IPL 2024 Playoffs: 2024 ఐపీఎల్ కీలక దశకు చేరుకుంది. ఈ సీజన్లో ప్లేఆఫ్స్‌కు చేరిన టాప్- 4 జట్లేవో తెలిసిపోయింది. కానీ, కోల్‌కతా నైట్‌రైడర్స్, ఆర్సీబీ మినహా, మిగతా రెండు జట్ల స్థానాలు తేలాల్సి ఉంది. ప్రస్తుతానికి 19 పాయింట్లతో కేకేఆర్ టాప్‌లో ఉండగా, ఆర్సీబీ (14 పాయింట్లు) నాలుగో స్థానంలో ఉంది. ఇక రాజస్థాన్ రాయల్స్ (16 పాయింట్లు), సన్‌రైజర్స్ (15 పాయింట్లు) వరుసగా 2,3 ప్లేస్‌లో కొనసాగుతున్నాయి. ఇందులో ఆర్సీబీ మినహా మిగతా మూడు జట్లు ఒక్కో మ్యాచ్ ఆడాల్సి ఉంది. అయితే లీగ్ మ్యాచ్‌లు ముగిసిన తర్వాత కూడా టాప్‌లో ఉన్న కేకేఆర్, నాలుగో పొజిషన్లో ఉన్న ఆర్సీబీ స్థానాల్లో ఎలాంటి మార్పు వచ్చే అవకాశం లేదు. ఇక రెండో స్థానంపై మాత్రం రాజస్థాన్, సన్‌రైజర్స్ కన్నేశాయి.
సన్‌రైజర్స్- పంజాబ్ కింగ్స్: సన్‌రైజర్స్ జట్టు ఉప్పల్ వేదికగా పంజాబ్‌ను ఢీ కొట్టనుంది. ఈ మ్యాచ్‌లో నెగ్గి రెండో స్థానం బెర్త్ ఖరారు చేసుకోవాలని సన్‌రైజర్స్ భావిస్తోంది. ఇందులో గెలిస్తే సన్‌రైజర్స్ ఖాతాలో 17 పాయింట్లు చేరతాయి. ఇక సాయంత్రం కేకేఆర్‌తో జరిగే మ్యాచ్‌లో రాజస్థాన్ ఓడినా లేదా వర్షం కారణంగా మ్యాచ్ రద్దైనా సన్‌రైజర్స్ రెండో స్థానంలోకి ఎగబాకుతుంది. అటు పంజాబ్‌కు ఇది నామమాత్రపు మ్యాచ్.
కోల్‌కతా- రాజస్థాన్: ఐపీఎల్ సీజన్ 17లో కోల్‌కతా- రాజస్థాన్ మధ్య లీగ్‌లో ఆఖరి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు గువాహతి వేదిక కానుంది. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ ఓడినా అగ్రస్థానంలోనే ఉంటుంది. కానీ, రాజస్థాన్ నెగ్గితే 18 పాయింట్లతో టాప్- 2లోకి వస్తుంది. ఒకవేళ ఓడినా లేదా వర్షం కారణంగా మ్యాచ్ రద్దైనా ఆ ప్లేస్ సన్‌రైజర్స్‌కు దక్కుతుంది.
రెండింటికీ ముప్పే: కాగా, ఆదివారం ముగిసే లీగ్ మ్యాచ్‌ల ఫలితాలతో ఆయా జట్ల ప్లేస్‌లు ఖరారవుతాయి. అయితే ఈ రెండు మ్యాచ్‌లకు వర్షం ముప్పు ఉంది. ఒకవేళ రెండు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దైతే అన్ని జట్లు ఇప్పుడున్న స్థానాల్లోనే ఉంటాయి. ఈ లెక్కన కేకేఆర్- రాజస్థాన్, క్వాలిఫయర్- 1లో తలపడతాయి. సన్‌రైజర్స్- ఆర్సీబీ ఎలిమినేటర్‌లో ఢీ కొంటాయి. అయితే టాప్- 2లో ఉంటే క్వాలిఫయర్- 1లో పోటీ పడవచ్చు. ఒకవేళ ఇక్కడ ఓడినా ఫైనల్ చేరేందుకు మరో ఛాన్స్ ఉంటుంది. అందుకే రాజస్థాన్, సన్‌రైజర్స్ రెండో పొజిషన్‌కి చేరుకోవడం కోసం తహతహలాడుతున్నాయి.
RCB నయా హీరో యశ్- అంతా అదృష్టం కలిసిరావడం వల్లే! - IPL 2024
IPLలో విరాట్ రికార్డులు- ఏకైక భారత బ్యాటర్‌గా కింగ్ ఘనత - IPL 2024