IPL 2025 Mega Auction : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 మెగా వేలం తేదీలను బీసీసీఐ మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. సౌదీ అరేబియాలోని జెడ్డాలో నవంబర్ 24, 25 తేదీల్లో రెండు రోజుల పాటు ఈ మేగా వేలం జరుగుతుంది. దీనికి మొత్తం 1,574 మంది ప్లేయర్లు రిజిస్టర్ చేసుకున్నారు. వీరిలో 1,165 మంది భారత ఆటగాళ్లు, అలాగే 409 మంది ఫారిన్ ప్లేయర్లు ఉన్నారు. అంతేకాకుండా జాబితాలో 320 క్యాప్డ్ ప్లేయర్‌లు, 1,224 అన్‌క్యాప్డ్ ప్లేయర్‌లు, 30 అసోసియేట్ నేషన్స్ ప్లేయర్‌లూ ఉన్నారు.
అయితే ఫ్రాంచైజీలతో సంప్రదింపుల తర్వాత ప్లేయర్‌ల జాబితాను తగ్గించనున్నారు. ఆసక్తికరమైన అంశం ఏంటంటే కొన్ని నివేదికల మేరకు, రిజిస్టర్ చేసుకున్న ప్లేయర్‌ల జాబితాలో ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ బెన్ స్టోక్స్ లేడు.
స్టార్ ప్లేయర్ల బేస్ ప్రైస్ ఎంతంటే?
టీమ్ఇండియా స్టార్ ప్లేయర్లు ఐపీఎల్ మాజీ కెప్టెన్లు రిషబ్ పంత్ (దిల్లీ క్యాపిటల్స్), కేఎల్ రాహుల్(లఖ్‌నవూ సూపర్ జెయింట్స్), శ్రేయాస్ అయ్యర్ (కోల్‌కతా నైట్ రైడర్స్) వేలంలో అందుబాటులో ఉన్నారు. వీరు రూ.2 కోట్ల బేస్ ప్రైస్‌తో లిస్ట్ అయినట్లు సమాచారం. రాజస్థాన్ రిటైన్ చేయని సీనియర్ స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్ కూడా ఇదే బేస్‌ప్రైస్‌తో లిస్ట్ అయినట్లు తెలిసింది.
2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ రూ.24.50 కోట్లకు కొనుగోలు చేసిన మిచెల్ స్టార్క్ బేస్ ప్రైస్ కూడా రూ.2 కోట్లు. పృథ్వీ షా, సర్ఫరాజ్ ఖాన్ బేస్ ప్రైస్ రూ.75 లక్షలు. జాబితాలో ఇటలీకి చెందిన ఆటగాడు థామస్ డ్రాకా ఉన్నాడు. అతడిని ఇటీవల UAEలో ILT20 కోసం ఎంఐ ఎమిరేట్స్ కొనుగోలు చేసింది.
ఇంగ్లాండ్ ప్లేయర్‌ల నుంచి ఊహించని రియాక్షన్
అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగి, ఐపీఎల్‌లో ఇప్పటి వరకు పాల్గొనని ఇంగ్లాండ్ మాజీ ప్లేయర్, లెజెండరీ స్వింగ్ బౌలర్ జేమ్స్ అండర్సన్ రూ.1.25 కోట్ల బేస్ ప్రైస్‌తో రిజిస్టర్ చేసుకున్నాడు. మరోవైపు అంతర్జాతీయ క్రికెట్‌లో ఎంతో అనుభవమున్న, గతంలో ఆర్‌ఆర్‌కి కెప్టెన్‌గా వ్యవహరించిన స్టోక్స్ వేలానికి రిజిస్టర్ చేసుకోలేదు. ఈ సారి 1574 మంది ఆటగాళ్ల జాబితాలో స్టోక్స్ పేరు లేదు.
IPL మెగా వేలానికి డేట్స్ ఫిక్స్- ఆక్షన్ జరిగేది ఎక్కడంటే?
స్టార్ ఆటగాళ్లను వదులుకున్న ఫ్రాంచైజీలు- లిస్ట్‌లో ఇషాన్, పంత్ ఇంకా ఎవరంటే?