Shikhar Dhawan Retirement : ప్రముఖ టీమ్ ఇండియా క్రికెటర్ శిఖర్ ధావన్ సంచలన నిర్ణయం ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. ఇంటర్నేషనల్, డొమెస్టిక్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ మేరకు ఓ ఎమోషనల్ వీడియో విడుదల చేశాడు. శిఖర్ ధావన్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు క్రికెట్ ఫ్యాన్స్‌లో షాకింగ్‌గా మారింది. కాగా, కొంత కాలంగా శిఖర్ ధావన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతాడనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే అతడు ఈ నిర్ణయాన్ని ప్రకటించాడు.
"ఇండియా కోసం ఆడాలనే ఎంతో కష్టపడ్డాను, తపించాను. అది జరిగింది. ఈ ప్రయాణంలో నాకు ఎంతో మంది అండగా నిలిచారు. నాకు కుటుంబం, చిన్ననాటి కోచ్ ఇంకా పలువురి వల్ల ఈ స్థాయికి వచ్చాను. దేశం తరఫున ఆడినందుకు ఎంతో గర్వంగా, ఆనందంగా ఉంది. ఇప్పుడు నేను ఇంటర్నేషనల్, డొమెస్టిక్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటిస్తాను. నా క్రికెట్ ప్రయాణంలో ఈ అధ్యాయాన్ని ముగిస్తున్నాను. లెక్కలేనన్ని మధుర జ్ఞాపకాలను, కృతజ్ఞతా భావాన్ని నా వెంట తీసుకువెళ్తున్నాను. నాకు అవకాశాలు ఇచ్చిన బీసీసీఐ, అలాగే నాకు ప్రేమను పంచి అండగా నిలిచిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు. జై హింద్!" అని వీడియోలో శిఖర్ ధావన్ పేర్కొన్నాడు.
టీమ్ఇండియా ఓపెనర్‌గా, ఐపీఎల్లో పంజాబ్ కింగ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. దాదాపుగా ప్రతీ ఐసీసీ టోర్నమెంట్లోనూ శిఖర్ ధావన్ తనదైన ముద్ర వేశాడు. అయితే కొంత కాలంగా శిఖర్ ధావన్‌కు టీమ్ సెలక్షన్లో తగిన ప్రాధాన్యత దక్కడం లేదు. ఫామ్ విషయంలోనూ అతడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. అలా అతడి వయసు కూడా పెరుగుతుండటంతో శిఖర్ ధావన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇకపోతే శిఖర్ ధావన్ క్రికెట్ కెరీర్లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు.
Shikhar Dhawan Career Records : శిఖర్ ధావన్ తన కెరీర్లో 167 వన్డేలు, 34 టెస్టులు, 68 టీ20లు ఆడాడు. 167 వన్డేల్లో 6,793 పరుగులు చేశాడు. 34 టెస్టుల్లో 2,315 పరుగులు, 68 టీ20ల్లో 1,759 పరుగులు సాధించాడు. ఇక వన్డేల్లో 17, టెస్టుల్లో 7 శతకాలు నమోదు చేశాడు గబ్బర్.
#WATCH | Indian cricketer Shikhar Dhawan announces retirement from international, and domestic cricket.
— ANI (@ANI) August 24, 2024
He tweets, " as i close this chapter of my cricketing journey, i carry with me countless memories and gratitude. thank you for the love and support..."
(source - shikhar… pic.twitter.com/fGQ9F9mlk0
టెస్టు సిరీస్ - అసలేంటీ 'రెస్ట్ డే'? - What is Rest Day in Cricket
శ్రేయస్ అయ్యర్ సిస్టర్ ఎవరో తెలుసా? - ఇన్‌స్టాలో వెరీ ఫేమస్! - Shreyas Iyers Sister Shresta Iyer