IPL 2025 Purse Value : భారత్‌లో ఐపీఎల్‌కు ఉండే ఆదరణే వేరు. ఈ లీగ్‌లో ఆడేందుకు దేశవిదేశాల్లోని అంతర్జాతీయ ఆటగాళ్లు సైతం మొగ్గు చూపుతారు. అలాగే ఐపీఎల్ మ్యాచ్‌లను చూసేందుకు ప్రేక్షకులు సైతం విపరీతంగా ఆసక్తి కనబరుస్తారు. అందుకే ఐపీఎల్ శాటిలైట్ రైట్స్ వంటివి భారీ ధర పలుకుతుంటాయి. కాగా, 2008లో ప్రారంభమైన ఐపీఎల్ ఇప్పటివరకు 17 సీజన్లు పూర్తి చేసుకుంది. అయితే ఐపీఎల్ ప్రారంభ సీజన్లో వేలంలో ఆటగాళ్లను కొనుగోలు చేయడానికి ఒక్కో ఫ్రాంచైజీ దగ్గర 22.5 కోట్లు ఉండేది. ప్రతిసారి పెరుగుకుంటూ ఇఫ్పుడు రూ.120 కోట్లకు చేరింది. అంటే 17 ఏళ్లలో దాదాపు 600 శాతం పెరిగిందన్నమాట.
తొలి సీజన్లో ఎంతంటే?
2008లో ఐపీఎల్ ఫ్రాంచైజీల వద్ద ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు రూ.22.5 కోట్లు ఉండేవి. ఆ తర్వాత 2011నాటికి అది రూ.43.2కోట్లకు పెరిగింది. అంటే ఏకంగా డబుల్ అయ్యింది. అలాగే 2014నాటికి ఆ లిమిట్ కాస్త రూ.60 కోట్లయ్యింది. 2018కి రూ.80 కోట్లు, 2022కి రూ.90 కోట్లకు పెరిగింది. అయితే వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్ సీజన్‌కు ఏకంగా రూ.120 కోట్లకు పెరిగిపోయింది. అంటే ప్రారంభ సీజన్ నుంచి ఇప్పటివరకు దాదాపు 600 రెట్లు పెరిగిందన్నమాట.
ఐపీఎల్ పాలక మండలి నిర్ణయాలు
మరి కొన్నాళ్లలో మెగా వేలం జరగనున్న నేపథ్యంలో ఫ్రాంఛైజీలు తమ టీమ్‌లోని ఆరుగురు ఆటగాళ్లను అట్టిపెట్టుకోవడానికి ఐపీఎల్ పాలకవర్గం ఇటీవలే అనుమతినిచ్చింది. ఇందులో ఒక రైట్ టు మ్యాచ్ (ఆర్‌టీఎం) కలిసి ఉంటుందని పేర్కొంది. జట్టు దగ్గర ఉండే మొత్తం రూ.120 కోట్లు అయితే, అట్టిపెట్టుకున్న అయిదుగురి కోసం రూ.75 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుందని తెలిపింది. అయితే 2022లో జరిగే మెగా వేలంలో ఆయా జట్లకు నలుగురిని మాత్రమే అట్టిపెట్టుకోవడానికి అవకాశమిచ్చారు. ఈ సారి ఆ సంఖ్య ఆరుకు పెరిగింది.
అయిదుగురిని అట్టిపెట్టికుంటే మిగిలేది రూ.45 కోట్లే!
ఐపీఎల్ పాలక వర్గం నియమాల ప్రకారం, ఫ్రాంచైజీలు అట్టిపెట్టుకున్న మొదటి ప్లేయర్‌కు వారు రూ.18 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. రెండో ప్లేయర్‌కు రూ.14 కోట్లు, అలాగే మూడో ఆటగాడికి రూ.11 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇక నాలుగు, అయిదో ఆటగాణ్ని కూడా అట్టిపెట్టుకుంటే వారు తిరిగి వరుసగా రూ.18 కోట్లు, రూ.14 కోట్లు ఇవ్వాల్సి వస్తుంది. ఏ ఫ్రాంఛైజీ అయినా సరే అయిదుగురు ఆటగాళ్లను అట్టిపెట్టుకుంటే వారికి రూ.45 కోట్లు మాత్రమే మిగులుతాయి.