IPL 2024 CSK Dhoni Batting No.9 : చెన్నై సూపర్ కింగ్స్ - పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ధోనీ మొదటి బాల్‌కే ఔట్ అయి నిరాశపరిచాడు. అయితే ధర్మశాల వేదికగా ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ధోనీ నెం.9లో బ్యాటింగ్ రావడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్‌తో సహా పలువురు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. నెం.9లో మహీ బ్యాటింగ్‌కు రావడం మున్ముందు పనికిరాదని, ప్రత్యేకించి ప్లే ఆప్స్‌కు అస్సలు కరెక్ట్ కాదంటూ టీమిండియా మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్నాడు.
"ధోనీ నెం.9లో బ్యాటింగ్‌కు రావడం వల్ల సీఎస్కేకు ఎటువంటి లాభం లేదు. 42 ఏళ్ల వయస్సున్న అతను ఇంకా ఫామ్‌లోనే ఉన్నాడు. బాధ్యత తీసుకుని దానికి తగ్గట్టుగా ఆడాలి. కనీసం 4 నుంచి 5 ఓవర్లు అయినా ఆడాలి. అలాంటిది అతడు చివరి 2 ఓవర్లు లేదా ఒక ఓవర్ కన్నా ముందు బ్యాటింగ్‌కు రావడం సీఎస్కేకు నిరుపయోగంగా మారింది. సీఎస్కే ఒకవేళ ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై అయితే వాళ్లు ఆడే గేమ్స్‌లలో 90 శాతం మ్యాచ్‌లలో గెలవాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ఒక సీనియర్‌గా, ఫామ్‌లో ఉన్న ప్లేయర్‌గా బ్యాటింగ్ ఆర్డర్ కొంచెంపైన ఉండాలి" అని ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు.
"ఎంఎస్ ధోనీ నెం.9 పొజిషన్‌లో బ్యాటింగ్ చేయాలని అనుకుంటే అసలు ఆడకుండా ఉండాల్సింది. అతను ఆడటం కన్నా జట్టులో ఒక పేసర్‌ను తీసుకుంటే బాగుండేది. ఠాకూర్ ఎప్పుడూ ధోనీ మాదిరిగా షాట్‌లు ఆడలేదు. కానీ, మహీ ఎందుకో ఇలాంటి తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. అతని అనుమతి లేకుండా జట్టులో ఏదీ జరగదు. జట్టు పరిస్థితిని చక్కదిద్దడం అతను తీసుకునే నిర్ణయంలోనే ఉంది. అలాంటిది తనకు తానుగా ఇలా దిగజారిపోవడానికి నేనొప్పుకోను" అని భజ్జీ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.
కాగా, ఈ మ్యాచ్‌లో ఒక యార్కర్ విసిరి ధోనీని సున్నాకే వెనక్కు పంపించాడు హర్షల్ పటేల్. ఈ పోరులో సీఎస్కే 9 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేయగా పంజాబ్ 9 వికెట్లు నష్టపోయి 139 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా రుతురాజ్ గైక్వాడ్ జట్టుకు 28 పరుగుల తేడాతో విజయం వరించింది.
దుబేకు ఏమైంది? వరల్డ్‌కప్‌కు ఎంపికైన తర్వాత వరుస డకౌట్లు- ఇలాగైతే కష్టమే! - IPL 2024