ETV Bharat / sports

రోహిత్ మెరిసినా, లఖ్​నవు మురిసింది- ఓటమితో ముంబయి బైబై! - IPL 2024 LSG VS MI - IPL 2024 LSG VS MI

IPL 2024 LSG VS MI: వాంఖడే వేదికగా ముంబయితో జరిగిన మ్యాచ్​లో లఖ్​నవూ 18 పరుగుల తేడాతో నెగ్గింది. దీంతో విజయంలో లఖ్​నవూ, ఓటమితో ముంబయి టోర్నీని ముగించాయి.

MI vs LSG IPL 2024
MI vs LSG IPL 2024 (Source: Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : May 17, 2024, 10:59 PM IST

Updated : May 18, 2024, 7:24 AM IST

IPL 2024 LSG VS MI: 2024 ఐపీఎల్ సీజన్​ను లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ విజయంతో ముగించింది. శుక్రవారం వాంఖడే వేదికగా ముంబయి ఇండియన్స్​తో జరిగిన మ్యాచ్​లో లఖ్​నవూ 18 పరుగుల తేడాతో నెగ్గింది. భారీ లక్ష్య ఛేదనలో ముంబయి ఓపెనర్ రోహిత్‌శర్మ (68; 38 బంతుల్లో 10×4, 3×6) ఘనమైన ఆరంభం ఇచ్చినా మిడిలార్డర్ ఫెయిలైంది. దీంతో ముంబయి ఓవర్లన్నీ ఆడి 6 వికెట్లకు 196 పరుగులకే పరిమితమైంది. రవి బిష్ణోయ్ , నవీన్ ఉల్ హక్ తలో 2, మోసిన్ ఖాన్, కృనాల్ పాండ్య చెరో వికెట్ దక్కించుకున్నారు. దీంతో ముంబయి ఈ సీజన్​లో 10వ ఓటమి మూటగట్టుకొని పట్టికలో అట్టడుగు నిలిచింది.

భారీ ఛేదనలో ఇన్నింగ్స్​ను ముంబయి ఘనంగా ఆరంభించింది. ఓపెనర్‌ రోహిత్‌ ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. అయితే 3.5 వద్ద కాసేపు వర్షం ఆటకు అంతరాయం కలిగించింది. అప్పటికి ముంబయి స్కోర్ 33-0. తర్వాత తిరిగి ప్రారంభమయ్యాక కూడా రోహిత్ బౌండరీలతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో 28 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.

ఇక ముంబయి 8 ఓవర్లకు 78/0తో లక్ష్యం దిశగా దూసుకెళ్లింది. కానీ మూడు ఓవర్ల వ్యవధిలో డివాల్డ్ బ్రెవిస్‌ (23), సూర్యకుమార్‌ (0)తో పాటు క్రీజులో కుదురుకున్న రోహిత్‌ కూడా ఔట్‌ అయ్యారు. దీంతో ముంబయి 10.5 ఓవర్లలో 97/3తో కష్టాల్లో పడింది. ఇషాన్ కిషన్ (14), హార్దిక్ పాండ్య (16) కూడా విఫలమయ్యారు. చివర్లో నమన్ ధీర్ (62 పరుగులు, 28 బంతుల్లో) రాణించినా ఫలితం దక్కలేదు.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన లఖ్​నవూ నిర్ణీత 20 ఓవర్లలో 214-6 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (55) రాణించగా, నికోలస్ పూరన్ (75 పరుగులు, 29 బంతుల్లో) మెరుపు ఇన్నింగ్స్​తో అలరించాడు. మార్కస్ స్టాయినిస్ (28) ఫర్వాలేదనిపించాడు. ఇక ఆఖర్లో లఖ్​నవూ వికెట్లు కోల్పోయింది. చివర్లో అయుశ్ బదోని (22*), కృనాల్ పాండ్య (12*) రాణించడం వల్ల లఖ్​నవూకు 214 స్కోర్ దక్కింది. ముంబయి బౌలర్లలో నువాన్ తుషారా, చావ్లా చెరో 3 వికెట్లు దక్కించుకున్నారు.

వర్షం ముప్పు - ఆర్సీబీని సబ్‌ ఎయిర్‌ సిస్టమ్‌ కాపాడుతుందా? - IPL 2024 CSK VS RCB

ఆర్సీబీ గెలిచినా సీఎస్కేకే ప్లే ఆఫ్స్‌ అవకాశం - ఎలాగంటే? - IPL 2024 CSK VS RCB

Last Updated : May 18, 2024, 7:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.