SRH vs RR IPL 2024: 2024 ఐపీఎల్లో క్వాలిఫయర్- 2కు రంగం సిద్ధమైంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ ప్రతిష్ఠాత్మక పోరులో రాజస్థాన్ రాయల్స్‌ను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్‌కు చెన్నై చిదంబరం స్టేడియం వేదిక కానుంది. ఈ మ్యాచ్‌లో నెగ్గి ఫైనల్‌కు దూసుకెళ్లాలని ఇరుజట్లు భావిస్తున్నాయి. మరి ఇరుజట్లు బలాబలాలు, ముఖాముఖి పోరు ఎలా ఉందంటే?
సన్‌రైజర్స్: ఓటమితో సీజన్ ఆరంభంచినా తర్వాత అద్భుతంగా పుంజుకొని వరుస విజయాలతో సన్‌రైజర్స్ అదరగొట్టింది. ఎన్నడూ లేనంతగా బ్యాటింగ్‌లో విరుచుకుపడి పలు రికార్డులు తమ పేరిట లిఖించుకుంది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ మెరుపు ఆరంభాలకు తోడు హెన్రిచ్ క్లాసెన్, నితీశ్ రెడ్డి, మర్క్రమ్, అబ్దుల్ సమద్, షహబాజ్ అహ్మద్‌తో డీప్ బ్యాటింగ్ సన్‌రైజర్స్ సొంతం.
ఇక భువనేశ్వర్ కుమార్, నటరాజన్, ప్యాట్ కమిన్స్‌తో పేస్ బలంగా కనిపిస్తోంది. కానీ, చెన్నై పిచ్ పూర్తిగా స్పిన్‌కు అనుకూలంగా ఉండనుంది. అయితే చెప్పుకోదగ్గ స్పిన్నర్ జట్టులో లేకపోవడం కాస్త కలవరపెడుతోంది. దీంతో నేటి మ్యాచ్‌లో వాషింగ్టన్ సుందర్/ మయంక్ మార్కండేకు ఛాన్స్ వస్తుందేమో చూడాలి. ఏది ఏమైనా సన్‌రైజర్స్ బ్యాటింగ్‌లోనే భారీ స్కోర్ నమోదు చేయాల్సి ఉంటుంది. మరోసారి బ్యాటింగ్ ఆర్డర్ రాణిస్తే అది పెద్ద కష్టమేమీ కాదు.
రాజస్థాన్: ఈ సీజన్ ప్రారంభంలో రాజస్థాన్ వరుస విజయాలతో దూసుకుపోయింది. ఫస్ట్ హాఫ్‌లో పాయింట్ల పట్టకలో ఆగ్ర స్థానంలో కొనసాగింది కూడా. అయితే అనూహ్యంగా సెకండ్ హాఫ్‌లో రాజస్థాన్ కాస్త తడబడింది. ఎలిమినేటర్ మినహా రాజస్థాన్ ఆడిన గత 6మ్యాచ్‌ల్లో ఒక్కసారి నెగ్గలేదు. అందులో ఐదింట్లో ఓడగా ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. అయితే రీసెంట్గా ఆర్సీబీతో ఎలిమినేటర్‌లో మళ్లీ కమ్‌బ్యాక్ ఇచ్చింది. తిరిగి ఫామ్‌లోకి వచ్చి సత్తా చాటింది.
ఓపెనర్ యశస్వీ జైస్వాల్, కెప్టెన్ సంజూ శాంసన్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, రోవ్‌మన్ పావెల్, హెట్మయర్తో బ్యాటింగ్ బలంగా ఉంది. ఇటు బోల్ట్, అశ్విన్, చాహల్, సందీప్ శర్మ, ఆవేశ్ ఖాన్‌తో బౌలింగ్‌లోనూ రాజస్థాన్ పటిష్ఠంగానే కనిపిస్తోంది. పైగా చెన్నై పిచ్ స్పిన్నర్లకు అనుకూలించడం వల్ల రాజస్థాన్‌కు కలిసొస్తుంది. అశ్విన్, చాహల్ రూపంలో వీరికి నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు. పైగా గత మ్యాచ్ విజయం ఇచ్చిన జోష్‌లో క్వాలిఫయర్లోనూ రాణించి ఫైనల్‌కు దూసుకెళ్లాలని రాజస్థాన్ తహతహలాడుతోంది.
SRH vs RR Head to Head: ఇరు జట్లు సమవుజ్జీలని గత రికార్డులు చూస్తే తెలుస్తోంది. ఈ జట్లు ఇప్పటివరకు 19 సార్లు తలపడగా సన్‌రైజర్స్ 10, రాజస్థాన్ 9 మ్యాచ్‌ల్లో నెగ్గాయి. ఈ సీజన్‌లో తలపడ్డ ఒక్క మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఒక్క పరుగు తేడాతో రాజస్థాన్‌పై గెలిచింది. దీంతో శుక్రవారం జరగనున్న మ్యాచ్‌లో ఇరుజట్ల మధ్య గట్టిపోటీ ఉండడం ఖాయమనే అనిపిస్తోంది.
-
Chennai Calling ✈️
— IndianPremierLeague (@IPL) May 22, 2024
Congratulations to 𝗥𝗮𝗷𝗮𝘀𝘁𝗵𝗮𝗻 𝗥𝗼𝘆𝗮𝗹𝘀 🥳🩷
They are set to face Sunrisers Hyderabad in an electrifying #Qualifier2 🤜🤛
Scorecard ▶️ https://t.co/b5YGTn7pOL #TATAIPL | #RRvRCB | #Eliminator | #TheFinalCall | @rajasthanroyals pic.twitter.com/V8dLUL0hSS
ఆర్సీబీ ఖేల్ ఖతం- ఎలిమినేటర్‌లో రాజస్థాన్ గ్రాండ్ విక్టరీ - IPL 2024
5ఏళ్ల తర్వాత సన్‌రైజర్స్ అలా- అంతా కమిన్స్ వల్లే! - IPL 2024