Hardik Pandya Cousin Arrest : స్టార్ క్రికెటర్లు హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్య తమ సమీప బంధువు చేతిలో మోసపోయారు. వరుసకు సోదరుడయ్యే వైభవ్ పాండ్య ఈ ఇద్దరిని మోశం చేశాడని తెలిసింది. పార్ట్‌నర్‌షిప్ బిజినెస్‌లో దాదాపు రూ.4.3కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టాడట వైభవ్. ఇది తెలుసుకున్న పాండ్య బ్రదర్స్ ముంబయి పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఆర్థిక నేరాల విభాగం అధికారులు వైభవ్‌ను అరెస్టు చేశారు.
అసలు ఏం జరిగిందంటే? పాండ్య సోదరులు హార్దిక్, కృనాల్ తమ కజిన్ వైభవ్‌తో కలిసి 2021లో పాలిమర్ బిజినెస్ ప్రారంభించారు(Hardik Pandya Business). ఇందులో హార్దిక్, కృనాల్‌కు 40శాతం చొప్పున పెట్టు బడులున్నాయి. మిగతా 20శాతం వైభవ్ వాటా. అతడే ఈ బిజినెస్‌కు సంబంధించి అన్నీ బాధ్యతలు, రోజువారీ కార్యకలాపాలను చూసుకుంటూ ఉంటాడు. అయితే లాభాలను కూడా ఇదే నిష్పత్తిలో పంచుకుంటుంటారు.
అయితే అంతా చక్కగా సాగుతున్న సమయంలో హార్దిక్, కృనాల్‌కు తెలీకుండా వైభవ్ మరో పాలిమర్ బిజినెస్‌ను ప్రారంభించాడని తెలిసింది. ఇదంతా కొద్ది రోజుల క్రితమే జరిగిందట. దీంతో గతంలో పార్ట్నార్షిప్ ద్వారా పెట్టిన బిజినెస్‌కు లాభాలు తగ్గాయి. దాదాపు రూ.3 కోట్ల వరకు నష్టం కూడా వాటిల్లిందని తెలిసింది. పైగా వైభవ్ సీక్రెట్‌గా తన ప్రాఫిట్ షేర్‌ను కూడా 20శాతం నుంచి 33 శాతానికి పెంచుకున్నాడట. సంస్థ మెయిన్ అకౌంట్ నుంచి చాలా డబ్బును తన ఖాతాకు ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. . అలా మొత్తంగా దాదాపు రూ.4.3 కోట్ల వరకు పాండ్య బ్రదర్స్‌ను మోసం చేశాడు.
ఇక ఈ విషయం గురించి తెలుసుకున్న పాండ్య బ్రదర్స్ వైభవ్‌ను నిలదీశారంట. అయితే వైభవ్ రివర్స్‌లో పరువు తీస్తానంటూ బెదిరింపులకు దిగినట్లు తెలిసింది. దీంతో హార్దిక్, కృనాల్ ముంబయి పోలీసులను ఆశ్రయించారు. ఇక కేసు నమోదు చేసుకున్న ముంబయి అధికారులు వైభవ్‌ను అరెస్టు చేసి జైల్లో ఉంటారు. దీనిపై తదుపరి దర్యాప్తు కొనసాగించనున్నట్లు తెలిపారు. కాగా, హార్దిక్ ప్రస్తుతం ఐపీఎల్లో ముంబయి ఇండియన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. కృనాల్ లఖ్‌నవూకు ఆడుతున్నాడు.
ముంబయి Vs ఆర్సీబీ - ఈ ఆటలో ఇద్దరూ గెలవాల్సిందే! - MI Vs RCB IPL 2024
ఆకాశ్ కారులో రోహిత్! - హిట్‌మ్యాన్ కోసం ఆ ఫ్రాంచైజీ రెడీ! - Rohit Sharma Mumbai Indians