ETV Bharat / sports

ఐపీఎల్ మెగా వేలానికి ముందు బీసీసీఐ నయా రూల్స్! - ఇంతకీ ఈ 4+2 రిటెన్షన్ పాలసీ ఏంటంటే? - IPL 2025 Retention Rules - IPL 2025 RETENTION RULES

IPL 2025 Retention Rules : 2025 ఐపీఎల్​ మెగా వేలానికి ముందే బీసీీసీఐ ఓ నయా రూల్​ను అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ప్లేయర్ల రిటెన్షన్ల విషయంలో కొత్త పాలసీ తేనుంది. ఇంతకీ అదేంటంటే?

IPL 2025 Retention Rules
IPL 2025 Retention Rules (Getty Images)
author img

By ETV Bharat Sports Team

Published : Sep 22, 2024, 7:57 AM IST

IPL 2025 Retention Rules : మరికొన్ని నెలల్లో జరగనున్న ఐపీఎల్​ మెగా వేలం కోసం బీసీసీఐ పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఫ్రాంచైజీలతో చర్చలు జరిపి వారి నుంచి పలు అభిప్రాయాలు సేకరించింది. అయితే ఈ మేగా వేలానికంటే ముందు అందరి దృష్టి బీసీసీఐ అనౌన్స్ చేయనున్న రిటెన్షన్ పాలసీపైన పడింది.

క్రీడా వర్గాల సమాచారం ప్రకారం బీసీసీఐ ఈ పాలసీ విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రతీ టీమ్​కు నలుగురు ప్లేయర్ల రిటెన్షన్‌తో పాటు రెండు ఆర్‌టీఎమ్(రైట్ టు మ్యాచ్) కార్డ్స్​ను అందజేయాలని బోర్డు డిసైడ్​ అయినట్లు సమాచారం. ఇందులో భాగంగా అనామక ఆటగాళ్లను కూడా ఐపీఎల్​లోకి తీసుకోవాల్సి ఉంటుంది.

క్లుప్తంగా చెప్పాలంటే, ప్రస్తుతం జట్టులో ఉన్న ఆరుగురు ప్లేయర్లను ఆయా ఫ్రాంచైజీలు అంటిపెట్టుకోవచ్చు. అయితే నలుగురిని నేరుగా రిటైన్ చేసుకుంటే, మరో ఇద్దరిని మాత్రం వేలంలో ఆర్‌టీఎమ్ కింద తిరిగి కొనుగోలు చేసుకోవచ్చు. ఈ రూల్ ప్రస్తుత జట్ల ప్రధాన ఆటగాళ్లను కంటిన్యూ చేసేందుకు ఉపయోగపడనుంది.

రిటెన్షన్ ప్రక్రియలో భాగంగా ఆయా జట్లు తమ మార్క్యూ ఆటగాళ్లతో పాటు ఎమర్జింగ్ స్టార్స్, అనామక ప్లేయర్లను కూడా భాగం చేయాల్సి ఉంటుంది. అయితే, ముగ్గురు ఆటగాళ్ల రిటెన్షన్ గురించి కూడా చర్చ జరగ్గా, నలుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకునే వెసులుబాటుకే మెజార్టీ ఫ్రాంచైజీలు ఓటు వేసినట్లు తెలుస్తోంది. ఇది కుదరకపోతే ముగ్గురు ఆటగాళ్ల రిటెన్షన్‌తో పాటు మిగతా ముగ్గురిని ఆర్‌టీఎమ్ కార్డ్స్ ద్వారా తీసుకోవాలన్న డిమాండ్ కూడా ఫ్రాంచైజీలు బీసీసీఐ ముందు ఉంచిందట. అందుకే ఈ నలుగురి రిటెన్షన్​కు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

4+2 రిటెన్షన్ పాలసీని చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్, ముంబయి ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్‌కు కలిసొచ్చే అంశం కానుంది. తమ జట్టులోని మెయిన్ ప్లేయర్స్​ను ఈ ఐదు టీమ్స్ అంటిపెట్టుకునే ప్లాన్స్​లో ఉన్నాయి. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్, లఖ్​నవూ సూపర్ జెయింట్స్ లాంటి జట్లకు మాత్రం ఈ పాలసీ అంతగా ఉపయోగపడకపోవచ్చని విశ్లేషకుల మాట.

అయితే పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తీవ్రంగా నష్టపోనున్నాయని తెలుస్తోంది. సరైన టీమ్ కాంబినేషన్‌ లేమితో సతమతమవుతున్న ఈ రెండు జట్లు మెగా వేలం ద్వారా అయినా తమ టీమ్​ను ఈ సారి బలపరుచుకోవాలని అనుకున్నాయి. కానీ బీసీసీఐ తీసుకోనున్న ఈ నిర్ణయం వారికి గట్టి దెబ్బ తగిలించేలా ఉన్నట్లు తెలుస్తోంది.

2025 ఐపీఎల్ మెగా వేలంలో ఆ ముగ్గురికి జాక్ పాట్! రూ. కోట్లు ఇచ్చి దక్కించుకునేందుకు ఫ్రాంచైజీలు ఇంట్రెస్ట్​! - 2025 IPL Mega Auction

ఐపీఎల్ హిస్టరీలో సూపర్ కెప్టెన్స్ - ఒక్క మ్యాచ్‌ కూడా ఓడలేదు! - IPL Captains Who Never Lost a Match

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.