ETV Bharat / sports

హై వోల్టేజ్ మ్యాచ్​కు పిచ్ కష్టాలు- భారీ స్కోర్లు సాధ్యమేనా? - T20 World Cup 2024 - T20 WORLD CUP 2024

Ind vs Pak T20 World Cup: పొట్టికప్ టోర్నమెంట్​లో అసలైన పోరుకు రంగం సిద్ధమైంది. ఆదివారం న్యూయర్క్ వేదికగా భారత్- పాకిస్థాన్ జట్లు తలపడనుంది.

Ind vs Pak T20 World Cup
Ind vs Pak T20 World Cup (Source: Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 9, 2024, 4:06 PM IST

Ind vs Pak T20 World Cup: 2024 టీ20 వరల్డ్​కప్​లో హై వోల్టేజ్ మ్యాచ్​ భారత్- పాకిస్థాన్ ఫైట్​కు సర్వం సిద్ధమైంది. రెండు బలమైన జట్ల మధ్య పోరుకు యావత్ క్రీడా ప్రపంచం ఎదురుచూస్తోంది. ఇక సాధారణంగానే ఇండోపాక్ మ్యాచ్​కు అదరణ ఎక్కువగా ఉంటుంది. అయితే పొట్టికప్​ టోర్నీలో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్​ల్లో భారత్​దే పైచేయి. 2021 వరల్డ్​కప్​లో తప్ప పాక్​తో తలపడిన అన్ని మ్యాచ్​ల్లో టీమ్ఇండియా నెగ్గింది. ఇక ఇదే జోరు ఆదివారం నాటి మ్యాచ్​లోనూ కొనసాగించాలని టీమ్ఇండియా ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

భారీ స్కోర్లు కష్టమే: అయితే భారత్- పాక్ మ్యాచ్ అంటే అభిమానులు భారీ స్కోర్లు ఆశిస్తారు. రోహిత్ భారీ సిక్సర్లు, విరాట్ కోహ్లీ కవర్ డ్రైవ్​లు, సూర్య 360 డిగ్రీల ఆట చూడాలని అనుకుంటారు. అయితే ఈ మ్యాచ్​లో ఆ మెరుపులేవీ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈ దాయాదుల పోరుకు ఆతిథ్యమిస్తున్న న్యూయార్క్ నసావు క్రికెట్ స్టేడియం బ్యాటింగ్​కు ఏ మాత్రం సహకరించట్లేదు. అందుకు ఇదే టోర్నీలో ఇదివరకు ఈ స్టేడియంలో జరిగిన శ్రీలంక- సౌతాఫ్రికా, ఐర్లాండ్- భారత్, కెనడా- ఐర్లాండ్, నెదర్లాండ్స్- సౌతాఫ్రికా మ్యాచ్​లే నిదర్శనం. ఇందులో రెండుసార్లు 100లోపు స్కోర్లతోనే మ్యాచ్​లు ముగిశాయి. మరోరెండు మ్యాచ్​ల్లో ఏ జట్టు కూడా 140 కూడా దాటలేదు. దీంతో భారత్- పాక్ పోరు కూడా లో స్కోరింగ్ మ్యాచ్​ అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇక హై వోల్టేజ్​ మ్యాచ్​ అంటే భారత్ బ్యాటర్లు vs పాకిస్థాన్ పేసర్లు అనేలాగా ఉంటుంది. ఇదివరకు జరిగిన మ్యాచ్​ల్లోనూ ఇదే కొనసాగింది. పదునైన పేస్ దళం పాక్ సొంతం. అయితే షహీన్ షా అఫ్రిదీ, మహ్మద్ ఆమిర్ బుల్లెట్ లాంటి బంతులను ఎదుర్కొవడం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి ఇప్పుడున్న ఫామ్​లో పెద్ద కష్టమేమీ కాదు. ఇక బౌలింగ్​ అనుకూలించే పిచ్​పై మన పేసర్లు బుమ్రా, అర్షదీప్ కూడా చెలరేగే ఛాన్స్ ఉంది.

పొంచి ఉన్న వర్షం ముప్పు: ఈ మ్యాచ్​కు వర్షం పడేందుకు 51 శాతం అవకాశమున్నట్లు తెలుస్తోంది. అయితే అమెరికాలో మ్యాచ్ ఉదయం జరుగుతుండడం వల్ల ఆట తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఏమీ లేదు. కానీ, పదే పదే వర్షం అంతరాయం కలిగిస్తే, పూర్తి ఓవర్ల మ్యాచ్ చూడగలమా అనేది డౌటే. ఒకవేళ మ్యాచ్ పూర్తిగా రద్దైతే ఇరుజట్లకు చెరో పాయింట్ లభిస్తోంది.

భారత్​ x పాకిస్థాన్ మ్యాచ్​ - 'ఈ సారి కోహ్లీ అలా చేయకపోతే మంచిది' - T20 World Cup 2024

భారత్ x పాక్: టీ20 వరల్డ్​కప్​లో దాయాదుల చరిత్ర- 2007 నుంచి ఎలా సాగిందంటే? - T20 World Cup 2024

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.