IPL 2024 Mumbai Indians Rohith Sharma on Impact Rule : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో మొదటి సీజన్ నుంచి ప్రస్తుత 17వ సీజన్ వరకు చాలా మార్పులు వచ్చాయి. కొత్త కొత్త రూల్స్, టెక్నాలజీలు అందుబాటులోకి వచ్చాయి. అయితే గతేడాది నుంచి అమల్లో ఉన్న ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ తనకు పెద్దగా నచ్చలేదని ముంబయి ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. తాజాగా లెజెండరీ క్రికెటర్లు మైఖేల్ వాన్, ఆడమ్ గిల్‌క్రిస్ట్‌తో కలిసి యూట్యూబ్ షో 'క్లబ్ ప్రైరీ ఫైర్'లో రోహిత్ చాలా ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నాడు. అవేంటో ఇప్పుడు చూసేద్దాం.
రోహిత్ షోలో మాట్లాడుతూ - ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ నాకు నచ్చలేదు. ఎందుకంటే వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే వంటి క్రికెటర్లకు తమ బౌలింగ్ స్కిల్స్ చూపించే అవకాశం ఉండట్లేదు. భారత్ ఆల్ రౌండర్లకు ఆ రూల్‌తో నష్టం జరుగుతోంది. అని పేర్కొన్నాడు. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల భారత ఆల్-రౌండర్ల డెవలప్‌మెంట్ వెనుకబడిపోతుందని భావిస్తున్నట్లు రోహిత్ చెప్పాడు.
- దూబేకి బౌలింగ్ చేసే ఛాన్స్ ఎక్కడ?
రోహిత్ వ్యాఖ్యలకు కారణం లేకపోలేదు. రానున్న ఐసీసీ టీ20 వరల్డ్ కప్ టీమ్‌లో చోటు కోసం చాలా మంది యంగ్‌స్టర్‌లు పోటీపడుతున్నారు. ఆల్‌రౌండర్ పొజిషన్‌కి పాండ్యా, దూబే వంటి ఆటగాళ్లు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఉండటంతో సీఎస్కే దూబేని కేవలం పవర్-హిట్టర్‌గా ఉపయోగించుకుంటోంది. అతనికి బౌలింగ్ చేసే అవకాశం రావట్లేదు. - భారత ఆల్‌రౌండర్లకు నష్టం
"ఎంటర్‌టైన్‌మెంట్‌పై దృష్టి పెట్టి, ఆటగాళ్ల అభివృద్ధిని మరచిపోకూడదు. ఏదేమైనా చివరికి క్రికెట్ ఆడేది 11 మంది ఆటగాళ్లు, 12 మంది కాదు. మీకు ఇలా చాలా ఉదాహరణలు చెప్పగలను. వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే బౌలింగ్ చేయడం లేదు. మాకు (భారత జట్టు) అది మంచిది కాదు" అని రోహిత్ పేర్కొన్నాడు.
కాగా, 2023 సీజన్‌లో 'ఇంపాక్ట్ ప్లేయర్' రూల్ ఇంట్రడ్యూస్ చేశారు. ఐపీఎల్ టీమ్‌లు వారి ఇన్నింగ్స్‌లలో ఒక ప్లేయర్‌ను బ్యాటర్ లేదా బౌలర్‌ని మరొకరితే రీప్లేస్ చేసుకోవచ్చు.
- సెంచరీ కొట్టినా గెలుపు కష్టమే
షోలో గిల్‌క్రిస్ట్ స్పందిస్తూ - "2023 సీజన్‌కు ముందు, మొదట బ్యాటింగ్ చేసిన జట్టులో ఎవరైనా సెంచరీ చేస్తే ఆ టీమ్ 75 శాతం మ్యాచ్‌లు గెలిచింది. కానీ ఇంపాక్ట్ సబ్ రూల్‌తో ఇప్పుడు ఆ పర్సంటేజీ 50 శాతానికి తగ్గింది" అని చెప్పాడు.
గిల్‌క్రిస్ట్ వ్యాఖ్యలకు రోహిత్ అంగీకరిస్తూ "2008 నుంచి 2023 వరకు కేవలం రెండు 250 ప్లస్ స్కోర్‌లు మాత్రమే ఉన్నాయి. ఈ సీజన్‌లో ఇప్పటికే నాలుగు 250 ప్లస్ స్కోర్లు నమోదయ్యాయి. ఇంపాక్ట్ సబ్ కారణంగా 7-8 బ్యాటర్లు ఉన్నట్లు లెక్క. అంటే నంబర్ 6, 7 పొజిషన్‌లో ఉన్న వాళ్లు కేవలం 7-8 బాల్స్ మాత్రమే ఆడగలరు." అని తెలిపాడు.
- ఎంఐ కెప్టెన్సీ గురించి ఏమన్నాడంటే!
రోహిత్ తన కెప్టెన్సీ కోల్పోవడంపై స్పందించాడు. ఇప్పుడు కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతున్నానని చెప్పాడు. ముంబయిలో ఆడిన చివరి నాలుగు గేమ్‌లకు ఇంట్లోనే ఉన్నానని, మ్యాచ్‌కు గంట ముందు చిన్న టీమ్ మీటింగ్ కోసం వెళ్లానని పేర్కొన్నాడు. కెప్టెన్‌గా లేకపోవడం కాస్త భిన్నంగా ఉందని, కానీ ఈ టైమ్‌ను ఎంజాయ్ చేస్తున్నానని హిట్‌మ్యాన్ తెలిపాడు.
'పాకిస్థాన్‌తో టెస్ట్ క్రికెట్‌కు రెడీ - వాళ్ల లైనప్ బాగుంటుంది' - India Vs Pakistan Test cricket
నాకు ఇప్పటికీ గుర్తుంది - బెస్ట్ ఐపీఎల్ థీమ్ సాంగ్ అదే : రోహిత్ - IPL 2024 Rohith Sharma