James Anderson England series : ఇటీవలే జరిగిన నాలుగో టెస్ట్‌లో ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్ జేమ్స్ ఆండర్సన్ శతాకలతో చెలరేగిపోయాడు. 41 ఏళ్ల వయసులోనూ జట్టుకు కీలక ఇన్నింగ్స్ అందిస్తూ దుసుకెళ్లాడు. ఈ నేపథ్యంలో రానున్న సిరీస్‌లోనూ ఈ స్టార్ పైనే అందరి దృష్టి పడింది. గురువారం నుంచి ప్రారంభం కానున్న 5వ టెస్టు మ్యాచ్‌లో ఇతడు కూడా పలు కీలక రికార్డులను తన ఖాతాలో వేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఇంతకీ ఏవేంటంటే ?
700 వికెట్ల రికార్డు :
ధర్మశాల వేదికగా జరనున్న మ్యాచ్‌లో జేమ్స్ మరో రెండు వికెట్లు తీస్తే టెస్టు క్రికెట్‌లో 700 వికెట్లు తీసిన ఘనతను తన ఖాతాలో వేసుకుంటాడు. అంతే కాకుండా ఇప్పటిదాకా 186 టెస్టు మ్యాచ్‌ల నుంచి సాధించిన 698 వికెట్లకు ఈ రెండూ జోడిస్తే టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా ఆండర్సన్ చరిత్రకెక్కుతాడు.
భారత్‌పై 150 వికెట్లు :
భారత్‌పై టెస్టు సిరీస్‌లో 150 వికెట్లు తీసిన ఇంగ్లాండ్ ప్లేయర్‌గా జేమ్స్ మరో ఘనతను సాధించనున్నారు. దానికి కేవలం 3 వికెట్లు మాత్రమే కావాల్సి ఉంది. ఇప్పటివరకు 38 టెస్టు మ్యాచ్‌లు ఆడిన ఆండర్సన్ ఇప్పటివరకు 147 వికెట్లను పడగొట్టాడు.
విదేశీ పిచ్‌లపై 250 వికెట్లు :
ఈ రెండింటితో పాటు జేమ్స్ మరో అరుదైన రికార్డును అందుకోనున్నాడు. విదేశాల్లో ఇప్పటివరకు 75 మ్యాచ్‌లు ఆడి ఆండర్సన్ 242 వికెట్లు తీశాడు. ఇప్పుడు ఈ ఐదో టెస్టులో మరో ఎనిమిది వికెట్లు తీస్తే 250 వికెట్ల మైల్‌స్టోన్‌ను చేరుకుంటాడు. ఆఖరి టెస్టులో 8 వికెట్లు తీయడం వల్ల అండర్సన్ భారత్‌లో 50 టెస్టు వికెట్లు పూర్తి చేయడంలో దోహదపడుతుంది.
టీమ్ఇండియా తుది జట్టు : రోహిత్ శర్మ(కెప్టెన్), శ్రీకర్ భరత్, శుభమన్ గిల్, రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్(కీపర్), రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, దేవదత్ పడిక్కల్, మహ్మద్ సిరాజ్, అక్షర్ పటేల్, ముకేశ్ కుమార్, వాషింగ్టన్ సుందర్ , ఆకాశ్ దీప్.
ఇంగ్లాండ్ తుది జట్టు : బెన్ స్టోక్స్(కెప్టెన్), జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఆలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, టామ్ హార్ట్లీ, ఆలీ రాబిన్సన్, షోయబ్ బషీర్, జేమ్స్ ఆండర్సన్, మార్క్ వుడ్, రెహాన్ అహ్మద్, బెన్ ఫోక్స్( వికెట్ కీపర్), డేనియల్ లారెన్స్ , గుస్ అట్కిన్సన్.