ETV Bharat / sports

నాకు ఇప్పటికీ గుర్తుంది - బెస్ట్ ఐపీఎల్ థీమ్ సాంగ్ అదే : రోహిత్ - IPL 2024 Rohith Sharma

IPL 2024 Rohith Sharma : ఐపీఎల్​లో తనకు బాగా నచ్చిన బెస్ట్ థీమ్ సాంగ్​ గురించి చెప్పాడు రోహిత్ శర్మ. పూర్తి వివరాలు స్టోరీలో.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 18, 2024, 3:13 PM IST

Updated : Apr 18, 2024, 3:19 PM IST

IPL 2024 Rohith Sharma : ముంబయి ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి తన ఐపీఎల్ మాజీ టీమ్​ డెక్కన్ ఛార్జర్స్‌పై ప్రేమను చాటుకున్నాడు. ఐపీఎల్‌లో తాను ఇప్పటివరకు విన్న థీమ్ సాంగ్‌లలో డెక్కన్ ఛార్జర్స్‌దే బెస్ట్ థీమ్ సాంగ్​ అని తెలిపాడు. క్లబ్ ప్రైరీ ఫైర్ పోడ్‌కాస్ట్‌లో ఈ విషయాన్ని తెలిపాడు.

ఈ పోడ్‌కాస్ట్‌లో రోహిత్​ శర్మతో పాటు మాజీ క్రికెటర్లు ఆడమ్ గిల్‌క్రిస్ట్‌, మైఖేల్ వాన్​ సహా మరికొంతమంది పాల్గొన్నారు. దీనిని క్లబ్​ ప్రైరీ ఫైర్​ అనే యూట్యూబ్ ఛానెల్ హోస్ట్ చేసింది. వీడియో ఇంటర్వ్యూలో భాగంగా డెక్కన్ ఛార్జర్స్‌ థీమ్ సాంగ్‌ను ఆడమ్ గిల్‌క్రిస్ట్‌ ప్లే చేశాడు. దీనిని హిట్ మ్యాన్ బాగా ఎంజాయ్ చేశాడు.

ఈ క్రమంలోనే హిట్ మ్యాన్ మాట్లాడుతూ - "అప్పటి ఐపీఎల్​ థీమ్​ సాంగ్స్ చాలా బాగుండేవి. ప్రస్తుతం అలాంటి సాంగ్​ రాలేదు. నాకు తెలిసి డెక్కన్ ఛార్జర్స్‌ థీమ్​కు మరే ఇతర ఐపీఎల్ థీమ్​ సాంగ్ సాటి రాదు. ఇదే బెస్ట్. ఈ సాంగ్​ నాకు ఇప్పటికీ గుర్తుంది. అని తన అభిప్రాయాన్ని" తెలిపాడు. కాగా, ఐపీఎల్ ప్రారంభంలో డెక్కన్ ఛార్జర్స్ తరఫున గిల్‌క్రిస్ట్‌, రోహిత్ ఆడిన సంగతి తెలిసిందే.

2009లో డెక్కన్ ఛార్జర్స్ టీమ్​ ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. అప్పుడా జట్టుకు ఆడమ్ గిల్‌క్రిస్ట్‌ సారథ్యం వహించాడు. రోహిత్ శర్మ వైస్ కెప్టెన్​గా వ్యవహరించాడు. 2008లో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన ఆ జట్టు తర్వాతి సీజన్​లోనే ట్రోఫీని అందుకోవడంతో క్రికెట్ ప్రియులంతా షాక్ అయ్యారు. అప్పుడు ఆ టీమ్​లో గిల్‌క్రిస్ట్, రోహిత్​తో పాటు ప్రజ్ఞాన్ ఓజా, ఆండ్రూ సైమండ్స్, ఆర్పీ సింగ్ వంటి దిగ్గజాలు ఉన్నారు. అయితే ఆ తర్వాత ఐపీఎల్ నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా 2012లో డెక్కన్​ ఛార్జర్స్ ఫ్రాంఛైజీని ఐపీఎల్‌ నిర్మాహకులు రద్దు చేశారు. అనంతరం ఈ హైదరాబాద్‌ జట్టు హక్కులను సన్‌ టీవీ నెట్‌వర్క్‌ దక్కించుకున్న సంగతి తెలిసిందే. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌గా పేరు మార్చి 2013లో లీగ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.

'మెక్​కల్లమ్' విధ్వంసానికి 16ఏళ్లు- IPL ప్రారంభమైంది ఈరోజే​ - IPL First Match

ధావన్ జెర్సీలో మార్పు- ఇకపై కొడుకు పేరుతోనే బరిలోకి? - IPL 2024

Last Updated : Apr 18, 2024, 3:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.