ETV Bharat / sports

సెంచరీతో చెలరేగిన స్టొయినిస్​ - ఉత్కంఠ పోరులో చెన్నైపై లఖ్​నవూ థ్రిల్లింగ్ విక్టరీ - IPL 2024 - IPL 2024

IPL 2024 Chennai Super Kings vs Lucknow Super Giants : ఐపీఎల్ 2024లో భాగంగా తాజాగా జరిగిన ఉత్కంఠ మ్యాచ్​లో లఖ్​నవూ సూపర్​ జెయింట్స్ అద్భుత విజయం సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్​పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

.
.
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 23, 2024, 11:40 PM IST

Updated : Apr 23, 2024, 11:49 PM IST

IPL 2024 Chennai Super Kings vs Lucknow Super Giants : ఐపీఎల్ 2024లో భాగంగా తాజాగా జరిగిన ఉత్కంఠ మ్యాచ్​లో లఖ్​నవూ సూపర్​ జెయింట్స్ అద్భుత విజయం సాధించింది. మార్కస్ స్టొయినిస్​(63 బంతుల్లో 13 ఫోర్లు, 6 సిక్స్​ల సాయంతో 124 నాటౌట్​ ) ఒక్కడే మొదటి నుంచి చివరి వరకు క్రీడులో ఉండి ఒంటిచేత్తో మ్యాచ్​ను గెలిపించాడు. లాస్ట్ ఓవర్​లో చివరి మూడు బంతుల్లో విజయానికి మూడు పరుగులు అవసరమయ్యాయి. అయినా స్టొయినిస్​ ఒత్తిడిలోనూ బంతిని బాది మ్యాచ్​ను ముగించాడు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్​పై 6 వికెట్ల తేడాతో లఖ్​నవూ విజయం సాధించింది. అలా 211 పరుగుల లక్ష్యాన్ని మరో మూడు బంతులు మిగిలి ఉండగానే 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మొత్తంగా 213 పరుగులు చేసింది.

ఇక లఖ్​నవూ ఇన్నింగ్స్​లో చివర్లో వచ్చిన దీపక్ హోడా(6 బంతుల్లో 17 నాటౌట్​) కూడా మంచి స్కోరే చేశాడు. మిగతా వారిలో దేవదత్ పడిక్కల్​(19 బంతుల్లో 13 పరుగులు), నికోలస్ పూరన్​(15 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్​ల సాయంతో 34 పరుగులు), కేఎల్ రాహుల్​(14 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్స్ సాయంతో 16 పరుగులు) రన్స్​ చేశారు. మతీశా పతిరణ 2, ముస్తాఫిజుల్ రెహ్మాన్​, దీపక్ చాహర్ తలో వికెట్ దక్కించుకున్నారు.

అంతకుముందు ఈ మ్యాచ్​లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 210 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. సీఎస్‌కే బ్యాటర్లలో కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌తో పాటు శివమ్‌ దూబే మరోసారి ధనాధన్​ ఇన్నింగ్స్‌ ఆడారు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అద్భుతమైన సెంచరీతో చెలరేగి విధ్వంసం సృష్టించాడు. లఖ్​నవూ బౌలర్లను ఓ ఆట ఆడేసుకున్నాడు. కేవలం 54 బంతుల్లోనే తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. మొత్తంగా 60 బంతులు ఎదుర్కొన్న అతడు 12 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 108 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. గైక్వాడ్‌కు ఇది తన ఐపీఎల్ కెరీర్‌లో రెండో సెంచరీ కావడం విశేషం. అంత‌కుముందు, ఐపీఎల్ 2021లో రాజస్థాన్ రాయల్స్‌పై తొలి ఐపీఎల్ సెంచరీ సాధించాడు రుతురాజ్. శివమ్ దూబే కేవలం 27 బంతుల్లోనే 3 ఫోర్లు, 7 సిక్స్‌ల సాయంతో 66 పరుగులు చేశాడు. ఇన్నింగ్స్ చివర్లో ధోనీ చివ‌రి బంతిని ఆడి ఫోర్ బాది అభిమానులను అల‌రించాడు. ఇక డారిల్ మిచెల్(10 బంతుల్లో 1 ఫోర్ సాయంతో 11 పరుగులు), రవీంద్ర జడేజా(19 బంతుల్లో 2 ఫోర్ల సాయంతో 16 పరుగులు), అజింక్యా రహానే(3 బంతుల్లో 1 పరుగు) చేశారు. లఖ్​నవూ బౌలర్లలో మాట్‌ హెన్రీ, యశ్‌ ఠాకూర్‌, మోహ్షిన్‌ ఖాన్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు.

చెన్నై తరఫున ఐపీఎల్‌లో సెంచరీలు బాదిన బ్యాట‌ర్లు వీరే

  • మురళీ విజయ్ - 2
  • షేన్ వాట్సన్ - 2
  • రుతురాజ్ గైక్వాడ్ - 2
  • మైకేల్ హస్సీ - 1
  • బ్రెండన్ మెకల్లమ్ - 1
  • సురేశ్​ రైనా - 1
  • అంబటి రాయుడు - 1

'టీ20ల్లో బౌలర్లు ఇబ్బందులు ఎదుర్కోవడానికి ప్రధాన కారణం అదే' - IPL 2024

విజయ్ దేవరకొండతో ప్రశాంత్ నీల్ సినిమా - నిజమెంత? - vijay Devarkonda PrasanthNeel

Last Updated : Apr 23, 2024, 11:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.