ETV Bharat / sports

బుమ్రా బౌలింగ్​ దెబ్బ - బ్యాట్‌ కిందపడేసిన బెన్‌స్టోక్స్‌ - Ind Vs Eng 2nd Test 2nd Day

Jasprit Bumrah England Series : ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో జస్‌ప్రీత్‌ బుమ్రా చేసిన ఓ పనికి బెన్‌స్టోక్స్‌ షాకయ్యాడు. ఇంతకీ ఏం జరిగిందంటే ?

Jasprit Bumrah England Series
Jasprit Bumrah England Series
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 3, 2024, 9:21 PM IST

Jasprit Bumrah England Series : విశాఖ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమ్ఇండియా చెలరేగిపోతోంది. ముఖ్యంగా శనివారం జరిగిని ఇన్నింగ్స్​లో అద్భుతమైన పర్​ఫామెన్స్​ చూపించి అభిమానుల్లో జోష్​ నింపింది. అయితే అందరి దృష్టి మాత్రం మన యార్కర్ కింగ్ జస్ప్రీత్ బుమ్రాపై పడింది.

తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా ఆరు వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్‌ జట్టును షాక్​కు గురిచేశాడు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లోనే ఇంగ్లీష్​ జట్టు 253 పరుగులకు ఆలౌటైంది. అయితే ఇదే వేదికపై ఓ ఆసక్తికరమైన ఘటన జరిగింది. ఈ మ్యాచ్‌లో మన టాప్‌ పేసర్‌ అద్భుతమైన డెలివరీతో అర్ధ శతకం దిశగా సాగుతున్న ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ బెన్‌స్టోక్స్​ను(47) పెవిలియన్‌కు పంపాడు.

బుమ్రా వేసిన ఇన్నింగ్స్‌ 50వ ఓవర్‌లో తొలి బంతిని స్టోక్స్‌ ఎదుర్కొన్నప్పటికీ ఆ సమయంలో పరుగులేమీ రాలేదు. దీంతో రెండో బంతి వేస్తున్నప్పుడు బుమ్రా తన బౌలింగ్​ స్కిల్​ను చూపించాడు. కట్టర్‌ సంధించి స్టోక్స్‌ను దెబ్బకొట్టాడు. ఆఫ్‌ స్టంప్‌ దిశగా తక్కువ ఎత్తులో వచ్చిన ఆ బాల్​ను స్టోక్స్ డిఫెండ్ చేయబోయాడు. అయితే అది బాల్​ కాస్త మిస్‌ అయి ఆఫ్‌ స్టంప్‌ను పడగొట్టింది. దీంతో స్టోక్స్‌ వెనక్కి తిరిగి చూడకుండానే బ్యాట్ కింద పడేసి ' ఈ బాల్​ను ఎలా ఆడాలి'? అన్నట్టుగా స్టోక్స్​ నిరాశతో పెవిలియన్​ బాట పట్టాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట ట్రెండ్ అవుతోంది. మరోవైపు స్టోక్స్‌ను ఔట్‌ చేయడం ద్వారా బుమ్రా టెస్టుల్లో 150 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు.

Ind Vs Eng 2nd Test 2nd Day : ఇక, మ్యాచ్‌ విషయానికొస్తే - ఇంగ్లాండ్ 253 పరుగులకు ఆలౌట్ కావడం వల్ల తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్​ సేనకు 143 పరుగుల ఆధిక్యం లభించింది. దీంతో రెండోరోజు ఆట ముగిసేసరికి టీమ్‌ఇండియా ఒక్క వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది. ప్రస్తుతం భారత్‌ ఆధిక్యం 171 పరుగలు ఉండగా, రోహిత్‌ శర్మ (13*), యశస్వి జైస్వాల్ (15*) క్రీజులో ఉన్నారు.

రఫ్పాడించిన బుమ్రా- ఇంగ్లాండ్ 253 ఆలౌట్- 171 రన్స్​ లీడ్​లో భారత్

యార్కర్ కింగ్ ఈజ్ బ్యాక్- 'బుమ్రా' బంతికి పోప్ క్లీన్​బౌల్డ్- వీడియో చూశారా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.