ETV Bharat / sports

ముంబయితో మ్యాచ్​కు ముందు సన్​రైజర్స్​కు ఎదురుదెబ్బ - అతడు దూరం! - IPL 2024

IPL 2024 Mumbai Indians VS Sunrisers Hyderabad : ముంబయి ఇండియన్స్​తో మ్యాచ్​కు ముందు సన్​రైజర్స్​ హైదరాబాద్​కు ఓ ఎదురుదెబ్బ తగిలినట్లు కనిపిస్తోంది. ఆ వివరాలు.

ముంబయితో మ్యాచ్​కు ముందు సన్​రైజర్స్​కు ఎదురుదెబ్బ - అతడు దూరం!
Etv ముంబయితో మ్యాచ్​కు ముందు సన్​రైజర్స్​కు ఎదురుదెబ్బ - అతడు దూరం!
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 27, 2024, 10:05 AM IST

Updated : Mar 27, 2024, 10:59 AM IST

IPL 2024 Mumbai Indians VS Sunrisers Hyderabad : ఐపీఎల్ 2024 సీజన్ ప్రస్తుతం రసవత్తరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. మరి కొన్ని గంటల్లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ హోం గ్రౌండ్​లో - ముంబయి ఇండియన్స్​తో తలపడనుంది. అయితే సన్​రైజర్స్​​ హైదరాబాద్​కు ఓ ఎదురుదెబ్బ తగిలింది. స్టార్‌ స్పిన్నర్‌ వనిందు హసరంగ ఇప్పట్లో జట్టుతో చేరే అవకాశాలు కనిపించడం లేదని తెలుస్తోంది. గాయం కారణంగా ఈ లంక ప్లేయర్​ మరి కొంత కాలం ఆటకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. అంటే ఎస్‌ఆర్‌హెచ్‌ క్యాంపులోకి అతడు చేరడం మరింత ఆలస్యం కానున్నట్లు సమాచారం అందుతోంది.

వనిందు హసరంగ ఈ మధ్యే బంగ్లాదేశ్‌తో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్​లో లంక తరఫున ఆడాడు. వన్డే, టీ20 మ్యాచ్‌లలో ఆడిన అతడు మొత్తంగా ఎనిమిది వికెట్లు(6,2) వికెట్లు పడగొట్టాడు. అయితే, ఈ సిరీస్ తర్వాత అతడు ఎడమకాలికి నొప్పితో బాగా బాధపడ్డాడు. దీంతో శ్రీలంక క్రికెట్‌ వైద్య బృందం అతడి గాయం తీవ్రతను గుర్తించి ప్రాథామిక చికిత్స చేయించింది. విదేశాలకు వెళ్లి చికిత్స తీసుకోవాలని అతడికి సూచనలు చేసినట్లు ఇంగ్లీష్ మీడియాల్లో కథనాలు వచ్చాయి. దీంతో అతడు ఇప్పట్లో సన్‌రైజర్స్‌ క్యాంపులో చేరే అవకాశాలు లేవని కథనాల్లో రాసి ఉంది.

2022లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహించాడు వనిందు హసరంగ. అప్పుడు 7.54 ఎకానమీతో 26 వికెట్లు తీశాడు. అతడు లోయర్‌ ఆర్డర్‌లో కూడా బ్యాటింగ్‌ చేయగలిగే సమర్థుడు. అయితే, ఐపీఎల్‌ - 2024 మినీ వేలంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అతడిని రూ. 1.5 కోట్లకు కొనుగోలు చేసింది.

ఇకపోతే ఐపీఎల్‌ - 2024 సీజన్​ తమ ఆరంభ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ఓటమిని ఎదుర్కొంది. ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో జరిగిన మ్యాచులో నాలుగు పరుగుల స్వల్ప తేడాతో పరాజయం పొందింది. ఇప్పుడు తదుపరి మ్యాచ్​ను సొంత మైదానం ఉప్పల్‌లో ముంబయి ఇండియన్స్‌తో పోటీపడనుంది. ఇందుకోసం ఇప్పటికే ఇరుజట్లు హైదరాబాద్‌ చేరుకున్నాయి. ప్రాక్టీస్ కూడా చేశాయి. అయితే ముంబయి ఇండియన్స్‌ కూడా తమ మొదటి మ్యాచ్​లో గుజరాత్‌ టైటాన్స్‌ చేతిలో ఆరు పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో ఇరు జట్లు విజయమే లక్ష్యంగా బోణీ కొట్టాలని పట్టుదలగా ఉన్నాయి. చూడలి మరి ఎవరు గెలుస్తారో.

ఉప్పల్‌ మ్యాచ్‌కు మీరు వెళ్తున్నారా? - కచ్చితంగా ఇవి పాటించాల్సిందే! - IPL 2024 Sunrisers VS MI

ఉప్పల్​ స్టేడియంలో హై ఓల్టేజ్​ మ్యాచ్​ - బోణీ కొట్టేదెవరో? - IPL 2024 Sunrisers VS MI

Last Updated : Mar 27, 2024, 10:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.