IPL 2024 Kolkata Knight Riders VS Punjab Kings : ఐపీఎల్ 2024లో భాగంగా తాజాగా జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. నువ్వా నేనా అనేలా సాగిన ఈ పోరులో రికార్డ్ ఛేజింగ్ చేసి 8 వికెట్ల తేడాతో పంజాబ్ గెలిచింది.
Bairstow Century : 262 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్‌లో జానీ బెయిర్ స్టో(48 బంతుల్లో 4 ఫోర్లు 5 సిక్స్‌ల సాయంతో 108) సెంచరీతో, ప్రభ్సిమ్రాన్ సింగ్(20 బంతుల్లో 4 సిక్స్‌లు, 5 సిక్స్‌లో సాయంతో 54 పరుగులు), శశాంక్ సింగ్(28 బంతుల్లో 2 ఫోర్లు 8 సిక్స్‌ల సాయంతో 68 నాటౌట్) హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో 18.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 262 పరుగులు చేసింది. సునీల్ నరైన్ ఓ వికెట్ తీశాడు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్‌లో బ్యాటర్లు మరోసారి తన సత్తా చాటారు. సొంతమైదానంలో తమ బ్యాట్లకు పని చెప్పి పంజాబ్ కింగ్స్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. దీంతో కోల్‌కతా 6 వికెట్ల నష్టానికి 261 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్(75), సునీల్ నరైన్(71) అదిరో ఆరంభాన్ని ఇచ్చారు. హాఫ్ సెంచరీలతో చెలరేగారు. వీరి దెబ్బకు 8 ఓవర్లకే స్కోర్ 100 దాటింది. అయితే బౌండరీలు బాదుతూ తోసెంచరీ దిశగా దూసుకెళ్లిన నరైన్‌ను రాహుల్ చాహర్ ఔట్ చేశాడు. దీంతో 138 పరుగుల దగ్గర తొలి వికెట్ కోల్పోయింది కేకేఆర్. రసెల్(24) ఫర్వాలేదనిపించాడు. చివర్లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(28) దూకుడుగా ఆడాడు. వెంకటేశ్ అయ్యర్‌తో(39 నాటౌట్) కలిసి బౌండరీలు బాదాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 43 పరుగులు జోడించారు. రింకూ సింగ్(5), రమన్ దీప్ సింగ్(6 నాటౌట్) స్కోర్ చేశారు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ సింగ్ 2, కెప్టెన్ శామ్ కరన్ 1, హర్షల్ పటేల్ 1, రాహుల్ చహర్ 1 వికెట్ తీశారు.
-
.@PunjabKingsIPL are roaring again 🦁
— IndianPremierLeague (@IPL) April 26, 2024
A special victory at the Eden Gardens for #PBKS who secure the highest successful run chase in the IPL and T20s ❤️
Scorecard ▶️ https://t.co/T9DxmbgIWu#TATAIPL | #KKRvPBKS pic.twitter.com/FNxVD8ZeW6
రికీ పాంటింగ్ క్రికెట్ బ్యాట్ కలెక్షన్స్ - గ్యారేజీలో 1000కుపైగా! - IPL 2024
యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసిన బుమ్రా - ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ - Jasprit Bumrah youtube channel