ETV Bharat / sports

ఐపీఎల్‌లో నయా స్టార్ - బ్యాటర్లకు చుక్కలు చూపించిన ఎవరీ మయాంక్ యాదవ్? - Who is Mayank Yadav - WHO IS MAYANK YADAV

IPL 2024 Punjab Kings VS LSG : తాజాగా పంజాబ్​ కింగ్స్​తో జరిగిన మ్యాచ్​లో ఫాస్టెస్ట్ డెలివరీ సంధించి అదరగొట్టాడు లఖ్​నవూ యంగ్ పేసర్ మయాంక్ యాదవ్‌. దీంతో అతడి గురించి ఆరా తీస్తున్నారు. అతడి గురించి స్టోరీలోకి వెళ్లి తెలుసుకుందాం.

ఐపీఎల్‌లో నయా  స్టార్ - బ్యాటర్లకు చుక్కలు చూపించిన ఎవరీ మాయంక్ యాదవ్?

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 31, 2024, 8:18 AM IST

Updated : Mar 31, 2024, 8:29 AM IST

IPL 2024 Punjab Kings VS LSG : లఖ్​నవూ సూపర్‌ జెయింట్స్‌ యంగ్ పేసర్‌ మయాంక్‌ యాదవ్‌ తన ఐపీఎల్‌ అరంగేట్రంలోనే అదరగొట్టాడు. ఐపీఎల్‌-2024 సీజన్​లో భాగంగా పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌తో ఎంట్రీ ఇచ్చిన అతడు తన పేస్‌ బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లను బంబేలెత్తించాడు. 150 కి.మీ పైగా వేగంతో బంతులు సంధించి పంజాబ్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు.

అతడు వేగవంతమైన బంతిని సంధించి ఇప్పటివరకు ఐపీఎల్‌-2024లోనే ఫాసెస్ట్ డెలివరీ వేసిన బౌలర్‌గా రికార్డుకెక్కాడు. 12వ ఓవర్ తొలి బంతికి 155.8 కి.మీ. వేగంతో బంతిని విసిరాడు. కీల‌క‌మైన‌ జానీ బెయిర్‌స్టోను ఔట్ చేసి ఐపీఎల్​లో త‌న తొలి వికెట్​ను తీశాడు. అలాగే, పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్‌ను కూడా ఇబ్బంది పెట్టాడు. ప్రభ్‌ సిమ్రాన్ సింగ్ వికెట్ కూడా దక్కించుకున్నాడు. జితేష్ శర్మను కూడా పెవిలియ‌న్​కు పంపి లఖ్​నవూ వైపునకు మ్యాచ్​ను మలుపు తిప్పాడు. మొత్తంగా తన 4 ఓవ‌ర్ల కోటాలో బౌలింగ్ వేసి 27 పరుగులు ఇచ్చి కీల‌క‌మైన 3 వికెట్లు దక్కించుకున్నాడు. అంతకుముందు ఈ ఫాసెస్ట్​ డెలివరీ రికార్డు రాజస్థాన్ పేసర్ నండ్రీ బర్గర్‌(153 కి.మీ వేగం) పేరిట ఉండేది.

అసలు ఎవ‌రీ మయాంక్ యాద‌వ్‌? ఇతడి వయసు 21 ఏళ్లు. దిల్లీలో జూన్ 17, 2002న జన్మించాడు. దేశీవాళీ క్రికెట్‌లో దిల్లీ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఆ జట్టు తరపున మూడు ఫార్మాట్లలోనూ అతడు అరంగేట్రం చేశాడు. మొదట రంజీ ట్రోఫీ 2022 సీజన్‌లో ఆడాడు. మహారాష్ట్రతో జరిగిన మ్యాచ్‌తో ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. అనంతరం లిస్ట్‌-ఏ, టీ20 క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. మంచి పేసర్‌గా గుర్తింపు సాధించాడు.

గతేడాది జరిగిన దేవధర్ ట్రోఫీలోనూ నార్త్‌జోన్‌కు ప్రాతినిథ్యం వహించి అద్భుత‌మైన బౌలింగ్‌ ప్రదర్శన చేశాడు. కేవలం 5 మ్యాచ్‌ల్లోనే 12 వికెట్లు తీసి జాయింట్‌ వికెట్‌ టేకర్‌గా నిలిచాడు. ఇప్పటివరకు మూడు ఫార్మాట్లలో కలిసి 27 మ్యాచుల్లో 46 వికెట్లు తీశాడు. ఈ క్రమంలోనే 2022లో జరిగిన ఐపీఎల్‌ మెగా వేలంలో రూ. 20 లక్షల కనీస ధరకు లఖ్​నవూ జట్టు కొనుగోలు చేసింది. కానీ అతడు గాయం కారణంగా ఐపీఎల్‌-2023 సీజన్‌కు అందుబాటులో లేకుండా పోయాడు. అతడి స్థానంలో అర్పిత్ గులేరియాను తీసుకున్నారు. ఇక ఐపీఎల్‌-2024 మినీ వేలంలోనూ అతడిని లఖ్​నవూ సొంతం చేసుకుంది.

లఖ్​నవూతో మ్యాచ్​ - అతడే మా కొంపముంచాడు : ధావన్ - IPL 2024 LSG VS Punjab Kings

మయాంక్ మెరుపు వేగంతో లఖ్​నవూ బోణీ - పంజాబ్ ఓటమి - LSG VS PBKS IPL 2024

Last Updated : Mar 31, 2024, 8:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.