ETV Bharat / sports

డేంజర్ జోన్​లో హార్దిక్ పాండ్య - IPL 2024

IPL 2024 Hardik Pandya Fined : ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య డేంజర్ జోన్​లోకి వెళ్లిపోయాడు. పూర్తి వివరాలు స్టోరీలో.

.
.
author img

By ETV Bharat Telugu Team

Published : May 1, 2024, 1:05 PM IST

Updated : May 1, 2024, 2:24 PM IST

IPL 2024 Hardik Pandya Fined : ఐపీఎల్​లో హార్దిక్ పాండ్యకు కష్టాలు వెంటాడుతున్నాయి. ఏప్రిల్ 30న లఖ్​నవూ సూపర్ కింగ్స్​తో జరిగిన మ్యాచ్​లో ముంబయి ఓడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో ముంబయి జట్టుకు ప్లే ఆఫ్ అవకాశాలు దూరమయ్యాయి. అలా ఓటమి, ప్లే ఆఫ ఆశలు గల్లంతు అయిన బాధలో ఉన్న హార్దిక్​ పాండ్యకు ఇప్పుడు మరో కష్టం వచ్చి పడింది. పాండ్యకు బీసీసీఐ భారీ జరిమానా విధించింది. ఈ మెగా టోర్నీలో రెండోసారి స్లో ఓవర్ రేట్‌ వేసినందుకు గానూ రూ. 24 లక్షల జరిమానా విధిస్తూ అనౌన్స్​మెంట్ చేసింది.

కేవలం కెప్టెన్ హార్దిక్​ పాండ్యకు మాత్రమే కాదు ముంబయి జట్టులోని ఇతర ప్లేయర్స్​కు కూడా జరిమానా విధించారు ఐపీఎల్ నిర్వాహకులు. జట్టులోని ప్లేయింగ్ 11లో ఉన్న వారందరికీ రూ. 6 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 25% జరిమానా విధించారు. ఈ రెండింటిలో ఏది తక్కువగా ఉంటే దానిని ప్లేయర్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. కాగా, హార్దిక్ పాండ్య మరోసారి స్లో ఓవర్ రేట్ కారణంగా శిక్షకు గురైతే మరింత భారీ జరిమానా విధిస్తారు. దాదాపు రూ. 30 లక్షల జరిమానాతో పాటు ఒక మ్యాచ్ నిషేధం కూడా పడుతుంది.

ఇక ఈ సీజన్​లో చెన్నైతో జరిగిన మ్యాచ్​లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభమాన్ గిల్ స్లో ఓవర్ రేట్‌ కారణంగా రూ.12 లక్షల జరిమానా ఎదుర్కొన్న తొలి ప్లేయర్​గా నిలిచాడు. ఆ తర్వాత ఈ జాబితాలో పంత్ రెండు సార్లు, సంజూ శాంసన్, శ్రేయాస్ అయ్యర్, స్లో ఓవర్ రేట్‌ జరిమానాను ఎదుర్కొన్నారు.

కాగా, లఖ్​నవూ సూపర్​ జెయింట్స్​తో ఉత్కంఠగా జరిగిన మ్యాచులో పాండ్య బ్యాటింగ్​లో మొదటి బంతికే డకౌట్ అయ్యాడు. అయితే బ్యాటింగ్​లో విఫలమైనప్పటికీ బౌలింగ్​లో రాణించాడు. నాలుగు ఓవర్లలో కేవలం 26 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. ఈ పోరులో మొదట బ్యాటింగ్ చేసిన ముంబయి 144 పరుగులు చేసి ఔటవ్వగా లఖ్​నవూ బ్యాటర్లు 19.2 ఓవర్లలోనే ఆ లక్ష్యాన్ని చేధించి విజయాన్ని అందుకున్నారు. ఛేదనలో స్టోయినిస్(62; 45 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ శతకం చేయగా కేఎల్ రాహుల్ 28 పరుగులు చేశాడు.

కేఎల్ రాహుల్‌కు చోటు దక్కకపోవడానికి కారణాలు ఇవేనా? - T20 World Cup 2024

సంజూ శాంసన్‌ - ది సైలెంట్‌ ఫైటర్‌ - T20 world cup 2024

Last Updated : May 1, 2024, 2:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.