ETV Bharat / sports

పంత్ ఈజ్ బ్యాక్​ - 159 స్ట్రైక్​​రేట్​తో చెన్నైపై వీరబాదుడే - IPL 2024 CSK VS Delhi Capitals - IPL 2024 CSK VS DELHI CAPITALS

IPL 2024 CSK VS Delhi Capitals Captain Rishab Pant : ఐపీఎల్ 2024 సీజన్​లో భాగంగా తాజాాగ వైజాగ్ వేదికగా జరిగిన మ్యాచ్​లో ఓ వైపు సీఎస్కే మాజీ కెప్టెన్ ధోనీ తన షాట్లతో రెచ్చిపోతే మరోవైపు దిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ పంత్ కూడా తన షాట్లతో పరుగుల వరద పారించాడు. మునపటి పంత్​ను చూపించాడు. ఒకప్పటిలా ఆడుతూ బ్యాట్​తో చెలరేగిపోయాడు. ఆ వివరాలు.

పంత్ ఈజ్ బ్యాక్​ - 159 స్ట్రైక్​​రేట్​తో చెన్నైపై వీరబాదుడే

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 1, 2024, 6:54 AM IST

IPL 2024 CSK VS Delhi Capitals Captain Rishab Pant : టీమ్​ఇండియా యంగ్ వికెట్ కీపర్, దిల్లీ క్యాపిటల్స్​ కెప్టెన్ రిషబ్‌ పంత్‌ - 2022 చివర్లో రోడ్డు ప్రమాదం నుంచి త్రుటిలో ప్రాిణాలతో బయట పడిన సంగతి తెలిసిందే. అప్పుడు తీవ్ర గాయాల పాలయ్యాడు. చాలా శస్త్ర చికిత్సలు కూడా జరిగాయి. చాలా కాలం పాటు నడవలేకపోయాడు. దీంతో అతడిని మళ్లీ మైదానంలో చూడగలమా? అతడు మునుపటిలా బ్యాట్​ను ఝళిపించగలడా? అనే అనుమానాలు చాలా మందిలో రేకెత్తాయి. కానీ పంత్​ సంకల్ప బలం అతడిని నిలబెట్టింది.

గాయాలు అతడిని ఏమీ చేయలేకపోయాయి. వాటిని దాటి అతడు ఆటలోకి తిరిగొచ్చాడు. ఈ ఐపీఎల్‌ సీజన్​తోనే పోటీ క్రికెట్​లోకి పునరాగమనం చేశాడు. దీంతో అందరి దృష్టి అతడిపైనే పడింది. అయితే తొలి రెండు మ్యాచుల్లో వరుసగా 18, 28 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. కానీ తాజాగా ఇప్పుడు వైజాగ్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్​తో జరిగిన మ్యాచ్‌లో మాత్రం మునపటి పంత్​ను చూపించాడు. ఒకప్పటిలా ఆడుతూ బ్యాట్​తో చెలరేగాడు. తనదైన శైలిలో ఒంటి చేతి సిక్సర్​ను కూడా బాది ఆకట్టుకున్నాడు. 159.38 స్ట్రైక్ రేటుతో 51 ప‌రుగులు చేశాడు.

జడేజా బౌలింగ్‌లో మోకాలును కిందికి ఆనించి మరి బాదిన షాట్‌ అయితే దద్దరిల్లిపోయింది. యార్కర్లతో డేంజరస్​గా మారిన పతిరన బౌలింగ్‌లోనూ అతడు భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. హాఫ్ సెంచరీ బాది జట్టు ఇన్నింగ్స్‌లో కీలకంగా వ్యవహరించాడు. ఇక ఇది చూసిన క్రికెట్ ప్రేమికులు, ఫ్యాన్స్​ తెగ మురిసిపోయారు. అతడు తిరిగి మునపటిలా పరుగులు పారించడం దిల్లీ క్యాపిటల్స్​కే కాదు టీమ్‌ ఇండియాకూ సంతోషాన్ని కలిగించే విషయం అని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌ జరగనున్న నేపథ్యంలో పంత్‌ ఇదే జోరు కొనసాగిస్తూ ముందుకెళ్తే జాతీయ జట్టులోకి తిరిగి రావడం ఖాయమనెే చెప్పాలి.

ఇక ఇదే మ్యాచ్​లో చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోయినప్పటికీ ఆ జట్టు మాజీ కెప్టెన్, స్టార్ ప్లేయర్ ధోనీ మాత్రం వరుస బౌండరీలతో చెలరేగి అభిమానులను ఉర్రూతలూగించాడు. ఈ సీజన్​లో ఆడిన తన తొలి మ్యాచ్​లోనే చెలరేగి ఫ్యాన్స్​లో ఉత్సాహం నింపాడు.

ధోనీ దంచుడే దంచుడు - 8వ స్ధానంలో వచ్చి సిక్సర్ల వర్షం! - IPL 2024 DC VS CSK

వైజాగ్​ మ్యాచ్​ - సీఎస్కేపై దిల్లీ క్యాపిటల్స్​ విజయం - IPL 2024 CSK VS DC

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.