ETV Bharat / sports

తొలి వన్డే - భారత జట్టు ఓటమి! - INDIA WOMEN VS AUSTRALIA WOMEN

ఆసీస్‌ పర్యటనకు వచ్చిన భారత మహిళా జట్టుకు ఎదురైన ఓటమి - తొలి వన్డేలో ఐదు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా విజయం.

India Women Vs Australia Women 1st ODI
India Women Vs Australia Women 1st ODI (source IANS)
author img

By ETV Bharat Sports Team

Published : Dec 5, 2024, 4:01 PM IST

India Women Vs Australia Women 1st ODI : ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో భారత మహిళా జట్టు పరాజయం చూసింది. ఈ పోరులో ఆతిథ్య ఆస్ట్రేలియా, భారత మహిళా జట్టును 5 వికెట్ల తేడాతో చిత్తు చేసింది

మొదట బ్యాటింగ్​కు దిగిన టీమ్‌ ఇండియా 100 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ తర్వాత లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా కూడా తడబాటకు గురైంది. లక్ష్యం 101 పరుగులే కావడం వల్ల వికెట్లు పడినా కూడా ఆస్ట్రేలియా పెద్దగా ఇబ్బంది పడలేదు. కేవలం 16.2 ఓవర్లలోనే ఐదు వికెట్లను కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు జార్జియా వోల్ (46; 42 బంతులు 6 ఫోర్లు, 1 సిక్స్​), ఫోబ్ లిట్చ్‌ ఫీల్డ్‌ (35; 29 బంతులు 8 ఫోర్లు) మంచిగానే రాణించారు. ఎల్లిస్​ పెర్రీ, బెత్ మూనీ, అన్నాబెల్ సుదర్​ల్యాండ్, అష్లెగ్ గార్డ్నర్​, తాహ్లియా మెక్​గ్ర్​ విఫలమయ్యారు. భారత బౌలర్లలో రేణుకా ఠాకూర్ 3, ప్రియా మిశ్రా 2 వికెట్లు పడగొట్టారు.

భారత్ డౌన్ - కెరీర్‌లో మొదటి వన్డే ఆడుతోన్న ఆస్ట్రేలియా బౌలర్ మెగాన్ స్కట్ (5/19) ఐదు వికెట్ల ప్రదర్శనతో అదరగొట్టింది. భారత్‌ బ్యాటర్లను బెంబేలెత్తించింది. భారత బ్యాటర్లలో జెమీమా రోడ్రిగ్స్ (23) టాప్‌ స్కోరర్​గా నిలిచింది.

ఆమెతో పాటు హర్లీన్ డియోల్ (19), కెప్టెన్​ హర్మన్ ప్రీత్ కౌర్ (17), రిచా ఘోష్ (14) మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. ఓపెనర్లు ప్రియా పునియా (3), స్మృతీ మంధాన (8), దీప్తి శర్మ (1), సైమా ఠాకూర్ (4), టిటాస్ సధు (2), ప్రియా మిశ్రా (0) పరుగులు చేశారు ఆసీస్‌ బౌలర్లలో మెగాన్ స్కట్‌ (6.2-1-19-5) వికెట్లు పడగొట్టగా, కిమ్ గార్త్, గార్డెనర్, సదర్లాండ్, అలానా కింగ్‌ తలో వికెట్ దక్కించుకున్నారు.

కాగా, ఈ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో భారత్ మహిళ జట్టు మూడు వన్డేల మ్యాచ్ ఆడనుంది. రెండో వన్డే బ్రిస్బేన్‌ వేదికగా డిసెంబర్‌ 8న జరుగనుంది. మూడో మ్యాచ్ డిసెంబర్ 11న నిర్వహించనున్నారు.

రోహిత్, రాహుల్ ఓపెనింగ్ ఎవరు?- క్లారిటీ ఇచ్చేసిన హిట్​మ్యాన్

ఆసక్తిగా మారిన బీసీసీఐ కొత్త చీఫ్​ రేస్​? - పోటీలో ఎవరెవరు ఉన్నారంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.