ETV Bharat / sports

రెండో టెస్టుతో ఆండర్సన్‌ ఎంట్రీ - అప్పటికి ఆ ఇద్దరు పుట్టనేలేదు - జేమ్స్​ ఆండర్సన్ ఇంగ్లాండ్ సిరీస్​

James Anderson England Series : జట్టు కూర్పు కారణంగా తొలి టెస్ట్‌ ఆడే అవకాశం దక్కని 41 ఏళ్ల ఇంగ్లాండ్​ ప్లేయర్​ జేమ్స్‌ ఆండర్సన్​ రెండో టెస్ట్‌తో బరిలోకి దిగున్నాడు. అయితే తాజాగా ఆండర్సన్​ గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్​డేట్​ నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఇంతకీ అదేంటంటే ?

James Anderson England Series
James Anderson England Series
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 1, 2024, 6:44 PM IST

James Anderson England Series : విశాఖ వేదికగా భారత్​, ఇంగ్లాండ్ మధ్య రెండో టెస్ట్‌ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఇంగ్లాండ్ టీమ్​ రెండు మార్పులు చేసి తమ తుది జట్టును ప్రకటించింది. అలా జట్టు కూర్పు కారణంగా తొలి టెస్ట్‌ ఆడే అవకాశం దక్కని 41 ఏళ్ల ఇంగ్లాండ్​ ప్లేయర్​ జేమ్స్‌ ఆండర్సన్​రెండో టెస్ట్‌తో బరిలోకి దిగున్నాడు. ఇతడి రాకతో తొలి టెస్ట్‌ ఆడిన మరో పేసర్‌ మార్క్‌ వుడ్ బెంచ్​కు పరిమితమయ్యాడు.

మరోవైపు తొలి టెస్ట్‌లో గాయపడిన సీనియర్ స్పిన్నర్​ జాక్‌ లీచ్‌ స్థానంలో పాక్‌ మూలాలున్న షోయబ్‌ బషీర్‌కు ఛాన్స్ దక్కింది. అయితే ఆండర్సన్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం నెట్టింట ట్రెండ్ అవుతోంది. అదేంటంటే ఆండర్సన్‌ 2003, మే 22న తన టెస్ట్‌ అరంగేట్రం చేశాడు. అయితే ఆ సమయానికి ఇప్పటి ఇంగ్లాండ్​ జట్టులో ఉన్న ఇద్దరు ప్లేయర్స్ అసలు పుట్టనే లేదు. వారెవరో కాదు షోయబ్‌ బషీర్‌, రెహాన్‌ అహ్మద్‌. 2003 అక్టోబర్‌ 13న బషీర్‌ పుట్టగా, రెహాన్‌ 2004, ఆగస్ట్‌ 13న జన్మించాడు. ఈ మాట విన్న క్రికెట్ లవర్స్ ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఆండర్సన్‌ ఫిట్‌నెస్‌, అతడికి ఆట పట్ల ఇంట్రెస్ట్​ గురించి కొనియాడుతున్నారు.

మరోవైపు ఆండర్సన్‌ ప్రస్తుత టెస్ట్‌ క్రికెట్‌లో మూడో అత్యధిక వికెట్‌ టేకర్‌గా కొనసాగుతున్నాడు. ఆడిన 183 టెస్టుల్లో 690 వికెట్లు పడగొట్టి ఈ ప్లేస్​లో ఉన్నాడు. అయితే టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు ఇప్పటికీ శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీథరన్‌ పేరిట ఉంది. ఈయన 800 వికెట్లతో టాప్​లో కొనసాగుతున్నాడు. అతనికి తర్వాతి స్థానంలో 708 వికెట్లతో దివంగత ప్లేయర్ షేన్‌ వార్న్‌ ఉన్నాడు. వీరిద్దరి తర్వాతి స్థానాన్ని ఆండర్సన్‌ కైవసం చేసుకున్నాడు.

రెండో టెస్టుకు ఇంగ్లాండ్​ తుది జట్టు : బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ డకెట్, ఓలీ పోప్, జాక్ క్రాలీ, జో రూట్, బెన్ ఫోక్స్, రెహాన్ అహ్మద్, టామ్ హార్లీ, షోయబ్ బషీర్, జేమ్స్ అండర్సన్.

సక్సెస్​ఫుల్​ పేస్​ బౌలర్ల జాబితాలోకి ఇంగ్లాండ్​ ప్లేయర్​ జేమ్స్​ ఆండర్సన్​

రివర్స్​ స్వింగ్​తో అండర్సన్ మాయ చేస్తాడు​: సచిన్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.