IPL 2024 Mumbai Indians : ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్ గొప్ప చరిత్రే ఉంది. ఇప్పటివరకూ ఐదు టైటిళ్లను అందుకుని అత్యధిక సార్లు ఛాంపియన్‌గా నిలిచింది. కానీ చివరగా 2020లో ట్రోఫీని దక్కించుకుంది. ఇక అప్పటి నుంచి లీగ్ దశలోనే వైదొలుగుతోంది. గత సీజన్ మాత్రం ప్లే ఆఫ్స్ చేరింది. అయితే ఈ సారి ఎలాగైనా టైటిల్‌ను దక్కించుకోవాలని కొత్త ఉత్సాహంతో బరిలోకి దిగనుంది. ఈ సారి కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా బాధ్యతలు స్వీకరించాడు. ఎక్కడైతే ఆల్‌రౌండర్‌గా ఎదిగాడో ఇప్పుడు అక్కడే నాయకుడిగా రాణించనున్నాడు.
బలాల విషయానికొస్తే బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. రోహిత్ శర్మ, సూర్యకుమార్, హైదరాబాదీ ప్లేయర్ తిలక్ వర్మ, ఇషాన్‌తో బ్యాటింగ్ ఆర్డర్ బలంగా కనిపిస్తోంది. వీళ్లతో పాటు హార్దిక్, బ్రేవిస్, టిమ్ డేవిడ్, మహమ్మద్ నబి కూడా ఉన్నారు. అత్యుత్తమ పేస్ దళం కూడా ఉంది. గాయంతో గత సీజన్ ఆడిని బుమ్రా తిరిగి జట్టులోకి వచ్చాడు. కొయెట్జీ, మదుశంక, నువాన్‌తో పాటు ఆకాశ్ మధ్వాల్, బెరెండార్ఫ్ ఉన్నారు. ఆల్రౌండర్లో హార్దిక్, నబి, నేహాల్, షెఫర్డ్ జట్టుకు లోటు లేదనే చెప్పాలి.
-
Har dhadkan, har dil ye bole 𝙈𝙪𝙢𝙗𝙖𝙞 𝙈𝙚𝙧𝙞 𝙅𝙖𝙖𝙣 🎶💙#OneFamily #MumbaiIndians #MumbaiMeriJaan pic.twitter.com/Z911mvKOI1
— Mumbai Indians (@mipaltan) March 18, 2024
బలహీనతల విషయానికొస్తే ఐపీఎల్‌లో కొంతకాలంగా రోహిత్ ఫామ్‌లో లేడు. 2019 నుంచి అతడి గణాంకాలను పరిశీలిస్తే 70 మ్యాచ్‌ల్లో 28.49 యావరేజ్‌తో 1718 రన్సే సాధించాడు. అయితే అప్పుడు కెప్టెన్సీ భారం ఉండేది. మరి ఈ సారి లేదు కాబట్టి బ్యాటర్‌గా ఎలా రాణిస్తాడో. రంజీల్లో ఆడకపోవడం వల్ల బీసీసీఐ వార్షిక కాంట్రాక్టు కోల్పోయిన ఇషాన్‌కు ఐపీఎల్ చాలా ముఖ్యం. అతడు ఎలా ఆడతాడో. స్పిన్ విభాగం బలంగా కనిపించట్లేదు. వెటరన్ స్పిన్నర్ పియూష్ చావ్లాపైనే ఆధారపడాలి. శ్రేయస్ గోపాల్, శామ్స్ ములాని, కుమార్ కార్తీకేయపై పూర్తిగా నమ్మకం పెట్టుకోలేం. టీ20 ప్రపంచకప్ దృష్ట్యా బుమ్రా, రోహిత్ అన్ని మ్యాచ్‌లు ఆడకపోవచ్చని అంటున్నారు. సూర్యకుమార్ గాయం వల్ల ఆరంభ మ్యాచ్‌కు అందుబాటులో ఉండడని తెలుస్తోంది. కొయెట్జీ, మదుశంక కూడా కొన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉండే ఛాన్స్ లేదు.
దేశీయ క్రికెటర్లు : రోహిత్ శర్మ, సూర్యకుమార్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, అర్జున్ తెందుల్కర్, విష్ణు వినోద్, నేహాల్ వధెరా, శామ్స్ ములాని, అన్షుల్, హార్దిక్ పాండ్య, శివాలిక్ శర్మ, నమన్ ధీర్, కుమార్ కార్తీకేయ, బుమ్రా, ఆకాశ్ మధ్వాల్, పియూష్ చావ్లా, శ్రేయస్ గోపాల్.
విదేశీయులు : టిమ్ డేవిడ్, డెవాల్డ్ బ్రేవిస్, రొమారియో షెఫర్డ్, మహమ్మద్ నబి, బెరెండార్ఫ్, గెరాల్డ్ కొయెట్జీ, నువాన్ తుషార, మదుశంక.
ముంబయి జట్టుకు ఆ స్టార్ క్రికెటర్ దూరం - పేస్ దళానికి తీరనిలోటు!
'రోహిత్ నాకు అండగా ఉంటాడు'- హిట్‌మ్యాన్ రిలేషన్‌పై హార్దిక్ కామెంట్స్