IPL 2024 SRH VS CSK : కెప్టెన్ అంటే సమయానికి తగ్గ నిర్ణయాలు తీసుకోగలగాలి. వ్యూహాన్ని రచించి దాన్ని అమలు చేయగలగాలి. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ అదే జరిగింది. టాస్ గెలిచిన పాట్ కమిన్స్ చెన్నైను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. హైదరాబాద్ జట్టు బౌలర్లతో ప్రత్యర్థి జట్టును ముప్పుతిప్పలు పెట్టాడు. పకడ్బందీగా అమలుచేసిన ప్రణాళికతో ప్రత్యర్థి జట్టు 165 పరుగులకే చాపచుట్టేసింది. ఫలితంగా హైదరాబాద్ ఆరు వికెట్ల తేడాతో గెలిచింది.
పాట్ కమిన్స్ - "గ్రౌండ్ కాస్త డిఫరెంట్‌గా అనిపించింది. గేమ్ కాస్త నిదానించినా స్పిన్‌ను ఎదుర్కొంటూ శివమ్ దూబె బాగా ఆడాడు. ఆఫ్ కట్ చేయగలిగిన వాళ్లను మేం అడ్డుకోగలిగాం. పాయింట్లు సాధించడమే లక్ష్యంగా ఆడాం. ట్రావిస్ హెడ్‌ను టాప్‌లో దింపాలి, అభిషేక్‌ను బౌలింగ్ చేయనివ్వకూడదని ముందుగానే అనుకున్నాం. వీరు విధ్వంసకర బ్యాటింగ్ చేస్తూ పరుగులు చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో అభిషేక్ 12 బంతుల్లో 37 పరుగులు చేశాడు. అద్భుత ఇన్నింగ్స్ ఆడి పవర్ ప్లేలో భారీ స్కోర్ చేసి కీలక పాత్ర పోషించాడు" అని పేర్కొన్నాడు. ఇక ధోనీ(Uppal Stadium Dhoni) గురించి మాట్లాడుతూ "అతడు నడుచుకొని వస్తుంటే ఇవాళ స్టేడియం మొత్తం మార్మోగిపోయింది. నేను ఎప్పుడూ విననంత పెద్ద శబ్దం విన్నాను" అని అన్నాడు. అయితే ధోనీ క్రేజ్ గురించి కమిన్స్ అలా అనడంపై కొంతమంది నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. ధోనీ క్రేజ్ ఎప్పుడూ అలానే ఉంటది బాసూ అని అంటున్నారు.
-
Taking to the den in Yellove! 🥳#SRHvCSK #WhistlePodu 🦁💛 pic.twitter.com/xOPrPSUCHg
— Chennai Super Kings (@ChennaiIPL) April 5, 2024
అభిషేక్ శర్మ - "బౌలింగ్ చేస్తున్న సమయంలోనే మైదానం కాస్త నెమ్మెదిగా కనిపించింది. పవర్ ప్లేలో బాగా ఆడితే ఆ తర్వాత స్కోరు బోర్డు. ముందుకు కొనసాగుతుందనుకున్నాం. ఈ ఐఎపీఎల్ తర్వాత ఆడబోయే ప్రపంచ కప్ కోసం మంచి వేదికగా అవకాశం దొరికింది. భారీ స్కోరు నమోదు చేయడం కీలకం. ఇవాళ మాత్రం స్కోరు కోసం ప్రయత్నించకుండా జట్టుతో కలిసి ఆడాను. నాకు సహకరించినందుకు యువీకి, బ్రియాన్ లారాకు, నా తండ్రికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను." అని పేర్కొన్నాడు.
రుతురాజ్ గైక్వాడ్ - "నిజాయతీగా చెప్పాలంటే ఇదంతా గ్రౌండ్ ఎఫెక్ట్. వాళ్ల బౌలింగ్ విభాగం చక్కటి బంతులు సంధిస్తూ గేమ్ ను ఆధీనంలో ఉంచుకున్నారు. మేం బాగానే ఆడామనుకుంటున్నాం. వాళ్లు మా కన్నా బాగా ఆడారు. మైదానం స్వభావం నెమ్మెదిగా ఉండటంతో వాళ్లు బౌండరీలనే టార్గెట్‌గా పెట్టుకుని ఆ"డారు. 170-175 వరకూ స్కోరు చేసినా బాగుండేది కానీ, సాధ్యపడలేదు. ఇరు జట్ల బ్యాటర్లు పరుగులు చేయడానికి బాగా కష్టపడ్డారు. శివమ్ దూబె ఒక్కడే 24 బంతుల్లో 45 పరుగులు చేసి మిడిల్ ఓవర్లలో ఒక ఉత్సాహాన్నినింపాడు. జడేజా, మిచెల్ బౌండరీలు చేయడానికి శ్రమించాల్సి వచ్చింది." అని అన్నాడు.
చెన్నై ఓడినా శివమ్ దూబె ధమాకా ఇన్నింగ్స్ - సిక్సర్ల మోత! - IPL 2024 Sunrisers VS CSK
అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్ - చెన్నైని ఉతికారేశాడు - IPL 2024 CSK VS SRH