ETV Bharat / sports

మూడు ప్లేసుల కోసం ఐదు జట్ల పోటీ - ఛాన్సెస్​ ఎలా ఉన్నాయంటే? - IPL 2024 - IPL 2024

IPL 2024 Playoffs : ఐపీఎల్ 2024 సీజన్‌ చివరి దశకు చేరుకుంది. దీంతో ఆయా జట్లు ప్లేఆఫ్స్‌లో తమ స్థానం కోసం పోటీపడుతున్నారు. ఇప్పటికే ఓ జట్టు ఆ ఛాన్స్ అందుకోగా, మిగతా ఏడు జట్లు మిగిలిన మూడు స్థానాలను కైవసం చేసుకునేందుకు బరిలోకి దిగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ప్లే ఆఫ్​ అవకాశాలు ఎలా ఉన్నాయంటే ?

IPL 2024 Playoffs
IPL 2024 Playoffs (Source : Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : May 13, 2024, 8:19 PM IST

IPL 2024 Playoffs : ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ గ్రూప్‌ దశలో ఇంకా ఎనిమిది మ్యాచ్‌లే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయా జట్లు తమ ప్లేఆఫ్స్ అవకాశాలను చేజిక్కించుకునేందుకు సిద్ధంగా ఉంది. అయితే ఇప్పటికి కోల్‌కతా జట్టు ఒక్కటే అధికారికంగా ఆ జాబితాలోకి చేరుకుంది. దీంతో మిగిలిన మూడు స్థానాల కోసం ఏడు జట్లు తలపడుతున్నాయి. ముంబయి, పంజాబ్‌ తప్ప మిగతా అన్ని జట్లు నాకౌట్‌ రేసులో ఉన్నాయి.

ఇదిలా ఉండగా, ఆదివారం రాజస్థాన్‌ను చెన్నై, దిల్లీని బెంగళూరు ఓడించడం వల్ల ఈ ప్లేఆఫ్స్‌ రేసు మరింత ఇంట్రెస్టింగ్ సాగనుంది. ఇప్పటికే 13 మ్యాచ్‌లు ఆడి 12 పాయింట్లతో ఉన్న దిల్లీ, 12 మ్యాచ్‌లు ఆడి 10 పాయింట్లతో ఉన్న గుజరాత్ మాత్రమే రేసులో ఉన్నాయి. ఆ జట్లు ప్లేఆఫ్స్‌ చేరడం దాదాపు అసాధ్యమే.

ఆ రెండింటికీ ఖాయం
ప్రస్తుతం 16 పాయింట్లతో ఉన్న రాజస్థాన్‌ జట్టు దాదాపు ప్లేఆఫ్స్‌ చేరినట్టే. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో (పంజాబ్‌, కోల్‌కతాతో) ఒక్క మ్యాచ్‌లో నెగ్గినప్పటికీ రాజస్థాన్‌ ప్లేఆఫ్స్‌కు చేరుతుంది. ఒకవేళ ఈ రెండింటిలో ఏది ఓడినా అవకాశం ఉంటుంది. కానీ ఈ రెండు మ్యాచ్‌ల్లో భారీ తేడాతో కాకుండా తక్కువ తేడాతో ఓడాల్సి ఉంటుంది.

మరోవైపు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడి 14 పాయింట్లతో మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో (గుజరాత్, పంజాబ్‌తో) విజయం సాధిస్తే ఈ జట్టుకు ప్లేఆఫ్స్​లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. మెరుగైన నెట్ రన్‌రేట్ ఉండటం వల్ల ఒక్క మ్యాచ్‌లో విజయం సాధించినా కూడా హైదరాబాద్‌ నాకౌట్​కు చేరే అవకాశముంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూస్తుంటే రాజస్థాన్‌, హైదరాబాద్‌ కచ్చితంగా ప్లేఆఫ్స్‌ చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

లఖ్‌నవూ డౌటే!
పైన పేర్కొన్న విధంగా జరిగితే ఆఖరి బెర్తు కోసం చెన్నై, బెంగళూరు, లఖ్‌నవూ మధ్య గట్టి పోటీ నెలకొంటుంది. ప్రస్తుతం 12 పాయింట్లతో ఉన్న లఖ్‌నవూ, మిగిలిన రెండు మ్యాచ్‌లకు గానూ దిల్లీ, ముంబయి జట్లతో తలపడనుంది. ఈ జట్టుకు ప్లేఆఫ్స్‌ చేరడానికి ఇది ఓ మంచి అవకాశం. కానీ, ఈ జట్టుకు నెట్‌ రన్‌రేట్ ప్రతికూల అంశంగా మారింది. -0.769 నెట్‌ రన్‌రేట్‌ ఉన్న లఖ్‌నవూ జట్టు మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో భారీ తేడాతో గెలిస్తే తప్ప నాకౌట్​కు చేరుకునే ఛాన్స్ ఉంటుంది.

బెంగళూరు ఇలా చేస్తేనే
ఇదిలా ఉండగా, ఆర్సీబీ ప్లేఆఫ్స్‌కు చేరాలంటే హైదరాబాద్‌ ఒకటి లేదా రెండు మ్యాచ్‌ల్లో ఓడాల్సి ఉంటుంది. దాంతోపాటు లఖ్‌నవూ మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో ఒక దాంట్లోనే గెలవాలి. వీటితోపాటు మే 18న చెన్నైతో జరిగే మ్యాచ్‌లో తప్పక విజయం సాధించాల్సి ఉంటుంది. సీఎస్కేపై 18 పరుగులు లేకుంటే అంతకంటే ఎక్కువ రన్స్‌ తేడాతో గెలవాల్సి ఉంటుంది. లేదంటే చెన్నై ఇచ్చిన టార్గెట్​ను 18.1 ఓవర్లలో ఛేదించాల్సిందే. అప్పుడే సీఎస్కే నెట్‌ రన్‌రేట్‌ను ఆర్సీబీ అధిగమించినట్లు అవుతుంది.

చెన్నైకి మరో ఛాన్స్‌
ఒకవేళ ఆర్సీబీ చేతిలో చెన్నై ఓడిన కూడా ఆ జట్టుకు మరో ఛాన్స్ ఉంటుంది. బెంగళూరుపై భారీ తేడాతో కాకుండా స్వల్ప తేడాతో ఓడటమే కాకుండా వాళ్ల నెట్‌ రన్‌రేట్ పడిపోకుండా చూసుకోవాలి. దీంతోపాటు సన్‌రైజర్స్‌ మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో భారీ తేడాతో ఓడిపోయి వాళ్ల దగ్గర 14 పాయింట్లు ఉండాలి. వీటితో పాటు మే 14న లఖ్‌నవూ మ్యాచ్​లో దిల్లీ ఆ జట్టును ఓడించాలి. శుక్రవారం ముంబయి చేతిలో లఖ్‌నవూ ఓడాలి లేదా స్వల్ప తేడాతో నెగ్గాలి. అప్పుడే నాలుగైదు జట్లు 14 పాయింట్లతో ఉంటాయి. నెట్‌ రన్‌రేట్‌ మెరుగ్గా ఉన్న జట్టు ప్లేఆఫ్స్​కు చేరుకుంటుంది.

వరుస విజయాలతో ఆర్సీబీలో జోష్​ - ఇక ఆ సెంటిమెంట్ వర్కౌటైతే ఫైనల్​కే! - IPL 2024

అభిమానులెవరూ ఊహించనిది - ప్లే ఆఫ్స్ ఆశల పల్లకిలో ఆర్సీబీ - IPL 2024

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.