్లోనే అతిపెద్ద (పరుగుల పరంగా) విజయాన్ని నమోదు చేసింది. ఇక ఫిబ్రవరి 23నుంచి రాంచీలో జరగనున్న టెస్టు మ్యాచ్​కు టీమ్ఇండియా ప్రిపేర్ అవుతోంది. అయితే మిగిలిన రెండు టెస్టులకు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు రెస్ట్ ఇచ్చే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు బోర్డు మెంబర్ ఒకరు ఈటీవీ భారత్​తో చెప్పారు.

'2024 వరల్డ్​కప్ సమీపిస్తున్న నేపథ్యంలో అతడిపై వర్క్​లోడ్ పడకుండా చూసుకోవాలని టీమ్ఇండియా మేనేజ్​మెంట్​కు బీసీసీఐ చెప్పింది. బుమ్రాకు ఇదివరకు జరిగిన గాయాలు దృష్టిలో ఉంచుకొని అతడిని లిమిటెడ్​గానే ఉపయోగించుకుంటేనే మంచిది' అని బీసీసీఐ మెంబర్ చెప్పారు. అలాగే రాబోయే ఐపీఎల్​లో బుమ్రాపై పనిభారం పెంచి రిస్క్ చేయవద్దని బీసీసీఐ, ముంబయి ఇండియన్స్ ఫ్రాంచైజీతో చెప్పినట్లు తెలుస్తోంది. ఇక టీమ్ఇండియా జట్టు మంగళవారం రాంచీకి చేరుకుంది. కానీ, బుమ్రా రాజ్​కోట్​ నుంచి నేరుగా ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో ఇంగ్లాండ్​తో భారత్ ఆడబోయే తదుపరి రెండు టెస్టులకు బుమ్రాకు విశ్రాంతినివ్వడం పక్కాగా కనిపిస్తోంది. కానీ, దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

శుక్రవారం పిచ్​ పరిశీలించిన తర్వాత రాంచీ టెస్టుకు జట్టును ఎంపిక చేసే ఛాన్స్ ఉంది. అయితే పిచ్ సాధారణంగా బ్యాటింగ్​కు అనుకూలించినట్లైతే పేసర్లలో ముకేశ్ కుమార్ లేదా ఆకాశ్ దీప్​లో ఒకరు తుది జట్టులో ప్లేస్ దక్కించుకుంటారు. ఒకవేళ స్పిన్​కు అనుకూలమైతే భారత్ నలుగురు స్పిన్నర్లతో బరిలో దిగే అవకాశం ఉంది. అందులో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుంగర్​ జట్టులో ఉండనున్నారు. అయితే చివరిసారిగా టెస్టుల్లో భారత్ 2012లో నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగింది.

కాగా, ఈ సిరీస్‌లో బుమ్రా అద్భుతంగా రాణించాడు. ఇప్పటికే అతడు మూడు మ్యాచ్​ల్లో కలిపి 17 వికెట్లు పడగొట్టి, సిరీస్​లోనే లీడ్ వికెట్​ టేకర్​గా కొనసాగుతున్నాడు. ఇదే సిరీస్​లో రెండో మ్యాచ్​లోనే బుమ్రా టెస్టుల్లో 150 వికెట్ల ఘనత సాధించాడు. ఓవరాల్​గా బుమ్రా 35 మ్యాచ్​ల్లో 157 వికెట్లు పడగొట్టాడు.

బహు పరాక్‌ - ఆ పోరాట స్ఫూర్తే పరుగుల తపస్విగా మార్చింది!

ఇంగ్లాండ్​తో నాలుగో టెస్ట్​ - టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ దూరం!

Last Updated : Feb 20, 2024, 6:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.