IPL 2024 Punjab Kings VS SRH Nitish kumar reddy : ఐపీఎల్-2024లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్, ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి అదరగొట్టేశాడు. తన బ్యాట్‌తో మైదానంలో విధ్వంసం సృష్టించాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజులోకి ఎంట్రీ ఇచ్చిన అతడు తన మైండ్ బ్లాక్ పెర్ఫార్మెన్స్తో దడ పుట్టించాడు. క్రికెట్ ప్రియులందరినీ ఆకట్టుకున్నాడు. మొదట ఆచితూచి చాలా జాగ్రత్తగా ఆడిన నితీశ్ కుమార్ మిడిల్ ఓవర్లలో ఆకాశమే హద్దుగా చెలరేగి ప్రదర్శన చేశాడు.
ఓ వైపు వికెట్లు పడుతున్నా తన ధనాధన్ ఇన్నింగ్స్‌తో ప్రత్యర్ధి బౌలర్లను బెంబేలెత్తించాడు. తన బ్యాటింగ్‌తో చుక్కలు చూపించాడు. ముఖ్యంగా 15 ఓవర్‌లో అయితే పంజాబ్ స్పిన్నర్ హర్‌ప్రీత్ బ్రార్‌ను ఊచకోత కోశాడనే చెప్పాలి. ఆ ఓవర్‌లో ఏకంగా రెండు సిక్స్‌లు, రెండు ఫోర్లతో ఏకంగా 22 పరుగులు వచ్చాయి.
మొత్తంగా ఈ మ్యాచ్‌లో 37 బంతులు ఎదుర్కొన్న ఈ ఆంధ్ర బ్యాటర్ 4 ఫోర్లు, 5 సిక్స్‌ల సాయంతో 64 పరుగులు ఖాతాలో వేశాడు. దీంతో అతడి ఆడిన సూపర్ ఇన్నింగ్స్‌కు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. క్రికెట్ ప్రియులు, నెటిజన్లు అతడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. శెభాష్ నితీశ్ కుమార్, తెలుగోడి సత్తా చూపించావు అంటూ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యం కూడా అతడిపై ప్రశంసల వర్షం కురిపిస్తోంది. కాగా, నితీశ్ కుమార్ ధనాధన్ బ్యాటింగ్‌తో ఎస్‌ఆర్‌హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు స్కోరు చేసింది.
ఆ తర్వాత ఛేదనకు దిగిన పంజాబ్‌లో శసాంక్ సింగ్(46) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సామ్ కరన్(29), సికందర్ రాజా(28), కెప్టెన్ శిఖర్ ధావన్(14), జితేశ్ శర్మ(19) పరుగులు చేశారు. భువనేశ్వర్ కుమార్ 2, ప్యాట్ కమిన్స్, నటరాజన్, నితీశ్ రెడ్డి, జయదేవ్ ఉనద్కత్ తలో వికెట్ తీశారు. ఫైనల్‌గా ఉత్కంఠగా సాగిన పోరులో 2 పరుగులు తేడాతో హైదరాబాద్ గెలిచింది.
-
NKR supremacy 🥵🙌#PlayWithFire #PBKSvSRH pic.twitter.com/kvBjHXGe3L
— SunRisers Hyderabad (@SunRisers) April 9, 2024
తెలుగు కుర్రాడి విధ్వంసం - ఉత్కంఠ పోరులో పంజాబ్‌పై హైదరాబాద్ విజయం - IPL 2024 Punjab Kings VS SRH