ETV Bharat / sports

ధోనీ వచ్చే సీజన్​లో ఆడుతాడా - రైనా వన్​ వర్డ్​ ఆన్సర్​ ఇదే! - IPL 2025 DHONI - IPL 2025 DHONI

IPL 2024 Dhoni Suresh Raina : ఎప్పటిలాగే ఈ సీజన్​లో ధనాధన్ ఇన్నింగ్స్​ ఆడుతున్న సీఎస్కే కెప్టెన్​ ధోనీ రాబోయే ఐపీఎల్ సీజన్​లో ఆడుతాడా? - దీనికి సురేశ్​ రైనా వన్​ వర్డ్​ ఆన్సర్​ చెప్పాడు. ఏం చెప్పాడంటే?

.
.
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 17, 2024, 9:00 PM IST

IPL 2024 Dhoni Suresh Raina : ఇండియాలో మహేంద్ర సింగ్‌ ధోనీకి ఉన్న క్రేజ్‌ గురించి అందరికీ తెలిసిందే. 42 ఏళ్ల వయస్సులోనూ మహీ సిక్సులు బాదుతుంటే స్టేడియం ఊగిపోతోంది. ప్రత్యేకంగా అతడి బ్యాటింగ్‌ చూసేందుకు ఫ్యాన్స్‌ పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. అతడు బ్యాటుతో గ్రౌండులోకి అడుగు పెట్టగానే స్టేడియం అభిమానుల కేకలతో హోరెత్తుతోంది. ఇప్పటికే చాలా సార్లు ఇదే ధోనీ చివరి ఐపీఎల్‌ సీజన్‌ అంటూ ఎన్నో ఊహాగానాలు వచ్చాయి. కానీ ప్రస్తుత సీజన్‌లో కనిపిస్తున్న సంకేతాలతో చాలా మంది ఫ్యాన్స్‌ మహీకి ఇదే లాస్ట్‌ ఐపీఎల్‌ సీజన్‌ అని భావిస్తున్నారు. అందుకే మైదానంలో మహీని చూడటానికి భారీగా తరలివస్తున్నారు. అయితే తాజాగా రైనా చేసిన వ్యాఖ్యలు తలా ఫ్యాన్స్‌లో ఆశలు రేకెత్తిస్తున్నాయి.

రైనా మాట్లాడుతూ - ఖేల్తా(ఆడుతాడు) అని సూటిగా, ఒక్క మాటలో సమాధానం ఇచ్చాడు. ధోనీకి సన్నిహిత మిత్రుడు అయిన భారత మాజీ పేసర్ ఆర్పీ సింగ్ కూడా మహీ మరో సీజన్‌ ఆడుతాడని సూచించాడు. ఇది మహీ చివరి సీజన్ అని అనిపించడం లేదని చెప్పాడు. దీంతో అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.

  • మోకాలి నొప్పి తీవ్రత ఎంత?
    అయితే ఈ సీజన్‌లో ధోనీ కేవలం 25 బంతులు మాత్రమే ఆడాడు. కానీ 236.00 స్ట్రైక్‌ రేటుతో అదరగొట్టాడు. అయినప్పటికీ అతడు మైదానంలో మోకాలి నొప్పితో బాధ పడుతున్నట్లు కనిపిస్తోంది. ఎడమ మోకాలికి బ్లాక్‌ బ్యాండ్‌ను చుట్టుకుని కనిపిస్తున్నాడు. ఏప్రిల్‌ 14న ఆదివారం ముంబయితో ఆడిన మ్యాచ్‌లో అతడు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్లు స్పష్టంగా కనిపించింది. అసలు గతేడాదే ఐపీఎల్ తర్వాత ధోనీ మోకాలికి శస్త్ర చికిత్స జరిగిన విషయం తెలిసిందే.

కెప్టెన్సీ వదులుకున్న ధోనీ - ఐపీఎల్ 17వ సీజన్‌ మొదలుకావడానికి ఒక్కరోజు ముందు సీఎస్కే కెప్టెన్‌గా ధోనీ తప్పకున్న సంగతి తెలిసిందే. చెన్నై సారథి బాధ్యతలను యంగ్‌ ప్లేయర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌కు అప్పగించాడు. 2022లో కూడా చెన్నై కెప్టెన్‌గా మహీ వైదొలిగాడు. అప్పుడు జడేజాను కెప్టెన్‌గా నియమించారు. వివిధ సమస్యలతో మళ్లీ ధోనీనే తిరిగి బాధ్యతలు అందుకున్నాడు. కానీ ఈసారి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. రుతురాజ్‌(27) దీర్ఘకాలిక భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని బాధ్యతలు అప్పగించారు. ధోనీ కీపర్‌, బ్యాట్స్‌మెన్‌గా మారిపోయాడు. దీంతో చాలా మంది ధోనీకిది చివరి సీజన్‌ అని భావిస్తున్నారు.

రైనా భోజ్‌పురి కామెంట్రీని మెచ్చుకున్న ధోని - ఇద్దరి మధ్య ఇంట్రెస్టింగ్‌ కన్వర్జేషన్‌ - Raina Bhojpuri Commentary

డైహార్డ్​​ ఫ్యాన్స్​ - కోహ్లీ కోసం ఒక్కొక్కరు రూ.53 వేలు పెట్టి స్టేడియానికి! - IPL 2024 Match Tickets Price

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.