ETV Bharat / sports

లాస్ట్ సీజన్​ మిస్​- నయా జోష్​తో రీ ఎంట్రీ- 2024లో కమ్​బ్యాక్​ పక్కా! - missed last season players

IPL 2024 Re Entry Players: 2024 ఐపీఎల్ మరో వారంలో ప్రారంభం కానుంది. ఆయా జట్ల ప్లేయర్లంతా ఇప్పటికే ప్రాక్టీస్ మొదలుపెట్టేశారు. అయితే గత ఐపీఎల్​ సీజన్​లో ఆడకుండా ఈసారి బరిలోకి దిగనున్న స్టార్ ప్లేయర్లెవరో చూద్దాం.

IPL 2024 Re Entry Players:
IPL 2024 Re Entry Players:
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 16, 2024, 5:00 PM IST

IPL 2024 Re Entry Players: మోస్ట్‌ సక్సెస్‌ఫుల్‌ స్పోర్ట్స్ లీగ్‌ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్(IPL)కి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఈ టోర్నీ కోసం క్రికెట్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఐపీఎల్ వేలం నుంచి ఫైనల్‌ వరకు అన్ని అప్‌డేట్స్‌ ఫాలో అవుతుంటారు. అయితే ఐపీఎల్ 2024కి మరో వారం మాత్రమే ఉంది. టోర్నమెంట్ మార్చి 22న చెన్నైలో ప్రారంభమవుతుంది. మొదటి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్‌ కింగ్స్‌- రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తలపడనున్నాయి.

ప్రతి ఐపీఎల్‌ సీజన్‌ కొత్త రికార్డులను క్రియేట్‌ చేస్తుంది. ఈ సీజన్‌ వేలం నుంచే రికార్డులు బద్దలయ్యాయి. ఆస్ట్రేలియా ప్లేయర్లు స్టార్క్‌(కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ రూ.24.75 కోట్లు), కమిన్స్‌(సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ రూ.20.50 కోట్లు) అత్యధిక ధరకు అమ్ముడుపోయారు. అలానే గత సీజన్‌ మిస్‌ అయిన దాదాపు అరడజనుకు పైగా ప్లేయర్‌లు ఈ ఐపీఎల్‌ ఆడనుండటంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. లాస్ట్‌ సీజన్‌ ఆడకుండా, ఐపీఎల్‌ 2024లో అడుగుపెడుతున్న స్టార్‌ ప్లేయర్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

  • జస్ప్రీత్ బుమ్రా: ముంబయి ఇండియన్స్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వెన్ను గాయం కారణంగా ఐపీఎల్‌ 2023కి దూరమయ్యాడు. ఇక గతేడాది గాయం నుంచి కోలుకొని జూలైలో ఐర్లాండ్ పర్యటనతో ఇంటర్నేషనల్ క్రికెట్​లో రీ ఎంట్రీ ఇచ్చాడు. కాగా, బుమ్రా రీ ఎంట్రీలో సూపర్​ ఫామ్‌లో అదరగొడుతున్నాడు. బుమ్రా గతంలో ముంబయి ఇండియన్స్‌ ఐదు సార్లు కప్పు గెలవడంలో ఎంత కీలకంగా వ్యవహరించాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఈ స్టార్‌ బౌలర్‌ రాకతో ముంబయి మళ్లీ కప్పు గెలుస్తుందని ధీమాగా ఉన్నారు.
  • మిచెల్ స్టార్క్: ఈ ఐపీఎల్‌కి మళ్లీ తిరిగొస్తున్న మరో స్టార్‌ ప్లేయర్‌ ఆస్ట్రేలియా బౌలర్‌ మిచెల్ స్టార్క్. ఈ లెఫ్టార్మ్ స్పీడ్‌స్టర్ 2014, 2015 సీజన్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తరఫున ఆడాడు. అప్పటి నుంచి విశ్రాంతి, పనిభారం, గాయాల కారణంగా ఐపీఎల్‌కి దూరమయ్యాడు. ఈ సీజన్‌ ముందు జరిగిన వేలంలో స్టార్క్‌ను కేకేఆర్‌ అత్యధికంగా రూ.24.75 కోట్లకు కొనుగోలు చేసింది. అత్యధిక ధరకు అమ్మడైన స్టార్క్‌ బౌలింగ్‌ కోసం కేకేఆర్​ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
  • రిషబ్‌ పంత్: 2022 డిసెంబరులో జరిగిన కార్‌ యాక్సిడెంట్‌లో గాయపడిన పంత్‌ ఎప్పుడెప్పుడు మైదానంలో దిగుతాడా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. దాదాపు 14నెలలుగా క్రికెట్‌కు దూరమైన పంత్‌, 2024 ఐపీఎల్ ఆడేందుకు ఫిట్‌గా ఉన్నాడని కొన్ని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అటు కీపింగ్‌, ఇటు బ్యాటింగ్‌లో అదరగొట్టే పంత్‌, ఈ ఐపీఎల్‌లో దిల్లీ క్యాపిటల్స్‌ తరఫున బరిలోకి దిగడం ఖాయం అని తెలుస్తోంది.
  • జానీ బెయిర్‌స్టో: విధ్వంసక బ్యాటర్​లలో ఒకడిగా గుర్తింపు పొందిన ఇంగ్లాండ్ ప్లేయర్ బెయిర్‌ స్టో గాయం కారణంగా గత ఐపీఎల్‌ ఆడలేదు. ఈ సీజన్‌కి తిరిగి పంజాబ్ కింగ్స్ జట్టుతో చేరనున్నాడు. ఈ హిట్టింగ్‌ మాస్టర్‌పై పంజాబ్‌ కింగ్స్‌ భారీ అంచనాలు పెట్టుకుంది.
  • శ్రేయస్ అయ్యర్: టీమ్ఇండియా స్టార్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ వెన్ను గాయం కారణంగా IPL 2023కి దూరమయ్యాడు. గతేడాది సర్జరీ నుంచి కోలుకున్న తర్వాత 2023 వన్డే వరల్డ్​​కప్‌కు సెలక్ట్‌ అయ్యాడు. పాత ఫామ్​ను అందుకున్న అయ్యర్ మెగాటోర్నీలో అదరగొట్టాడు. ఇక ఈ ఐపీఎల్‌ సీజన్‌లో అయ్యర్‌ కేకేఆర్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అయ్యర్‌ వరల్డ్‌ కప్‌ ఫామ్‌ని కొనసాగించి కేకేఆర్​కు భారీ విజయాలు అందించాలని అభిమానులు ఆశిస్తున్నారు.
  • ప్యాట్‌ కమిన్స్: ఆస్ట్రేలియా బౌలర్ ప్యాట్‌ కమిన్స్ 2024 ఐపీఎల్‌లో వేలంలో అత్యధిక ధర పలికిన రెండో ఆటగాడు. కమిన్స్‌ని సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ రూ.20.5 కోట్లకు కొనుగోలు చేసింది. ఇప్పటికే ఎస్‌ఆర్‌హెచ్‌ మార్‌క్రమ్‌ స్థానంలో కమిన్స్‌ని కెప్టెన్‌గా ప్రకటించింది. కమిన్స్ కేకేఆర్‌ తరఫున ఆడుతున్నప్పుడు పని భారం కారణంగా గత ఐపీఎల్ ఆడలేదు.

2024 IPL- టోర్నీకి ముందే గాయాల బెడద- దూరం కానున్నప్లేయర్లు వీళ్లే

IPL బౌలర్ల జోరు- అత్యధిక డాట్​బాల్స్​ లిస్ట్​లో 'భువీ'నే టాప్​- ఇంకా ఎవరంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.