T20 World Cup Final Match India Celebrations : విజయం దోబూచులాడిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ అద్భుత విజయం సాధించడం వల్ల దేశవ్యాప్తంగా అభిమానులు సంబరాలు చేసుకున్నారు. జాతీయ జెండాలు పట్టుకుని వీధుల్లోకి వచ్చి సంతోషం వ్యక్తంచేశారు. బాణసంచా కాలుస్తూ అభిమానాన్ని చాటుకున్నారు. భారత్ రెండోసారి టీ20 ప్రపంచ కప్ ట్రోఫీని గెలుపొందడం వల్ల జమ్ముకశ్మీర్‌లో క్రికెట్ అభిమానులు ఆనందోత్సాహాలను వ్యక్తంచేశారు. ముంబయి విమానాశ్రయంలో క్రికెట్ అభిమానుల సందడి అంతా ఇంతాకాదు. ఆనందం పట్టలేక అనేకమంది నృత్యాలు చేశారు. ముంబయి మెరైన్ డ్రైవ్, నాగ్‌పుర్ సహా పలుచోట్ల అభిమానులు హర్షధ్వానాలు వ్యక్తంచేశారు.
#WATCH | Telangana: Team India fans celebrate the win of India in the T20 World Cup final
— ANI (@ANI) June 29, 2024
(Visuals from Hyderabad) pic.twitter.com/WhswVs9APs
#WATCH | India wins T20 World Cup 2024
— ANI (@ANI) June 29, 2024
Fans burst crackers and celebrate in Hubbali, Karnataka. pic.twitter.com/O5Y4UYJqgO
అభిమానులతో కలిసి బీజేపీ నేత సంబరాలు
బెంగళూరులో పలు వీధులన్నీ క్రికెట్ అభిమానులతో నిండిపోయాయి. కోల్‌కతాలో టీ20 ప్రపంచకప్ నమూనాతో యువత సందడి చేశారు. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో అభిమానులు బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకొన్నారు. కేరళలోని ఎర్నాకులంలో టీమ్ఇండియా అభిమానులు వీధుల్లోకి వచ్చి కేరింతలు కొట్టారు. డ్యాన్స్ చేస్తూ తమ అభిమానాన్నిచాటుకున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌తో పాటు దిల్లీలోని ఇండియా గేట్ వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్న అభిమానులు జాతీయ జెండాలు ప్రదర్శించారు. మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌లో క్రికెట్ అభిమానులతో కలిసి బీజేపీ నేత కైలాష్ విజయవర్గీయ ర్యాలీలో పాల్గొన్నారు. జాతీయ జెండాను ఊపుతూ భారత్ విజయంపై సంతోషం వ్యక్తంచేశారు.
#WATCH | Madhya Pradesh Minister Kailash Vijayvargiya joins the celebrations in Indore after India's victory in the T20 World Cup final pic.twitter.com/Il77PWfRNt
— ANI (@ANI) June 29, 2024
#WATCH पश्चिम बंगाल: भारत के दूसरी बार टी20 विश्व कप जीतने पर कोलकाता में लोगों ने जश्न मनाया। pic.twitter.com/v7JGQC3tYE
— ANI_HindiNews (@AHindinews) June 29, 2024
వెస్టిండీస్‌లో ఫైనల్ మ్యాచ్ జరిగిన బ్రిడ్జ్‌టౌన్ మైదానం వెలుపల భారత అభిమానులు సందడి చేశారు. పెద్ద ఎత్తున కేరింతలు కొడుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. విరాట్ కోహ్లీ టీ-20లకు రిటైర్మెంట్ ఇవ్వడం బాధగా ఉందని పలువురు తెలిపారు. మ్యాచ్ చివర్లో ఉత్కంఠ భరితంగా సాగిందని చెప్పారు. పలు చోట్ల అభిమానులు వీధుల్లోకి వచ్చి బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. డోలు వాయిస్తూ కేరింతలు కొడుతూ భారత విజయాన్ని ఆస్వాదించారు. ఫైనల్ మ్యాచ్ జరిగిన స్టేడియం వెలుపల వందలాది మంది భారత అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. ఇక పదకొండేళ్ల తర్వాత భారత్ ఖాతాలోకి ఐసీసీ ట్రోఫీ చేరింది. చివరిగా 2013లో ధోనీ నాయకత్వంలో ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. అంతకుముందు ధోనీ సారథ్యంలోనే 2007 పొట్టి కప్‌ను సొంతం చేసుకుంది.
#WATCH | Madhya Pradesh: Fans celebrate after India wins T20 World Cup final by beating South Africa in the finals
— ANI (@ANI) June 29, 2024
(Visuals from Indore) pic.twitter.com/n8SXRxGh0Q
17ఏళ్ల నిరీక్షణకు తెర - విశ్వవిజేతగా భారత్ - T20 WORLD CUP 2024 FINAL