ETV Bharat / sports

హోమ్​ గ్రౌండ్​లో ఆల్​రౌండ్​ షో- హైదరాబాద్‌పై గుజరాత్‌ విజయం - IPL 2024 GT VS SRH - IPL 2024 GT VS SRH

IPL 2024 GT VS SRH : హైదరాబాద్‌తో మ్యాచ్‌లో గుజరాత్‌ సత్తా చాటింది. హోమ్‌ గ్రౌండ్‌లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

IPL 2024 GT VS SRH
IPL 2024 GT VS SRH
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 31, 2024, 6:59 PM IST

Updated : Mar 31, 2024, 7:05 PM IST

IPL 2024 GT VS SRH : ఐపీఎల్‌ 17వ సీజన్‌లో గుజరాత్‌ టైటాన్స్ రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌పై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. 163 పరుగుల లక్ష్యాన్ని మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. ఓపెనర్లు శుభ్‌మన్‌ గిల్‌ (36), వృద్ధిమాన్‌ సాహా (25) శుభారంభాన్నిచ్చారు. సాయి సుదర్శన్‌ (45), డేవిడ్‌ మిల్లర్‌ (44*) అద్భుత ఇన్నింగ్స్‌ ఆడారు. హైదరాబాద్‌ బౌలర్లలో భువనేశ్వర్‌ కుమార్‌, మయాంక్‌ మార్కండే, జయదేవ్‌ ఉనద్కత్‌ తలో వికెట్‌ తీశారు.

లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్‌ ప్రారంభం నుంచి పక్కా ప్రణాళికతో ఆడింది. ఓపెనర్లు వృద్ధిమాన్‌ సాహా, శుభ్‌మన్‌ గిల్‌ నిలదొక్కుకుంటున్న సమయంలో ఈ జోడీని షాబాజ్‌ అహ్మద్‌ విడగొట్టాడు. ఐదో ఓవర్‌ తొలి బంతికి భారీ షాట్‌కు ప్రయత్నించిన వృద్ధిమాన్‌, కమిన్స్‌ చేతికి చిక్కిపోయాడు. ఫస్ట్‌డౌన్‌లో వచ్చిన సాయి సుదర్శన్‌తో కలిసి కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ ఇన్నింగ్స్‌ నిర్మించాడు. అయితే పదో ఓవర్లో కమిన్స్‌ మార్కండే బౌలింగ్‌లో అబ్దుల్‌ సమద్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన డేవిడ్‌ మిల్లర్‌తో కలిసి సుదర్శన్‌ కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు.

ఇద్దరూ పోటా పోటీగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని కమిన్స్‌ విడగొట్టాడు. 16.1వ బంతికి సాయి సుదర్శన్‌ భారీ షాట్‌కు ప్రయత్నించి అభిషేక్‌ శర్మ చేతికి చిక్కిపోయాడు. అప్పటికి జట్టు స్కోరు 138 పరుగులు. అప్పటికే గుజరాత్‌ లక్ష్యానికి చేరువ కావడంతో హైదరాబాద్‌పై ఒత్తిడి పెరిగిపోయింది. చివర్లో వచ్చిన విజయ్‌ శంకర్‌ (14*) సాయంతో మిల్లర్‌ లక్ష్యాన్ని పూర్తి చేశాడు.

అంతకు ముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న సన్​రైజర్స్, నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (29), అబ్దుల్ సమద్ (29) టాప్‌ స్కోరర్లుగా నిలిచారు. క్లాసెన్ (24; 13 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడినా ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. షాబాజ్ అహ్మద్‌ (22), ట్రావిస్ హెడ్ (19), మయాంక్ అగర్వాల్ (16), మార్‌క్రమ్‌ (17) తక్కువ స్కోరుకే పరిమితమయ్యారు. గుజరాత్ బౌలర్లలో మోహిత్ శర్మ 3, ఒమర్జాయ్‌, ఉమేశ్ యాదవ్, రషీద్‌ ఖాన్‌, నూర్ అహ్మద్‌ తలో వికెట్ పడగొట్టారు.

Last Updated : Mar 31, 2024, 7:05 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.