Indian Hockey Team Paris Olympics: పారిస్ ఒలింపిక్స్‌లో సత్తాచాటి కాంస్యం ముద్దాడిన భారత పురుషుల హాకీ జట్టు శనివారం దిల్లీ చేరుకుంది. ఈ నేపథ్యంలో ఉదయం నుంచే అభిమానులు భారీ సంఖ్యలో దిల్లీ విమానాశ్రయానికి చేరుకొని ప్లేయర్లకు ఘన స్వాగతం పలికారు. అటు అధికారులు బ్యాండ్ చప్పుళ్లుతో జట్టు సభ్యులకు గ్రాండ్ వెల్కమ్ ఎర్పాటు చేశారు. ఇక సంతోషంలో ప్లేయర్లు బ్యాండ్ చప్పుళ్లకు హుషారుగా స్టెప్పులేశారు. కాగా, గురువారం స్పెయిన్‌తో జరిగిన కాంస్య పతక పోరులో టీమ్ఇండియా సత్తాచాటింది. ఈ మ్యాచ్‌లో 2-1తేడాతో భారత హాకీ జట్టు నెగ్గి కాంస్యం దక్కించుకుంది.
#WATCH | Indian Men's Hockey Team players show their medals as they arrive at Delhi airport after winning bronze at the #ParisOlympics2024 pic.twitter.com/GUvrDkwaRx
— ANI (@ANI) August 10, 2024
ఎయిర్ ఇండియా స్పెషల్ విషెస్: కాంస్యం నెగ్గి పారిస్ నుంచి భారత్‌కు వస్తున్న టీమ్ఇండియా ప్లేయర్లకు విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా కూడా ప్రత్యేక అభినందనలు తెలిపింది. ప్లేయర్లు ప్రయాణించిన ఫ్లైట్‌లో 'ఇండియా హాకీ టీమ్‌కు శుభాకాంక్షలు' అని వాయిస్ అనౌన్స్‌మెంట్‌తో సర్ప్రైజ్ ఇచ్చింది. ఇక రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ సహా దేశంలోని ప్రముఖులు, సెలబ్రిటీలు సైతం హాకీ జట్టుపై ప్రశంసల జల్లు కురిపించారు.
#WATCH | Indian Men's Hockey Team players celebrate as they arrive at Delhi airport after winning a bronze medal at the #ParisOlympics2024 pic.twitter.com/UN5edgVqIJ
— ANI (@ANI) August 10, 2024
#WATCH | Indian Men's Hockey Team players receive a grand welcome as they arrive at Delhi airport after winning a bronze medal at the #ParisOlympics2024 pic.twitter.com/NxGLRDtXRi
— ANI (@ANI) August 10, 2024
వరుసగా రెండోది, మొత్తంగా 13వది - ఈ విజయంతో భారత్‌కు వరుసగా రెండో ఒలింపిక్స్ పతకం రావడం విశేషం. టోక్యో ఒలింపిక్స్‌లోనూ భారత్‌కు కాంస్య పతకం దక్కింది. ఈ క్రమంలో దాదాపు 52 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో వరుసగా రెండు కాంస్య పతకాలు సాధించి అందరి చేత ప్రశంసలు అందుకుంది. అలా మళ్లీ ఇంతకాలానికి ఇప్పుడు పూర్వ వైభవాన్ని కొనసాగించే ప్రయత్నం చేసింది. మొత్తంగా ఒలింపిక్స్‌లో హాకీ జట్టుకు ఇది 13వ పతకం కావడం విశేషం.
India Medals Paris Olympics: పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ ఖాతాలో ఇప్పటివరకు 6 పతకాలు చేరాయి. అందులో ఒకటి రజతం కాగా, మిగిలిన ఐదు కూడా కాంస్యాలే. రజతం జావెలిన్ త్రో లో రాగా, కాంస్యాల్లో ఒకటి రెజ్లింగ్, మిగిలిన నాలుగు షూటింగ్లో వచ్చాయి. రెజ్లింగ్‌లో వినేశ్ ఫొగాట్‌పై అనర్హత వేటు పడడం వల్ల మరో పతకం మిస్ అయ్యింది.
భారత్ ఖాతాలో మరో పతకం - కాంస్య పతకం గెలుచుకున్న హాకీ జట్టు - Paris Olympics 2024 India Hockey